Dhanasu rasi 2024: న్యూఇయర్ లో ధనస్సు రాశివారు ఊహించని శుభవార్తలు వింటారు.

First Published | Dec 23, 2023, 2:58 PM IST

మనమంతా న్యూ ఇయర్ లోకి అడుగుపెడుతున్నాం. మరి ఈ 2024లో ధనస్సు రాశివారికి ఎలా ఉందో చూద్దాం.. ఈ ఏడాది ధనస్సు రాశివారు ఈ సంవత్సరం శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. వృత్తిరీత్యా ఇబ్బందులు తొలిగిపోతాయి. అన్ని వ్యవహారాల్లోనూ మీకు అందరూ సహకరించటం మెదలువుతుంది.

Sagittarius
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

ధనస్సు   రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం (2024 జనవరి నుంచి 2024 డిసెంబర్) ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఏయే నెలలు కలిసి వస్తుంది...ఎప్పుడు  ఇబ్బందులు ఉంటాయి ... రాశి వార్షిక ఫలాలు లో తెలుసుకుందాం

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

గురు:- ఏప్రిల్ నెలాఖరు వరకు పంచమ స్థానంలో సంచరించి మే నెల నుండి శత్రు స్థానంలో సంచారము.

శని:- ఈ సంవత్సరమంతా తృతీయ  స్థానంలో సంచారము.

రాహు:-ఈ సంవత్సరమంతా చతుర్ధ స్థానంలో సంచారము.

కేతు:-ఈ సంవత్సరమంతా రాజ్య స్థానంలో సంచారము.
 


Sagittarius - Dhanu


ఈ సంవత్సరం శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. వృత్తిరీత్యా ఇబ్బందులు తొలిగిపోతాయి. అన్ని వ్యవహారాల్లోనూ మీకు అందరూ సహకరించటం మెదలువుతుంది. ధనం వెసులుబాటు బాగుంటుంది. అయితే పరిస్దితులు ఎంత చక్కబడినా, ఎంత లాభదాయకంగా అనిపించినా,  వ్యాపారులు చాలా జాగ్రత్తలు వహిస్తూ వ్యాపారాలు చేయాల్సిన పరిస్దితి గోచరిస్తోంది.అలాగే ఎంత కాదనుకున్నా  వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి తరచుగా చికాకులు వస్తుంటాయి. సాధ్యమైన మేరకు మితభాషణ మంచిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఖర్చులు నియంత్రించలేని స్థితి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ క్రమంలో ఉద్యోగులకు వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. వీరి పనితీరుని అధికారులు ప్రశంసిస్తారు. కొందరికి పదోన్నతులు కలుగవచ్చు. 

Latest Videos

click me!