మన జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. జుట్టు సంరక్షణ కోసం రెగ్యులర్ గా తలస్నానం చేయడం అవసరం. కొందరు తమ జుట్టూ ఆరోగ్యంగా ఉండాలని రోజూ తలస్నానం చేస్తూ ఉంటారు. మరి కొందరు.. తమ వర్క్ బిజీలో పడి.. ఉదయం పూట కుదరక.. రాత్రిపూట తలస్నానం చేస్తూ ఉంటారు.
రాత్రిళ్లు తలస్నానం మంచిదేనా?
ఉదయాన్నేే టైమ్ లేదని.. పగలంతా ఇంటి పని, ఆఫీసు పనితో అలసట వస్తోందని, అందుకే రాత్రిపూట తలస్నానం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ జోతిష్యశాస్త్రం మాత్రం స్త్రీలు రాత్రిపూట తలస్నానం ేయకూడదు అని చెబుతోంది. దీని వెనక కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
రాత్రిళ్లు తలస్నానం చేస్తే లక్ష్మీదేవికి కోపం
లక్ష్మీదేవికి కోపం వస్తుంది:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్త్రీలు రాత్రిపూట తలస్నానం చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. రాత్రిపూట తలస్నానం చేస్తే కుటుంబానికి కష్టాలు వస్తాయి. స్త్రీలను గృహలక్ష్మిగా భావిస్తారు కాబట్టి, వారు రాత్రిపూట తలస్నానం చేయడం మంచిది కాదు.
రాత్రిళ్లు తలస్నానం వద్దు
ఇంట్లో సిరిసంపదలు ఉండవు:
స్త్రీలను గృహలక్ష్మిగా భావిస్తారు కాబట్టి, వారు రాత్రిపూట తలస్నానం చేస్తే ఇంట్లో సిరిసంపదలు ఉండవు. శాస్త్రం ప్రకారం రాత్రిపూట తలస్నానం చేస్తే గ్రహాలు, నక్షత్రాల దిశ మారుతుంది. దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఇంట్లో దరిద్రం వస్తుంది. అందుకే రాత్రిపూట స్త్రీలు తలస్నానం చేయకూడదు.
రాత్రిళ్లు తలస్నానం చేయకూడదని శాస్త్రీయ కారణాలు
రాత్రిళ్లు తలస్నానం చేయకూడదని శాస్త్రీయ కారణాలు:
- రాత్రిపూట తలస్నానం చేసి, తడి జుట్టుతో పడుకుంటే జుట్టు చిట్లిపోయే ప్రమాదం ఉంది. రాత్రిపూట తలస్నానం చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి.
- తడి జుట్టుతో పడుకుంటే జుట్టు రాలిపోతుంది. పడుకున్నప్పుడు తల తిప్పుకుంటే జుట్టు చిక్కుకుపోతుంది. దీనివల్ల జుట్టు రాలిపోతుంది, చిట్లిపోతుంది. అందుకే తడి జుట్టుతో పడుకోకూడదు.
- తడి జుట్టుతో పడుకుంటే తలలో ఫంగస్ పెరుగుతుంది. దీనివల్ల తలలో అలెర్జీ, చుండ్రు వస్తుంది. తడి జుట్టుతో పడుకుంటే తలనొప్పి, జలుబు, దగ్గు, జ్వరం వస్తుంది.
పైన చెప్పిన కారణాల వల్ల రాత్రిపూట తలస్నానం చేయడం మంచిది కాదు.