ఈ రాశులవారు ఇతరులను పెద్దగా పట్టించుకోరు..!

First Published Sep 19, 2022, 3:48 PM IST

మనిషి ఎదురుగా ఉన్నప్పుడు లేదా.. ఫోన్ లో మాట్లాడేటప్పుడు మనం ఎదుటివారి స్పందన ఎప్పుడు వస్తుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. కానీ... అలా కాకుండా.. మనం మెసేజ్ చేస్తే ఎదుటి వారి నుంచి ఎప్పుడు రిప్లై వస్తుందో చెప్పలేం.

texting

మనం మాట్లాడిన దానికి.. ఎదుటివారు కూడా స్పందించి రిప్లై ఇస్తేనే దానిని సంభాషణ అంటారు. అలా కాకుండా.. ఎదుటి వారి నుంచి స్పందన లేకుంటే.. దానిని ఒక్కరే ఏకపాత్రాభినయం చేసినట్లు అవుతుంది. మనిషి ఎదురుగా ఉన్నప్పుడు లేదా.. ఫోన్ లో మాట్లాడేటప్పుడు మనం ఎదుటివారి స్పందన ఎప్పుడు వస్తుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. కానీ... అలా కాకుండా.. మనం మెసేజ్ చేస్తే ఎదుటి వారి నుంచి ఎప్పుడు రిప్లై వస్తుందో చెప్పలేం. ముఖ్యంగా ఈ కింద రాశుల వారు టెక్ట్ మెసేజ్ లకు అస్సలు రిప్లై ఇవ్వరట. మరి అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం...

1.మేషరాశి
మేషరాశి సాధారణంగా పెద్దగా బిజీగా ఉండరు. కానీ వీరు.. ఎవరైనా టెక్ట్స్ మెసేజ్ చేస్తే మాత్రం పెద్దగా స్పందించరు. వారు అలా చేయడానికి కారణం ఉందట. వారు ప్రతిస్పందించడానికి ఎక్కువ సమయం తీసుకుంటే, మీ సందేశం వారి ప్రాధాన్యత జాబితాలో లేదని అర్థం. ఈ రాశివారు ఇతరుల అవసరాల కంటే... తమకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.  అందుకే వారు తొందరగా విజయం సాధిస్తూ ఉంటారు.  వీరు కేవలం ముఖ్య పనుల విషయాలపై మాత్రమే ఎక్కువ శ్రద్ధ పెడతారు. అనవసరపు మెసేజ్ లకు వీరు పెద్దగా స్పందించరు.

వృషభరాశి

వృషభ రాశి వారి విషయానికి వస్తే.... వీరు కూడా తొందరగా...మెసేజ్ లు చేయడానికి ఆసక్తి చూపించరు. వీళ్లు రిప్లే ఇవ్వకపోవడానికి కారణం ఉంది. వీరికి.. మెసేజ్ చేయాలనే ఉంటుంది. కానీ... వారి మనసులోని విషయాన్ని మెసేజ్ రూపంలో చెప్పడం వీరికి సరిగా రాదు. వీరికి తమ ఫీలింగ్స్ ని మెసేజ్ రూపంలో చెప్పడం రాదు. అందుకే... అలాంటి వాటికి కాస్త దూరంగా ఉంటారు. 

మిధునరాశి
మిథునరాశి వారికి బద్దకం చాలా ఎక్కువ. ఏదైనా విషయం ఉంటే.. రెండు నిమిషాలు ఫోన్ లో మాట్లాడితే సరిపోతుంది కదా.. గంటలు తరపడి మెసేజ్ లు ఏం చేస్తాం అని ఫీలౌతూ ఉంటారు. ఒక వేళ మెసేజ్ చేయాలని అనిపించినా.. ఏది ముఖ్యమైనదో.. ఏది కాదో వీరు సరిగా అర్థం చేసుకోలేరు. 

కన్యారాశి...
కన్య రాశివారు మెసేజ్ లు చేయడం టైమ్ వేస్ట్ పనిగా భావిస్తారు. అందుకే వారి ఫోన్ లో మెసేజ్ లు కుప్పలుగా వచ్చినా... వాటిని పెద్దగా పట్టించుకోరు. ఏ పనీ లేకుండా ఖాళీగా ఉంటే అప్పుడు ఆలోచిస్తారు. వారు ఇతర పనిలో బిజీగా ఉంటే, వారు మీ సందేశాన్ని సరిగ్గా చేయకుండా ప్రత్యుత్తరం ఇవ్వలేరు. ఇక వీర సమాధానం ఇవ్వాలి అనుకున్నా.. దానికి కూడా చాలా సమయం తీసుకుంటారు.

click me!