మీ రాశి ప్రకారం.. మీకు ఎలాంటి లైఫ్ పార్ట్ నర్ దొరుకుతారో చెప్పేయవచ్చు తెలుసా..?

First Published Oct 26, 2021, 1:47 PM IST

ఏ రాశివారికి ఎలాంటి పార్ట్ నర్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఎలాంటివారు వారికి బాగా సెట్ అవుతారు. అనే విషయాన్ని జోతిష్యశాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. మరి ఏ రాశివారికి ఎలాంటి  పార్ట్ నర్ లభించనున్నారో ఇప్పుడు చూద్దాం..

astrology


ఎవరి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుంది..? నెక్ట్స్ ఏం జరుగుతుంది..? ఇలాంటి విషయాలను ఎవరం ఊహించలేం. అయితే.. జోతిష్య శాస్త్రం ప్రకారం మాత్రం కొన్ని ఊహించవచ్చు.  ఈ క్రమంలో.. ఏ రాశివారికి ఎలాంటి పార్ట్ నర్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఎలాంటివారు వారికి బాగా సెట్ అవుతారు. అనే విషయాన్ని జోతిష్యశాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. మరి ఏ రాశివారికి ఎలాంటి  పార్ట్ నర్ లభించనున్నారో ఇప్పుడు చూద్దాం..

మేష రాశి..

మేష రాశివారికి సాహసాలు ఎక్కువగా ఇష్టపడతారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశివారు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. అలా అని ఎవరితోనూ కలవరు అనుకోవద్దు. వీరు అందరితోనూ సరదాగానూ ఉంటారు. ఈవెంట్స్, పార్టీలలో పాల్గొంటారు. వీరి జీవితంలోకి వచ్చిన వారు కూడా వీరితో చాలా సరదాగా ఉంటారు. లైంగిక ఆసక్తి ఎక్కువగా ఉన్నవారు వీరి జీవితంలోకి వచ్చేస్తారు.
 

వృషభ రాశి..
ఈ రాశివారు డబ్బుకి ఎక్కువ విలువ ఇస్తారు. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి.. ఈ రాశివారు తమ జీవితంలోకి వచ్చేవారు కూడా అలనే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండేవారు రావాలని కోరుకుంటారు. ఈ రాశివారికి సెక్స్ విషయంలోనూ, నమ్మకం విషయంలోనూ ఉత్తమంగా ఉండే పార్ట్ నర్ రావాలని కోరుకుంటారు.

మిథున రాశి..
మిథున రాశివారు మేథో ఆసక్తి చాలా ఎక్కువ. వీరు ఎవరితోనైనా ఆసక్తికర సంభాషణలు చేయడం, హాస్య భరితంగా ఉండటం  చాలా ఇష్టం. ఇక జీవిత భాగస్వామి విషయానికి వస్తే..  తమ పట్ల ఎక్కువ శ్రద్ద చూపిస్తూ.. తమను ప్రేమగా చూసుకునే వ్యక్తిని కోరుకుంటారు. చిన్ని చిన్న విషయాలకే ఎక్కువగా ఆనందపడేవారికి.. ఈ రాశివారు ఎక్కువగా ఆకర్షితులౌతుంటారు.

కర్కాటక రాశి..
ఈ రాశివారికి ఆహారం మీద ఆసక్తి ఎక్కువ. కాబట్టి.. తమ జీవితంలోకి వచ్చే వారు కూడా ఆహారం తినేవారు.. దాని పట్ల ఆసక్తి ఉన్నవారు రావాలని కోరుకుంటారు.  కర్కాటక రాశివారికి కుటుంబం పట్ల శ్రద్ధ ఎక్కువ. కాబట్టి.. తమ జీవితంలోకి వచ్చేవారు.. అదేవిధంగా కుటుంబాన్ని ప్రేమగా చూసుకునేవారు రావాలని కోరుకుంటారు. 
 

సింహ రాశి..
ఈ రాశివారికి జీవితంలో అన్నింటి కన్నా.. నమ్మకం,విథేయతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశివారు ఎక్కువగా తమ జీవితంలోకి ఆత్మ విశ్వాసంతో ఉండేవారికి ఇష్టపడతారు. అలాంటివారికి ఇట్టే ఆకర్షితులౌతూ ఉంటారు. అంతేకాకుండా.. శారీరకంగా చురుకుగా ఉండేవారు కూడా వీరికి బాగా నచ్చుతారు. జీవితంలో ఏం జరిగినా తమకు అండగా ఉండేవారిని వీరు కోరుకుంటారు.

కన్య రాశి..

ఈ రాశివారు చాలా ప్రశాంతంగా ఉంటారు. బుద్ధి తనం ఎక్కువగా ఉండేవారు వీరికి బాగా నచ్చుతారు. అలాంటివారు తమ జీవితంలోకి రావాలని వీరు కోరుకుంటారు. వీరు ఆందోళన పడటాన్ని పెద్దగా ఇష్టపడరు. కాబట్టి..ఎలాంటి గొడవలు లేకుండా.. ప్రశాంతగా ఉండేవారు తమ జీవితంలోకి రావాలని కోరుకుంటారు. తమకు ప్రతి విషయంలో సహకరించేవారు రావాలని కోరుకుంటారు.
 

తుల రాశి..
తులారాశి వారు శృంగారభరితమైన, అంకితభావం దయతో కూడిన  భాగస్వామిని కోరుకుంటారు, అలాగే మీతో సుదీర్ఘమైన, అర్థవంతమైన సంభాషణలలో పాల్గొనగలరు. మీరు కృషికి విలువ ఇస్తారు, కాబట్టి మీరు కోరుకునే వ్యక్తికి నిబద్ధత అవసరం.
 

వృశ్చిక రాశి..
ఈ రాశివారు రిలేషన్స్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోరు కాబట్టి.. తమ జీవితంలోకి వచ్చేవారు.. చాలా నమ్మకంగా ఉండేవారు.. అంకిత భావం కలిగి ఉండేవారు రావాలని కోరుకుంటారు.

ధనస్సు రాశి..
ఈ రాశి అగ్నికి సంకేతం. చాలా శక్తివంతంగా ఉంటారు. మీలాగే సాహసోపేతంగా , స్వతంత్రంగా ఉండే సహచరుడిని వీరు కోరుకుంటారు. వారు విశ్వసనీయంగా విశ్వసనీయంగా ఉండాలని, అలాగే మీ వ్యక్తిగత స్థలాన్ని గౌరవించాలని కూడా మీరు కోరుకుంటారు.

మకర రాశి..

మకర రాశి వారు శృంగారభరితమైన , ఎమోషనల్ గా ఉంటారు. కాబట్టి.. తమ జీవితంలోకి వచ్చే వారు కూడా , అదే లక్షణాలు ఉండాలని కోరుకుంటారు. ఈ రాశివారు స్వతంత్రంగా ఎదుగుతారు.  జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం కోసం కృషి చేస్తారు. తమ జీవితంలోకి వచ్చేవారు కూడా తమకు సహకరించాలని కోరుకుంటారు.

కుంభ రాశి..
కుంభరాశిగా, మీలాగే తెలివైన , ప్రతిదానిపై శ్రద్ధ వహించే వ్యక్తిని మీరు కోరుకుంటారు. మీ సహచరుడు, మీ రాశిచక్రం లాగాే, స్నేహితులు , కుటుంబ సభ్యులతో చాలా సమ్మోహనంగా ఉండాలి. మీతో నిజంగా ధైర్యంగా కొత్త అడుగు వేయడానికి ఇష్టపడే వారి కోసం వెతకుతారు.


మీన రాశి..
మీన రాశివారు ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి.. దయతో చేయి చాపడానికి సంతోషించే వ్యక్తి కోసం చాలా తక్కువ వ్యక్తి కోసం చూడండి. ఒక సంబంధంలో ఎవరైనా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలని , మీరు కూడా విశ్రాంతి తీసుకోవడంలో సహాయపడాలని మీరు కోరుకుంటారు. 

click me!