Daily Numerology
సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
ఈరోజు మీరు రాజకీయ నాయకుడి సహాయంతో ఇరుక్కున్న వ్యక్తిగత పనిని పరిష్కరించుకుంటారు. మీ ఫిట్‌నెస్ కోసం మీరు పడే శ్రమ ఫలిస్తుంది. సొసైటీకి సంబంధించిన ఏ విషయంలోనైనా మీ ప్రతిపాదన కీలకం అవుతుంది. మీ పనిలో చాలా ఆటంకాలకు మీ నిర్లక్ష్యం, సోమరితనమే కారణమవుతాయి. ఈ అలవాట్లను మానుకుంటేనే మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. తప్పుడు వాదనలకు దూరంగా ఉండటం మంచిది. కార్యాలయంలో మీ ఉనికి, ఏకాగ్రత అవసరం. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
Daily Numerology
సంఖ్య 2 (ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
ఇంట్లో దగ్గరి బంధువు ఉండటం వల్ల ఉత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఏదైనా మతపరమైన ప్రణాళికను కూడా పూర్తి చేస్తారు. యువత తమ ప్రతిభను గుర్తిస్తారు. పూర్తి శక్తితో మీ భవిష్యత్తు పనులపై దృష్టి పెట్టండి. అపరిచితులను నమ్మకండి. మీ సాధారణ స్వభావాన్ని కొంతమంది వ్యక్తులు ఉపయోగించుకుంటారు. కార్యాలయంలో ఉద్యోగుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ సమస్యలను పరిష్కరించడంలో మీ జీవిత భాగస్వామి, కుటుంబం పూర్తిగా పాల్గొంటారు. వేడి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
Daily Numerology
సంఖ్య 3 (ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
ఈరోజు ఎక్కువ సమయం కుటుంబ బాధ్యతలను నెరవేర్చడానికే వెచ్చిస్తారు. ఏదైనా రాజకీయ కర్తవ్యం ఆగిపోతే ఈరోజే పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. సమయం అనుకూలంగా ఉంది. పిల్లలతో కొంత సమయాన్ని గడిపితే వారిలో మనోధైర్యం పెరుగుతుంది. కొన్ని ప్రతికూల ఆలోచనలు ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మరింత జాగ్రత్త అవసరం. వ్యాపార వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇంట్లో ఏదో ఒక విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి.
Daily Numerology
సంఖ్య 4 (ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
తొందరపడకుండా పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. ఇతరుల తప్పులను క్షమించండి. సంబంధాన్ని మధురంగా ఉంచడానికి మీరు ప్రత్యేక ప్రయత్నం చేస్తారు. తొందరపాటు, అజాగ్రత్త మీ పనులను మరింత దిగజార్చుతుంది. సహనం, శాంతిని కాపాడుకోండి. పిల్లలతో స్నేహంగా ఉండండి. ఆస్తి క్రయ, విక్రయాలకు సంబంధించిన ముఖ్యమైన లావాదేవీలపై ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య శృంగార సంబంధాలు ఏర్పడతాయి. గ్యాస్, మలబద్ధకం సమస్యలు ఉంటాయి.
Daily Numerology
సంఖ్య 5 (ఏదైనా నెలలో 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
ఆధ్యాత్మికతకు సంబంధించిన అద్భుతమైన సమాచారం అందుతుంది. దీతో మీ వ్యక్తిత్వం ప్రభావితమవుతుంది. ప్రభావవంతమైన వ్యక్తులను సందర్శించడానికి, సామాజిక క్రియాశీలతను పెంచడానికి తగిన సమయాన్ని కేటాయిస్తారు. ఎప్పటికప్పుడు ప్రవర్తన మార్చుకోవడం అవసరం. కొన్నిసార్లు మొండితనం, సందేహం స్థితిలో పడిపోవడం బాధిస్తుంది. వ్యక్తిగత సమస్య కారణంగా యువకులు కెరీర్ పనులలో ఇబ్బందులు పడతారు. ఈసారి వ్యాపారం వృద్ధి చెందడానికి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం సౌకర్యంగా ఉంటుంది. వివాహం మధురంగా ఉంటుంది. గత కొంతకాలంగా కొనసాగుతున్న అనారోగ్య సమస్యల నుంచి ఈరోజు కొంత ఉపశమనం పొందుతారు.
Daily Numerology
సంఖ్య 6 (ఏదైనా నెలలో 6, 15 లేదా 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
ఈ రోజు బాగా ప్రారంభమవుతుంది. లక్ష్యాన్ని సాధించడంలో దగ్గరి బంధువు కూడా హెల్ప్ చేస్తాడు. మీ కర్మ ప్రధానం మాత్రమే మీ విధిని రూపొందిస్తుంది. విద్యార్థులకు సైన్స్ రంగాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యక్తిగత పనుల్లో చాలా బిజీగా ఉండడం వల్ల కుటుంబంపై దృష్టి పెట్టలేరు. పిల్లల సమస్యల పరిష్కారానికి కొంత సమయం కావాలి. ఆర్థిక పరిస్థితులు కూడా కాస్త హడావిడిగా ఉంటాయి. వ్యాపార రంగంలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. కుటుంబ జీవితంలో ఎలాంటి అపార్థాలు రానివ్వకండి. గొంతు ఇన్ఫెక్షన్లు, దగ్గు సమస్యలు ఉంటాయి.
Daily Numerology
సంఖ్య 7 (ఏదైనా నెలలో 7, 16, 25 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. సమయాన్ని సౌకర్యవంతంగా మార్చుకోవడానికి కొంచెం శ్రమ అవసరం. మీ ప్రతిభ, సామర్థ్యాలను గుర్తించండి. తోటలు, ప్రకృతిలో కొంత సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో వాతావరణం ఏదో ఒక కారణంగా చెడిపోతుంది. ఇంట్లో పెద్దల పట్ల సరైన గౌరవం ఉంచండి. యువత తమ లక్ష్యాలను సాధించేందుకు తమ వంతు కృషి చేస్తారు. ఈరోజు వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య శృంగార సంబంధాలు ఏర్పడతాయి. శారీరక , మానసిక అలసట ఉంటుంది.
Daily Numerology
సంఖ్య 8 (ఏదైనా నెలలో 8, 17, 26 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
బిజీబిజీగా మారిన దినచర్యలో కొంత మెరుగుదల ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీ పనులు, ప్రయత్నాలు మీకు ప్రతి పనిలో విజయాన్ని అందిస్తాయి. సోదరులతో అనుబంధం మధురంగా ఉంటుంది. ఈ సమయంలో దూరం కాస్త పెరిగే అవకాశం ఉంది. విశ్రాంతి కోసం కుటుంబం, పిల్లలతో కొంత సమయం గడపండి. ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని కాపాడుతూ ఈరోజు మార్కెటింగ్ కార్యకలాపాలలో ఎక్కువ సమయాన్ని వెచ్చించండి. హార్మోన్ సంబంధిత సమస్యలు పెరగొచ్చు.
Daily Numerology
సంఖ్య 9 (ఏదైనా నెలలో 9, 18, 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
కొంత సమయం మీరు సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీరు అనుకున్నది సాధిస్తారు. ఆత్మపరిశీలన ద్వారా మీరు మీ జీవనశైలిని మెరుగుపరచుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. అవసరమైనప్పుడు మీరు మీ శ్రేయోభిలాషుల నుంచి సరైన సహాయం పొందుతారు. ఈ రోజు ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ తొందరపాటు, భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి. నెరవేరని కల నిరాశ కలిగిస్తుంది. ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు చెడిపోవడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార కార్యకలాపాలలో స్వల్ప మందగమనం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సమన్వయం లోపిస్తుంది. స్త్రీలు కీళ్ల నొప్పులతో బాధపడతారు.