
ప్రతి మనిషిలో మంచి తో పాటు చెడు కూడా ఉంటుంది. అయితే.. ఆ మంచి, చెడు ఎంత పాళ్లలో ఉన్నాయి అనే విషయాన్ని బట్టి.. సదరు వ్యక్తి మంచా, చెడా అని చెబుతుంటాం. ఈ సంగతి పక్కన పెడితే... జోతిష్య శాస్త్రం ప్రకారం... ఒక్కో రాశిలో ఉన్న ప్రమాదకర( డేంజర్) లక్షణాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం...
1.మేష రాశి...
మేష రాశిలో ఉన్న ప్రమాదకరమైన లక్షణం కోపం. వీరికి కోపం వచ్చినప్పుడు చుట్టుపక్కన ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఏదైనా విస్పోటనం జరిగినట్లుగానే ఉంటుంది వీరి కోపం. తట్టుకోవడం చాలా కష్టం. ఎవరో ఒకరు బలి కావాల్సిందే. కోపంలో ఎలాంటి మాటలతో అయినా వీరు ఎదుటివారిని బాధ పెడతారు. ఈ ఒక్క విషయం పక్కన పెడితే.. మళ్లీ వీరు మిగిలిన విషయాల్లో చాలా సౌమ్యులు.
2.వృషభ రాశి..
ఈ రాశి వారిలో ఉన్న డేంజర్ లక్షణం మొండినతం. ఈ మొండితనంతో అందరితోనూ వాగ్వాదానికీ, వివాదాలకు వెళుతూ ఉంటారు. అది ఇతరులకు కూడా సమస్య కలిగిస్తుంది. అందరిపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తూ ఉంటారు. తాము అనుకున్నది చేయడానికి వెనకాడరు.
3.మిథున రాశి..
ఈ రాశివారు అందరితోనూ కలిసి ఉండలేరు. వీరితో రిలేషన్ చాలా కష్టంగా ఉంటుంది. వీరిలో ఉన్న డేంజర్ లక్షణం ఇదే. వీరిని ఒక పట్టాన ఏదీ నమ్మలేం. ఎప్పుడు ఎవరిని ఎలా మోసం చేస్తారో కూడా మనం ఊహించలేం.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారికి మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ. వీరికి ఏ ఏమోషన్ వచ్చినా తట్టుకోవడం కష్టమే. కాస్త ప్రేమ ఎక్కువైనా భరించవచ్చు.. కానీ.. వీరికి కోపాన్ని ఎవరం తట్టుకోలేం. ఆ సమయంలో వీరు ఏం చేస్తారో ఎవరూ ఊహించలేరు. ఎదుటివారిని అగౌరపరచడానికి ముందుంటారు.
5.సింహ రాశి..
ఈ రాశివారు చాలా హైపర్ గా ఉంటారు. ఎదుటి వారి నుంచి ఏదైనా ఎలాగైనా తీసుకోగల సత్తా వీరిలో ఉంటుంది. ఎంత మంది ఉన్నా.. వీరి అందరి దృష్టి ఆకర్షిస్తారు. వీరి అటెన్షన్ సీకింగ్ ప్రవర్తన అందరికీ నచ్చకపోవచ్చు.
6.కన్య రాశి..
ఈ రాశివారు బ్రెయిన్ మాస్టర్ మైండ్ లా పనిచేస్తుంది. ఈ మాస్టర్ మైండ్ ని తట్టుకోవడం ఒక్కోసారి ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. ఈ రాశివారు ఎదైనా నేరం చేయాలని అనుకున్నా.. అది కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకే.. అలాంటి విషయాల్లో వీరిని చూస్తే భయం కలగడం సహజం.
7.తుల రాశి..
తులారాశివారు తమ భావోద్వేగాలను చాలా కాలం పాటు పట్టుకుని ఉంటారు. ముఖ్యంగా చెడు విషయాలను వెంటనే మర్చిపోరు.. వాటిని గుర్తుచేసుకొని వారు బాధపడటమే కాకుండా.. ఇతరులను కూడా బాధపెడుతూనే ఉంటారు.
8. వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ముందు ఎవరూ ఎటువంటి తప్పు చేయవద్దు ఎందుకంటే వారి ప్రతీకారం ప్రమాదకరమైనది. వారు తమ మనస్సును నిర్దేశించినట్లయితే వారు మిమ్మల్ని నాశనం చేయగలరు. వారు ఆ క్షణం కోసం వేచి ఉంటారు. సమయం దొరికినప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు.
9. ధనుస్సు రాశి..
ఈ రాశివారిలో ప్రమాదకరమైన విషయం వారి మాటలే. ఎందుకంటే వారి మాటలు చాలా కఠినంగా ఉంటాయి. ఎదుటివారు ఇలాంటి మాటలకు బాధపడతారేమో అనే సందేహం కూడా వీరికి కలగదు. ఎదుటివారికి ఎంతో హాని కలిగిస్తారు.
10.మకర రాశి..
వారు కొన్ని సమయాల్లో జిడ్డుగా ఉంటారు. వీరికి కొంచెం కూడా సానుభూతి అనేది ఉండదు. ఇలా సానుభూతి లేకుండా ప్రవర్తించడం ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మకరరాశిని రుణం కోసం ఎప్పుడూ అడగవద్దు ఎందుకంటే వారి ఉపన్యాసం వారిని మొదట అడిగినందుకు మిమ్మల్ని మీరు అసహ్యించుకునేలా చేస్తుంది.
11.కుంభ రాశి..
ఈ రాశివారు చాలా పెద్ద పెద్ద విషయాలను కూడా మర్చిపోతూ ఉంటారు. ఇది వారితో పాటు.. ఇతరులకు కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. వారు తక్షణ ఫలితాలను కోరుకుంటారు. దీర్ఘకాలిక ప్రాతిపదికన వారి పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా వారు నిర్ణయాలు తీసుకుంటారు.
12.మీన రాశి..
మీన రాశికి చాలా చీకటి సమస్య ఉంది.అది వ్యసనం. మద్యం, మాదకద్రవ్యాలు, జూదం, నొప్పి నివారణ మందులు లేదా ఆహారం కావచ్చు, వారు అనుకోకుండా ఏదైనా ఇష్టపడితే... దాని నుంచి బయటడలేరు.