Numerology: పుట్టిన తేదీ, ఏడాది ఆధారంగా మనుషులు వ్యక్తిత్వం, వారి భవిష్యత్తును అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతుంటారు. ఇలా 2026లో జన్మించిన వారి ఆలోచనలు ఎలా ఉంటాయి.? వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది.? లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
న్యూమరాలజీ ప్రకారం 2026 సంవత్సరానికి మూల సంఖ్య 1. ( 2 + 0 + 2 + 6 = 10, 1 + 0 = 1). ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. సూర్యుడు శక్తి, ఆత్మవిశ్వాసం, నాయకత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ కారణంగా 2026లో పుట్టే పిల్లలు ప్రత్యేక వ్యక్తిత్వంతో ఎదగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంక జ్యోతిషం చెబుతోంది.
25
2026లో పుట్టే పిల్లల స్వభావం
ఈ ఏడాది జన్మించిన పిల్లలు ధైర్యంగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. తమ నిర్ణయాలు తామే తీసుకోవాలనుకుంటారు. ఇతరులను అనుసరించడం కన్నా కొత్త దారిలో నడవడం ఇష్టపడతారు. నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉంటాయి. కొన్నిసార్లు మొండితనం, అహంకార భావన కనిపించే అవకాశం కూడా ఉంటుంది.
35
విద్యా ప్రతిభ ఎలా ఉంటుంది
2026లో పుట్టే పిల్లలు తెలివిగా ఆలోచించే శక్తి కలిగి ఉంటారు. కొత్త విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు. సరైన మార్గదర్శనం లభిస్తే చదువులో మంచి ఫలితాలు సాధించగలరు. పోటీ పరీక్షలు, సాంకేతిక రంగాలు, పరిపాలన విభాగాల్లో రాణించే అవకాశాలు కనిపిస్తాయి.
సూర్య ప్రభావం కారణంగా ఈ పిల్లల్లో ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది. పేరు, గుర్తింపు పొందాలనే కోరిక చిన్ననాటి నుంచే కనిపిస్తుంది. సమాజంలో ముందుండి నడిపించే పాత్రలు చేపట్టే అవకాశం ఉంటుంది. బాధ్యత తీసుకోవడంలో వెనుకడుగు వేయరు.
55
తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
ఈ పిల్లల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలంటే చిన్ననాటి నుంచే క్రమశిక్షణ నేర్పాలి. ఓర్పు, సహనం అలవాటు చేయాలి. ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించేలా మార్గనిర్దేశం చేయాలి. అలా చేస్తే 2026లో పుట్టిన పిల్లలు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకునే అవకాశాలు మరింత పెరుగుతాయి.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమచారం, పలువురు పండితులు తెలిపిన విషయాల ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.