న్యూమరాలజీ: మీ ఆత్మవిశ్వాసమే వారిని ఓడిపోయేలా చేస్తుంది..

Published : Sep 21, 2022, 08:55 AM IST

న్యూమరాలజీ ప్రకారం ఓ తేదీలో పుట్టిన వారు ఈ రోజు దగ్గరి బంధువులకు సహాయం చేయడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. సమాజంలో మీరు మంచి పేరు ప్రతిష్టలు కూడా పొందుతారు.   

PREV
110
 న్యూమరాలజీ:  మీ ఆత్మవిశ్వాసమే వారిని ఓడిపోయేలా చేస్తుంది..

జోతిష్యం ఎలానో.. న్యూమరాలజకీ కూడా అంతే. జోతిష్యాన్ని మీ రాశి ప్రకారం చెబితే... న్యూమరాలజీని మీరు పుట్టిన తేదీ ప్రకారం చెప్పవచ్చట. కాగా.. ఈ న్యూమరాలజీని ప్రముఖ నిపుణులు చిరాగ్ దారువాలా మనకు అందిస్తున్నారు. ఆయన ప్రకారం.. సెప్టెంబర్ 20వ తేదీ న్యూమరాలజీ ప్రకారం మీకు ఈ రోజు ఎలా గడుస్తుందో ఓసారి చూద్దాం
 

210
Daily Numerology

సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19 మరియు 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఒక కొత్త ఆశతో ఈ రోజును ప్రారంభిస్తారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఇతరుల విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం మానుకోండి. ఈ సమయంలో కొన్ని వివాదాలు, గొడవలు జరుగుతున్నాయి. కోపంతో కాకుండా ప్రశాంతంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయం. ఇలాంటి సమయంలో క్షేత్రస్థాయిలో ఏ నిర్ణయం తీసుకున్నా.. సరైనదేనని రుజువవుతుంది.
 

310
Daily Numerology

సంఖ్య 2 (ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
 
ఈ రోజు మీరు దగ్గరి బంధువులకు సహాయం చేయడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. సమాజంలో మీరు మంచి పేరు ప్రతిష్టలను కూడా పొందుతారు. ఏదైన శుభకార్యానికి కూడా వెళ్లొచ్చు. ముందు మీ పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇంటిని చక్కబెట్టడానికి శ్రద్ద అవసరం. ఆగిపోయిన ఈ పనులు మీ సీనియర్ సహాయంతో పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామి మద్దతు మీకెప్పుడూ ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి తొలగిపోతుంది. 

410
Daily Numerology

సంఖ్య 3 (ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈ సమయంలో మీరు మరింత ఎనర్జిటిక్ గా ఫీల్ అవుతారు. ఏ పరిస్థితి వచ్చినా.. మీ సమస్యలను పరిష్కరించుకోండి. యువకులకు తమ మొదటి ఆదాయాన్ని పొందడం ఆనందంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. ఇది మీ ఆత్మగౌరవాన్ని తగ్గించవచ్చు. పిత్రార్జిత ఆస్తికి సంబంధించిన విషయాలు ఇప్పుడు తెరపైకి రావచ్చు. ఈ సమయంలో ఓపిక  చాలా అవసరం. జీవిత భాగస్వామి సలహా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

510
Daily Numerology

సంఖ్య 4 (ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈరోజు మీరు దీర్ఘకాలిక ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. బీమా, పెట్టుబడి మొదలైన ఆర్థిక కార్యకలాపాలలో కూడా పాల్గొనవచ్చు. ఆస్తి వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇంట్లోని పెద్ద వ్యక్తుల సలహాను తీసుకోండి. ప్రస్తుతం ఆదాయంతో పాటు ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అనవసర ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ప్రత్యర్థుల కదలికలను పట్టించుకోవద్దు. కొన్ని చెడ్డ వార్తలు వినడం వల్ల మనసు కృంగిపోతుంది. వ్యాపార పోటీ మీ పనిని ప్రభావితం చేయవచ్చు.
 

610
Daily Numerology

సంఖ్య 5 (ఏదైనా నెలలో 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

మతపరమైన కార్యకలాపాలు చేసే వ్యక్తి సమక్షంలో మీ ఆలోచనలో సానుకూల మార్పు వస్తుంది. జీవితానికి సంబంధించిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది.  ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచండి. అవి పోతే మీరెంతో నష్టపోవాల్సి ఉంటుంది. రోజువారీ మీ ఆదాయం పెరగొచ్చు.  వైవాహిక జీవితం ఆనందంగా గడిచిపోతుంది. మీకున్న విశ్వాసం,  సానుకూల ఆలోచన మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 

710
Daily Numerology

సంఖ్య 6 (ఏదైనా నెలలో 6, 15 లేదా 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఇంట్లో పెద్దవారి సలహా తీసుకుంటే మీకంతా శుభమే జరుగుతుంది. కాబట్టి వారి మాటలను పట్టించుకోకుండా ఉండకండి. స్త్రీలకు ఈ రోజు చాలా ఫలవంతమైనది. ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది మీ బంధువులు మీ గురించి నెగిటీవ్ గా మాట్లాడొచ్చు. ఓపికగా ఉండండి. మానసిక స్థితిని నియంత్రించుకోండి. సంబంధాన్ని చెడిపోకుండా కాపాడుకోండి. అలాగే మీ సామర్థ్యానికి మించి పని చేయడం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వ్యాపార సంబంధిత పోటీలో మీరు మరిన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు.
 

810
Daily Numerology

సంఖ్య 7 (ఏదైనా నెలలో 7, 16 మరియు 25 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

గత కొన్నేళ్లుగా సన్నిహితులతో ఉన్న మనస్పర్థలు పరిష్కారమవుతాయి. రిలేషన్ షిప్ లో ఎలాంటి గొడవలకు తావుండదు. ఆస్తి విభజనకు సంబంధించి ఏదైనా వివాదం ఉంటే.. ఇతరుల సాయంతో పరిష్కారం అవుతుంది. ఈ సమయంలో మీ మానసిక స్థితిని సానుకూలంగా ఉంచడానికి ప్రయత్నించండి. అవగాహన లేకుంటే ఏ పనీ చేయకండి. యువకులు ప్రేమలో పడినా తమ చదువు లేదా కేరిర్ పరంగా వెనకడుగు వేయకూడదు. 
 

910
Daily Numerology

సంఖ్య 8 (ఏదైనా నెలలో 8, 17 మరియు 26 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

సామాజిక సరిహద్దులను మరింత విస్తరిస్తారు. ఈ రోజు మీరు కుటుంబ కార్యక్రమాలతో బిజీగా ఉండొచ్చు. ఇంటి సభ్యుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అవసరమైన వారికి సహాయం చేయడం మీకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది. పెట్టుబడికి సంబంధించిన ఏదైనా పని చేసే ముందు సరైన విచారణ చేయండి. రుణం తీసుకోవడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లయితే.. ఎంత తీసుకోవాలో లెక్కలేసుకోండి.  మీ పని విషయంలో మీ సహోద్యోగుల ఇచ్చే సలహాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. 

1010
Daily Numerology

సంఖ్య 9 (ఏదైనా నెలలో 9, 18 మరియు 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

మీ విశ్వాసం ముందు మీ పోటీదారులు ఓడిపోతారు. పిల్లలు పోటీల్లో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారి హెల్ప్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. బద్ధకం, నీరసం కారణంగా కొన్ని ముఖ్యమైన పనులను విస్మరించవద్దు. ఇంటి పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. వృత్తిపరంగా పెద్ద కంపెనీలో విజయవంతంగా జాయిన్ అవుతారు. జీవిత భాగస్వామి మద్దతు మీ విధిని బలపరుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories