ధనమేరా అన్నిటికీ మూలం అని పెద్దలు చెబుతుంటారు. డబ్బు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. మన రోజువారీ అవసరాలను తీర్చడానికి ఖచ్చితంగా డబ్బు అవసరం. కానీ జీవితంలో ఒక వ్యక్తి ఆర్థిక పరిమితులను ఎదుర్కోవాల్సిన సమయం వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఆర్థిక శ్రేయస్సును ఆకర్షించడానికి, ప్రకృతిలోని ఐదు అంశాలకు వాటి పరిసరాలతో సామరస్యాన్ని ఎల్లప్పుడూ కొనసాగించాలి. ప్రకృతి 5 అంశాలు - అగ్ని, నీరు, భూమి, గాలి , ఆకాశం. . ఈ 5 భాగాలలో ఒక్కటి బ్యాలెన్స్ లో లేకపోయినా సమస్యలో పడతాం. ఇంట్లో అయితే.. వాస్తు దోషం ఏర్పడుతుందట.