న్యూమరాలజీ: ఈ రోజు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది

Published : Jan 27, 2023, 09:00 AM IST

న్యూమరాలజీ ప్రకారం  ఓ తేదీలో పుట్టిన వారి ఇంటికి ప్రత్యేక బంధువులు రావడంతో ఫుల్ బిజీగా ఉంటారు. మీ వ్యక్తిత్వం, అభ్యాసాన్ని మెరుగుపరచడానికి మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. మీ పోటీదారులు మీకు వ్యతిరేకంగా కొన్ని కుట్రలు పన్నొచ్చు.   

PREV
110
న్యూమరాలజీ: ఈ రోజు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది

జోతిష్యం ఎలానో.. న్యూమరాలజీ కూడా అంతే. జోతిష్యాన్ని మీ రాశి ప్రకారం చెబితే... న్యూమరాలజీని మీరు పుట్టిన తేదీ ప్రకారం చెప్పవచ్చట. కాగా.. ఈ న్యూమరాలజీని ప్రముఖ నిపుణులు చిరాగ్ దారువాలా మనకు అందిస్తున్నారు. ఆయన ప్రకారం...  జనవరి 26వ తేదీ న్యూమరాలజీ ప్రకారం మీకు ఈ రోజు ఎలా గడుస్తుందో ఓసారి చూద్దాం..
 

210
Daily Numerology


సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈ రోజు మీరు మీ ఆత్మవిశ్వాసం ద్వారా పరిస్థితులను చక్కదిద్దుతారు. మంచి విజయాన్ని కూడా సాధించే అవకాశం ఉంది. ఏదైనా ఆస్తి సంబంధిత విషయం చిక్కుల్లో ఉంటే దాన్ని ఈ రోజే పరిష్కరించండి. పరిస్థితులు మీకు అనుకూలంగా వస్తాయి. బయటి వ్యక్తులు, స్నేహితుల సలహా మీకు హానికరం. కాబట్టి వారి మాటలను విశ్వసించకండి. మీ స్వంత నిర్ణయాలతోనే ముందుకు వెళ్లండి. పనుల పట్ల కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. వ్యాపారంలో రిస్క్ తీసుకునే కార్యకలాపాలకు దూరంగా ఉండండి. కుటుంబ సమస్యలపై భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది.
 

310
Daily Numerology

సంఖ్య 2 (ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఇంటి అలంకరణ, నిర్వహణ సంబంధిత పనులు, షాపింగ్‌లో ఎక్కువ సమయం గడుపుతారు. ఇంటి పెద్దలను జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ల ఆశీస్సులు, ఆప్యాయతలు మీకు ప్రాణదాతగా పనిచేస్తాయి. విద్యార్థులు  ప్రాజెక్ట్‌లో విజయం సాధించకపోవడంతో నిరాశ చెందుతారు. కానీ ప్రయత్నిస్తే విజయం మీ సొంతం అవుతుంది. అందుకే ప్రయత్నిస్తూనే ఉండండి. ఖర్చు చేసేటప్పుడు మీ బడ్జెట్‌ను కూడా గుర్తుంచుకోండి. అన్ని ప్రతికూల పరిస్థితులే ఉండటంతో ప్రస్తుతం మీ వ్యాపార కార్యకలాపాలు సాధారణంగానే ఉంటాయి.

410
Daily Numerology


సంఖ్య 3 (ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈ రోజు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అందుకే అన్ని పనులను పూర్తిచేయండి. అంతా మంచే జరుగుతుంది. దీంతో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సానుకూల పురోగతి ఉన్న వ్యక్తులతో సంబంధాలు పెరుగుతాయి. కొంతమంది వ్యక్తులు అసూయతో మిమ్మల్ని విమర్శించొచ్చు. అలాంటి వారికి దూరంగా ఉండండి. వారితో వాదించకండి. ఇంట్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బయటి పనులు, మార్కెటింగ్ సంబంధిత పనులలో ఈరోజులో ఎక్కువ సమయం గడుపుతారు.
 

510
Daily Numerology

సంఖ్య 4 (ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఇంటికి ప్రత్యేక బంధువులు రావడంతో మీరు ఫుల్ బిజీగా ఉంటారు. మీ వ్యక్తిత్వం, అభ్యాసాన్ని మెరుగుపరచడానికి మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. మీ పోటీదారులు మీకు వ్యతిరేకంగా కొన్ని కుట్రలు పన్నొచ్చు. కాబట్టి చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. జాగ్రత్త. మీ కోపం , ప్రేరణలను నియంత్రించండి. మీ ప్రశాంతత, మీ మంచితనం మిమ్మల్ని గౌరవంగా ఉంచుతుంది. 

610
Daily Numerology

సంఖ్య 5 (ఏదైనా నెలలో 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

 మీ సామర్థం ఏంటో ఈ రోజు ప్రజలు తెలుసుకుంటారు. అందుకే ప్రజల గురించి చింతించకండి. మీ మనస్సుకు అనుగుణంగా పనులపై దృష్టి పెట్టండి. అయితే మీ గురించి పుకార్లు పుట్టుకొస్తాయి. ఇలాంటి మాటల వల్ల మానసిక ప్రశాంతత కరువవుతుంది. విజయం సాధించడం వల్ల అహం, అహంకారం మీపై ఆధిపత్యం చెలాయిస్తాయి జాగ్రత్త.. ఈ రోజు  మీ పనులన్నీ సజావుగా పూర్తి అవుతాయి. 
 

710
Daily Numerology

సంఖ్య 6 (ఏదైనా నెలలో 6, 15 లేదా 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

నేటి గ్రహ సంచారం మిమ్మల్ని  ప్రయోజనకరమైన, సంతోషకరమైన స్థితిలో ఉంచుతుంది. కాబట్టి ఏకాగ్రతతో మీ పనులపై దృష్టి పెట్టండి. సోమరితనాన్ని దరికి రానివ్వకండి. అప్పుడే  మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇంట్లో పిల్లలు,  స్నేహితుల కార్యకలాపాలను పర్యవేక్షించడం అవసరం. ఎందుకంటే తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశం ఉంది. ఎవరితోనూ వాదించకుండా అవగాహనతో వ్యవహరించండి.
 

810
Numerology

సంఖ్య 7 (ఏదైనా నెలలో 7, 16, 25 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈ రోజు సమయం, విధి మీకు అనుకూలంగా పనిచేస్తాయి. మీరు చేపట్టిన పని సక్రమంగా జరుగుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో మీ గురించి అపార్థం చేసుకోవచ్చు. ఏదైనా పత్రం లేదా పేపర్‌కు సంబంధించిన ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు సరిగ్గా చదవండి. 
 

910
Daily Numerology

సంఖ్య 8 (ఏదైనా నెలలో 8, 17, 26 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

మతపరమైన తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉది. ఒక ముఖ్యమైన లేదా రాజకీయ వ్యక్తితో సమావేశం ఉంటుంది. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆచరణాత్మక జీవితంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు. బయటి వ్యక్తుల జోక్యం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ రోజు మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తే అవకాశం ఉంది.

1010
Daily Numerology

సంఖ్య 9 (ఏదైనా నెలలో 9, 18, 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

మీ ఆర్థిక ప్రణాళికలను ప్రారంభించడానికి ఈరోజు సరైన సమయం. కాబట్టి ప్రయత్నాన్ని కొనసాగించండి. మంచి విజయం సాధిస్తారు. పెట్టుబడికి సంబంధించిన పనులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది.  సామాజిక కార్యక్రమాల పట్ల మీ నిస్వార్థ సహకారం సమాజంలో మీకు గౌరవాన్ని కలిగిస్తుంది. ఎలాంటి ప్రతికూల సంప్రదింపులకు దూరంగా ఉండండి. మీ రహస్యం బహిర్గతం కావచ్చు. అది మీ కుటుంబానికి చెడు పరిణామాలను కలిగిస్తుంది. మీరు ఒకరి ప్రతికూల ప్రణాళికకు బాధితులుగా కూడా మారొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories