మాస ఫలాలు: ఓ రాశి వారు ఊహించని శుభవార్తలు వింటారు..!

First Published Oct 1, 2022, 10:00 AM IST

ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి విలాసవంతమైన వస్తువులకు ఖర్చు చేస్తారు. రుణములు తీరి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. నూతన వ్యక్తులు పరిచయమై కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగంలో పై అధికారుల నుంచి చికాకులు ఏర్పడగలవు. 

ఈ నెలలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ మాస ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.
 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

ఈ మాసం మీకు శుభదాయకం, లక్ష్యాలను సాధించే క్రమంలో పిరికితనాన్ని జయించాలి. ముఖ్య విషయాల్లో ముందుగానే స్పందించండి. క్షమాగుణంతో ఉంటే మేలు జరుగుతుంది.ధనాధాయ మార్గాలు బాగుంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మీ ప్రతిభకు తగ్గ ఉద్యోగాలు లభిస్తాయి. పనులలో ఆటంకాలు ఏర్పడిన పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు పొందుతారు.  మనస్సు నందు ఆందోళన. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.  జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. ఆరోగ్య ప్రయాణాల విషయంలో నిర్లక్ష్యం తగదు. దుర్గా స్తోత్రం పారాయణం చేయండి.
 

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ మాసం ముఖ్యమైన పనులకు అంకురార్పణ చేసే అవకాసం ఇస్తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘం నందు మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులతో చికాకులు, మనస్పర్ధలు. విలాసవంతమైన వస్తువులకు ఖర్చు చేస్తారు. రుణములు తీరి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. నూతన వ్యక్తులు పరిచయమై కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగంలో పై అధికారుల నుంచి చికాకులు ఏర్పడగలవు. గృహ నిర్మాణాలు ముందుకు సాగుతాయి. వృత్తి వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. వివాహ ప్రయత్నాలు ఆటంకాలు ఏర్పడగలవు. సుబ్రమణ్య స్తోత్రం పఠించండి.

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ మాసం మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తోటివారి సహకారంతో ఆపదలు తొలగుతాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి.  ఆదాయానికి మించిన అధిక ఖర్చులు. అకారణ కలహాలు రాగలవు సంయమనం పాటించండి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. భూ గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిది. అధిక శ్రమ. కుటుంబం నందు ప్రతికూల వాతావరణం. రుణ బాధలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంఘం నందు ఆచితూచి తెలివిగా వ్యవహరించండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రము, శివ అష్టోత్తరం పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ మాసం మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తోంది. కాస్తంత జాగ్రత్తలు చాలా సమస్యల నుంచి బయిటపడగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభాలు.భూ గృహ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. దూర ప్రయాణాలలో లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక చింతన. దైవ కార్యాలలో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. కోర్టు వ్యవహారములలో అనుకూలమైన వాతావరణం. ప్రభుత్వ సంబంధిత పనులలో పురోగతి. సంఘము నందు మీ గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రుల కలయిక. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. రుణ బాధలు తీరి ఉపశమనం పొందుతారు. ఆదిత్య హృదయం, మహాలక్ష్మి స్తోత్రం పారాయణ చేయండి.

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ మాసం మీ జీవితంలో కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఇస్తుంది.  ప్రారంభించబోయే పనులకు ఆటంకాలు కలుగకుండా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మొండి బాకీలు వసూలు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అనవసరమైన ప్రయాణాలు. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఆదాయానికి మించిన ఊహించని ఖర్చులు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. గణపతి స్తోత్రం,దుర్గా స్తోత్రం పారాయణ చేయండి

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ మాసం కొన్ని సమస్యలను మోసుకు వస్తుంది.  సమయానుకూలంగా ముందుకు సాగండి. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. అకారణ కోపతాపాలు. గృహం నందు శుభకార్యా చరణ. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగమునందు సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. సంతాన విషయంలో చేయు ప్రయత్నాలు అభివృద్ధి కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం. వృత్తి వ్యాపారాలలో లాభాలు. ఆకస్మిక ధన లాభం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం. శివ స్తోత్రం, సుబ్రమణ్య అష్టోత్తరం పఠించండి.


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ మాసం మీకు అనుకూల ఫలితాలు సూచిస్తోంది.  కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం సమకూరుతుంది. సంఘంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహాది ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రతిభకు దగ్గర ప్రతిఫలం లభిస్తుంది. అకారణంగా కోపం,కలహాలు. ప్రారంభమై నిలిచిపోయిన పనులకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దుర్గా అష్టోత్తరం పారాయణ చేయండి.


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ మాసం మీకు కొన్ని పరిక్షలు పెట్టి ఫలితాలు ఇస్తుంది. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది.  నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కానీ శ్రమాధిక్యం. ఉద్యోగం నందు పై అధికారుల వల్ల చికాకులు. గృహమునందు శుభకార్యాచరణ. నిరుద్యోగకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో చేసిన పనులలో విజయం సాధిస్తారు. సంఘం నందు అనుకోని కలహాలు. ప్రభుత్వ సంబంధిత పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలలో ధన లాభం. మహాలక్ష్మి అష్టోత్తరం, సూర్యాష్టకం పఠించండి.

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ మాసం జాగ్రత్తగా మెలగండి. మీకు ఇది పరీక్షా సమయం.  ప్రారంభించిన పనిలో కార్యసిద్ధి ఉంది. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచిపేరు సంపాదిస్తారు. వివాహాది శుభకార్యముల ప్రయత్నాలు ఫలించును. ఉద్యోగం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. రావలసిన మొండి బాకీలు వసూలు అవుతాయి. తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడినప్పటికీ చివరికి పూర్తి చేస్తారు. సంఘమునందు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. అనుకోని విధంగా అధిక ఖర్చులు. ధనాధాయ మార్గాలను అన్వేషిస్తారు. ప్రయాణాలలో లాభాలు. గణపతి స్తోత్రం, దుర్గా సప్తశ్లోకీ పారాయణం చేయండి.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ మాసం మీకు ఇంటా, బయిటా సమస్యలు ఎదురౌతాయి.  ఉద్యోగమునందు అధికారుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. అధిక ఖర్చులు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకులు కలిగిస్తాయి. సన్నిహితులతో అనవసరమైన కలహాలు. గృహ నిర్మాణ ఆలోచనలను వాయిదా వేసుకోవడం మంచిది. సంతాన విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఆరోగ్య విషయంలో దీర్ఘకాలిక రోగములు ఇబ్బంది కలిగిస్తాయి. చెడు సావాసాలకు దూరంగా ఉండండి. మనసునందు ఆందోళన. సుబ్రహ్మణ్య స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.
 


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ మాసం మీకు భగవంతుడు అనుగ్రహం ఉంది. అద్బుతాలు జరగవు కానీ... కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అవసరాలకు ధనం సమకూరుతుంది. స్థిరాస్తి క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాహ ప్రయత్నాలు ప్రతిబంధకాలు. కుటుంబం నందు ప్రతికూల వాతావరణం. గృహం నందు పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవలెను. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో సామాన్యం.జీవిత భాగస్వామితో మనస్పర్ధలు. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. శివ అష్టోత్తరం, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ మాసం మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కంగారు పడద్దు. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు  ఎదురవుతాయి. తోటివారి సహకారం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరవాత ఇబ్బందులు పడతారు. సు  నూతన పరిచయాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి వృద్ధి చేయు ప్రణాళికలు చేస్తారు. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఇంకా బయట కొద్దిపాటి సలహాలు  ఏర్పడును. ఉద్యోగస్తులకు పై అధికారుల వలన చికాకులు ఏర్పడతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అధిక శ్రమ. రుణ బాధలు కొద్దిగా ఇబ్బంది కలిగించును. వివాహాది ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి. మాసంతంలో ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం, మహాలక్ష్మి అష్టోత్తరం పారాయణ చేయండి.

click me!