ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆగిపోయిన పనులు ఈ రోజు పూర్తౌతాయి..!

First Published | Oct 1, 2023, 4:25 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.విలాసవంతమైన ఖర్చులు చేస్తారు.

daily horoscope 2023 New 07

01 అక్టోబర్ 2023,  ఆదివారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)
   
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
పంచాంగం                                                                                                                                                                                                                               
( ఉండ్రాళ్ళ తద్ది)
తేది :.   1   అక్టోబరు 2023
సంవత్సరం :- శోభకృత్
ఆయనం :-దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం :-భాద్రపద మాసం
పక్షం :- కృష్ణపక్షం                                                                   
వారము:-ఆదివారం
తిథి :-  విదియ ప॥12.12 ని॥వరకు
నక్షత్రం : -    అశ్విని రాత్రి 11.09 ని॥వరకు  
యోగం:- వ్యాఘాతం సా॥5.27 ని॥వరకు
కరణం:- గరజి ప॥12.12 వణిజి రాత్రి 11.27 ని॥వరకు
అమృత ఘడియలు:- సా॥4.13 ని॥ల 5.46 ని॥వరకు
దుర్ముహూర్తం:- సా॥ 04:12 ని॥ల సా॥ 05:00 ని॥వరకు                         
వర్జ్యం:- రాత్రి 7.18 ని॥ల 8.51 ని॥వరకు
రాహుకాలం:- సా॥ 04:30 ని॥ల సా॥ 06:00 ని॥వరకు                                                               యమగండం:-మ॥ 12:00 ని॥ల మ॥ 01:30 ని॥వరకు                                                                           
సూర్యోదయం:-   5.54 ని॥లకు
సూర్యాస్తమయం:- 5.48 ని॥లకు

తారాబలం లో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.

telugu astrology

       
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (జన్మతార)చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను.అవసరమైన ఖర్చులు తగ్గించు కొనవలెను.ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.

భరణి నక్షత్రం వారికి (పరమైత్రతార)తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. వాహన ప్రయాణాలను జాగ్రత్త అవసరం. శారీరక శ్రమ పెరుగును.

కృత్తిక నక్షత్రం వారికి ఈవారం (మిత్రతార) తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.పనుల్లో శ్రమ పెరుగుతుంది. కోపావేశాలు తగ్గించుకోవాలి.ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు.అనుకోని సమస్యలు ఎదురవుగలవు. ఈ రోజు వృత్తి ఉద్యోగం నందు అసహనానికి గురి అవుతారు.ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి.ఈ రాశివారు ఈ రోజు సూర్యారాధన లేక ఆదిత్య హృదయం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (మిత్రతార)తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.విలాసవంతమైన ఖర్చులు చేస్తారు.

రోహిణి నక్షత్రం వారికి (నైదనతార)చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను.శ్రమ అధికంగా ఉంటుంది.ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

మృగశిర నక్షత్రం వారికి  (సాధన తార) దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.శుభవార్తలు వింటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారికి ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడను. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి.  ఆగిపోయిన పనులు ఈ రోజు అప్రయత్నంగా పూర్తి కాగలవు.వ్యవహారాలు ఆలోచనలు కలిసిరావు.ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.
 

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి(సాధన తార) తలచిన కార్యాలు పూర్తి అగును.శుభవార్తలు వింటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

ఆరుద్ర నక్షత్రం వారికి (ప్రత్యక్తార)వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.సమాజము నందు అపవాదములు ఎదురవగలవు.అధికారులతోటి వివాదాలు ఏర్పడను.

పునర్వసు నక్షత్రం వారికి  (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును.గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారుల ప్రశంసలు పొందగలరు

దిన ఫలం:-పట్టుదలతో చేసిన పనులలో విజయం సాధిస్తారు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు వివాదాలకు దూరంగా ఉండవలెను. వ్యవహారాల్లో ఓర్పు సహనం తో వ్యవహరించటం మంచిది.కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి తగ్గట్టుగా ధనం లభిస్తుంది. సన్నిహితులతో అకారణంగా వివాదాలు రాగలవు.వ్యాపారములు సామాన్యంగా ఉండును.ఈ రాశి ఈరోజు గణపతి ఆరాధన లేక గణపతి స్తోత్రం పారాయణ చేయట వలన శుభ ఫలితాలు పొందగలరు.
 

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును.గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క ప్రశంసలు పొందగలరు.

పుష్యమి నక్షత్రం వారికి (విపత్తార) అనుకోని కలహాలు రాగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవ గలవు.అవసరమైన ఖర్చులు పెరుగును.

ఆశ్రేష నక్షత్రం వారికి  (సంపత్తార)కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారము నందు ధన లాభం కలుగును.శుభవార్తల వింటారు.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారు ఇతరుల యెక్కవ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండవలెను.ఇంటా బయటా బాధ్యతలు పెరుగును. ఈరోజు ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు.ఉద్యోగంలో బాధ్యతలు పెరుగును.విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరచును. తలపెట్టిన పనులలో ఆలస్యం మైనా వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితులతో అపార్థాలు కలగవచ్చు. అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోవాలి.ఈ రాశి ఈరోజు దుర్గాదేవి ఆరాధన లేక దుర్గా స్తోత్రం పారాయణ చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.
 

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (జన్మతార)చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను.ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.మానసిక భయాందోళన.

పూ.ఫ నక్షత్రం వారికి  (పరమైత్రతార) ధనాధాయ మార్గాల గూర్చి ఆలోచనల చేస్తారు.తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు.అనవసరమైన ఖర్చులు పెరుగును.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (మిత్రతార)తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-ఈ రాశి వారికి ఈ రోజు బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది .చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు.ఉద్యోగం నందు అనుకూలమైన వాతావరణం. వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి.విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఈ రాశి ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన లేక సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.
 

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (మిత్రతార) తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వస్తువులు కొనుగోలు చేస్తారు.

హస్త నక్షత్రం వారికి  (నైదనతార)చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను.శ్రమ అధికంగా ఉండును.ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

చిత్త నక్షత్రం వారికి  (సాధన తార)దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈ రోజు కుటుంబం గూర్చి అధిక ఖర్చు చేస్తారు.జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగం గౌరవప్రదంగా ఉండను. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పొందగలరు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాలు లో పాల్గొంటారు.ఈ రాశివారు ఈరోజు మహాలక్ష్మి ఆరాధన లేక అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.
 

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (సాధన తార)దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.శుభవార్తలు వింటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

స్వాతి నక్షత్రం వారికి  (ప్రత్యక్తార) వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.సమాజము నందు అపవాదములు ఎదురవగలవు.అధికారుల తోటి వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

విశాఖ  నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి.గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈ రోజు అద్భుతమైన అవకాశాలను పొందుతారు.శుభకార్య ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి.శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా పాత బాకీలు వసూలు అవుతాయి.నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఈ రాశి వారు ఈ రోజు లక్ష్మీదేవి ఆరాధన లేక మహాలక్ష్మి అష్టోత్తరం పారాయణ చేయట వలన శుభ ఫలితాలు పొందగలరు.

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి  (క్షేమతార) వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అధికారుల యొక్క ఆదరణ పొందగలరు.


అనూరాధ నక్షత్రం వారికి  (విపత్తార) అనుకోని కలహాలు ఏర్పడగలవు.పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును.నూతన సమస్యలు ఎదురవగలవు.అవసరమైన ఖర్చులు పెరుగును.

జ్యేష్ట నక్షత్రము వారికి (సంపత్తార)కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈ రోజు ఇంటా బయటా గౌరవ మర్యాదలు పొందగలరు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి .అనుకున్నపనులు అనుకున్నట్టు పూర్తి అగును.వృత్తి వ్యాపారములలో ఆశించిన స్థాయి లాభాలు పొందగలరు. కీలకమైన నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలను సూచనలను తీసుకొనుట మంచిది. అప్రయత్నంగా ధన లాభం పొందగలరు.ఈ రాశి ఈరోజు శివారాధన లేక శివ స్తోత్రం పారాయణ చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.
 

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (జన్మతార)చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండును.

పూ.షా  నక్షత్రం వారికి  (పరమైత్రతార)ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

ఉ.షా నక్షత్రము వారికి (మిత్రతార) తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈ రోజు నూతన నిర్ణయాలు తీసుకొంటారు. విద్యార్థిని విద్యార్థులు చదువు యందు ప్రతిభ కనబడుస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కారం అగును. ముఖ్యమైన కార్యాలలో ప్రతిబంధకాలు తొలగి సజావుగా పూర్తి అగును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఈ రాశి ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధించుట లేక నారాయణ స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి (మిత్రతార) తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

శ్రవణం నక్షత్రము వారికి (నైదనతార)చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనిష్ఠ నక్షత్రము వారికి (సాధన తార)దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.శుభవార్తలు వింటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారు వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా వుంటాయి.వృత్తి వ్యాపారాల్లో ధనలాభం కలుగును. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యాచరణ లోకి తీసుకుని వస్తారు.కీలకమైన సమస్యల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి .ఆర్ధిక వ్యవహారాలు అనుకూలంగా ఉండును.ఈ రాశి వారు ఈరోజు ఇష్టదేవతారాధన చేయండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి (సాధన తార) దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

శతభిషం నక్షత్రం వారికి (ప్రత్యక్తార)వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. సమాజము నందు అపవాదములు ఎదురవగలవు.అధికారులతోటి వివాదాలు రాగలవు.

పూ.భా నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అధికారుల మన్ననలు పొందగలరు.

దిన ఫలం:-ఈ రోజు ఈ రాశి వారికి సమాజంలో ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడును.దైవాలయ దర్శనాలు చేసుకుంటారు. ఊహించని సంతోషకరమైన శుభవార్తలు వింటారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. ఉద్యోగం నందు అధికారులతో సఖ్యత పెరుగుతుంది.ఆరోగ్యం అనుకూలించిను. విద్యార్థులు తమ ప్రతిభ కనబడుస్తారు.ఈ రాశి వారు ఈ రోజు దత్తాత్రేయ ఆరాధన లేక దత్త స్తోత్రం పారాయణ చేయుట వలన శుభ ఫలితాలు పొందగలరు.
 

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు(దీ--దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అధికారుల మన్ననలు పొందగలరు.

ఉ.భా  నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవగలవు.అవసరమైన ఖర్చులు పెరుగును.

రేవతి నక్షత్రం  వారికి (సంపత్తార)కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును.శుభవార్తల వింటారు.

దిన ఫలం:-ఈ రాశి వారు ఈ రోజు వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును. చేపట్టిన పనులు ఆలస్యమగును.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రతికూలత వాతావరణం. మానసిక ఆందోళన మరియు సమస్యలు  పెరుగును.ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండును.ఈ రాశి వారు ఈ రోజు లక్ష్మీనరసింహస్వామివారి ఆరాధన లేక లక్ష్మీనరసింహస్వామి స్తోత్రం పారాయణా చేయండి శుభ ఫలితాలు పొందండి.

Latest Videos

click me!