తులారాశి
తులారాశి వారు గొడవలు ఇష్టపడరు. ప్రశాంతంగా జీవించాలని అనుకుంటారు. కానీ అది కొన్నిసార్లు అతిగా ఆలోచించడానికి దారితీస్తుంది. వారు తీసుకునే నిర్ణయాల వల్ల లాభాలు వస్తాయా? లేక నష్టాలు వస్తాయా అని అంచనాలు వేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురవుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారు చాలా ఎమోషనల్ పర్సన్స్. వారు తమ భావాల గురించి లోతుగా ఆలోచిస్తారు. వారు ఎవరితో మాట్లాడినా అతిగా విశ్లేషిస్తారు. ఇది కొన్నిసార్లు అతిగా ఆలోచించడం, ఆందోళనకు దారితీస్తుంది.