మాస ఫలాలు: ఓ రాశి వారికి ఈ నెలలో శుభవార్తలు

First Published Nov 1, 2022, 10:05 AM IST

ఈ నెల  రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెల ఆర్థిక పరిస్థితులు బాగున్న ఎంతోకంత రుణం చేయవలసి వస్తుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి.. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది. 

Daily Horoscope 2022 New 01

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ నెలలో  ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు.  ఎవరు..ఏయే  జాగ్రత్తలు తీసుకోవాలి...  ఈ మాస ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రెమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.
 

Daily Horoscope 2022 New 02

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

తలపెట్టిన పనులు పట్టుదలతో చేయండి విజయం కలుగుతుంది.  గతంలో రాణించక వదిలేసిన వ్యాపారం  వలన అనుకోకుండా ధన లాభం కలుగును. ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడిన అధికార అభివృద్ధి కలుగుతుంది. వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రభుత్వ సంబంధిత  పనులు నిదానంగా సాగును. జీవిత భాగస్వామి తోటి కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడగలరు. పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. సంఘమునందు అవమానాలు ఏర్పడగలవు. మీరు నమ్మిన వారి వలన మీకు అపకారం జరుగుతుంది జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి.మాసాంతంలో వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి అగును. ఈ మాసం లక్ష్మీనారాయణ అర్చన చేయండి. లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు
 

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

వ్యాపారమునందు పెట్టిన పెట్టుబడుల తగిన తగ్గ ధనలాభం కలుగును.. విద్యార్థులు చదువుపై అధిక శ్రద్ధ చూపించాలి.. సంఘమునందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది.. ఆర్థిక పరిస్థితులు బాగున్న ఎంతోకంత రుణం చేయవలసి వస్తుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి.. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది. కోపాన్ని అదుపు చేసుకోవాలి.. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రతపెరులుుతాయ.చేయ పనులయందు ఆత్రుతతో కాకుండా ప్రశాంతంగా ఆలోచించి చేయండి పనులు పూర్తి అగుతాయి. . జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగవలెను.. వివాహాది ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి.. వివాదాలకు దూరంగా ఉండండి లేదా కొత్త సమస్యలు ఏర్పడగలవు.. భార్యకు అనారోగ్య సూచనలున్నాయి. మాసాంతంలో ఉద్యోగం నందు పై అై అి అధికంగా ఉండి  కలహాలు ఏర్పడును.. అనవసరమైన కోరికలకు దూరంగా ఉండాలి.. ఈఈ మాసం మహాలక్ష్మి అష్టోత్తరము చదవండి మంచి ఫలితాలు పొందుతారు
 

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగును. మిత్రుల యొక్క సహాయ సహకారములు కూడా  లభించును. పిల్లల యొక్క చదువు ఉద్యోగంము లలో అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. వ్యాపారం నందు పెట్టుబడి కు మించి  ధన లాభం కలుగుతుంది. రావలసిన బాకీలు లౌక్యంగా రాబట్టవలెను.  ఉద్యోగంము నందు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం ఇబ్బంది పెడతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. చేయు వృత్తి యందు అధిక శారీరక శ్రమ ఏర్పడుతుంది.  భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాల  అనుకూలిస్తాయి. వచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకొనవలెను.   మాసాంతంలో అనవసరమైన ఖర్చులు యందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.  కొంతమేరకు రుణం చేయ వలసి వస్తుంది. కొత్త సమస్యలు ఏర్పడతాయి. విందు వినోదాలతోటి ఆనందంగా గడుపుతారు. ప్రజల యొక్క ఆదరణ  అభిమానులు పెరుగుతాయి ఈ మాసం సూర్యారాధన లేక ఆదిత్య హృదయ పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలు పొందండి.


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
పొదుపు చేసిన ధనాన్ని తీసి గృహ అవసరాల నిమిత్తం  ఖర్చు చేయాల్సి వస్తుంది.  తప్పులేకుండా కొన్ని పనుల యందు బాధ్యత వహించాల్సి వస్తుంది. కొన్ని కీలకమైన సమస్యలు బుద్ధిబలంతో పరిష్కరించాలి. బంధువులతో కొద్దిపాటి మనస్పర్ధలు వచ్చినా వారి యొక్క సహాయ సహకారము లభించును. కుటుంబ అభివృద్ధి కొరకు  కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వస్తు వాహనాది ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. మానసికంగా శారీరకంగా బలపడతారు.  ఉద్యోగమునందు సహోద్యోగుల సహాయ సహకారము వలన అధికారం  లభించును. ప్రయాణాలు అనుకూలించును. విద్యార్థులు చదువుపై అధిక దృష్టి పెట్టవలెను. వ్యాపారమునందు కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది. భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు ఆటంకాలు ఏర్పడిన చివరికి పూర్తయిగును. మాసాంతంలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి కుటుంబం నందు ప్రతికూల వాతావరణం ఉంటుంది. చేయ పనులలో అధిక శ్రమ ఒత్తిడి పెరుగుతాయి. పెద్దల యొక్క సహాయ సహకారముల ద్వారా ధన లాభం కలుగును. ఈ మాసం  రుద్రార్చన గాని శివాష్టోత్రము గాని చేయండి మంచి శుభ ఫలితాలు పొందండి.


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ప్రయత్నం కార్యాలలో పట్టుదల తోటి సాధించవలెను. కీలక సమస్యలను బుద్ధి  చతురతోటి చేదిస్తారు. విద్యార్థులు పరీక్ష యందు విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల మీద పై చేయి సాధిస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. కొన్ని సమస్యలు చికాకు పుట్టించును. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఉద్యోగమునందు అధికారులతోటి వాదనలు వేయడం అనవసరం . సంఘమునందు అవమానాలు ఎదురవును.  పొదుపు పథకాలపై దృష్టి పెడతారు . కోపంతో కాకుండా ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.ప్రయాణాలు యందు జాగ్రత్త వహించవలెను. వృత్తి వ్యాపారమునందు కష్టము అధిక శ్రమ మిగిలును. ధన నష్టం కలుగవచ్చు. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం. మాసాంతంలో బందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది. ఈ మాసం విష్ణు అర్చన లేదా విష్ణు సహస్రనామం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ మాసం వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలించును. గతంలో వ్యాపారం ముందు పెట్టుబడి పెట్టిన వస్తువులు యందు అధిక ధనలాభం కలుగును. కుటుంబ అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. అనవసర ప్రయాణాలు చికాకు పుట్టించును. ఎంత ఆర్థిక బలంగా ఉన్నా అవసరానికి కొంతమేర రుణం చేయాల్సి వస్తుంది. సంఘమనందు మంచివారి వలన సహాయం వలన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. తలచిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొన్ని సమస్యలు ఎదురైన అవి మీకు గుణపాఠాలు అయి అనుభవంలో వచ్చి మీకు మంచి చేకూరుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వాదనలకు దూరంగా ఉండటం మంచిది. లేదా అవమానాలు ప్రతికూలత వాతావరణం కలుగును. మాసాంలో ప్రభుత్వ పనులు వాయిదా పడతాయి. ఉద్యోగమునందు పై అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఈ మాసం మహాలక్ష్మి అర్చన లేదామహాలక్ష్మి స్తోత్రం పారాయణ చేయండి మంచి శుభ ఫలితాలు పొందండి.
 

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ప్రయత్న కార్యాలు ఫలించును. శారీరకంగా మానసంగా బలపడతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. భూ గృహ నిర్మాణాలు క్రయవిక్రయాలు కలిసి వస్తాయి.  ఉద్యోగమునందు అనుకూల మార్పులు అధికారం లభించును. ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి వ్యాపారం లాభసాటిక జరుగుతాయి. చెడు స్నేహాలు కు దూరంగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వారి మీకు అపకారం చేయాలని చూస్తారు. అనవసరమైన గొడవల వలన కొత్త సమస్యలు ఏర్పడ గలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మా సాంతంలో విలువైన వస్తువుల వలన ధన లాభం కలుగుతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారములు లభించును. మనస్సునందు ఆందోళనగా ఉంటుంది .ఈ మాసం దర్గా అర్చన గాని లేదా దుర్గా స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలను పొందండి.


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. భార్య తోటి అనవసరమైన కలహాలు అభిప్రాయ భేదాలు ఏర్పడును. ఉద్యోగమునందు అనేక సమస్యలు ఎదురవుతాయి .
మిత్రుల తోటి మనస్పర్ధలు రాగలవు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎక్కువుగా నుండును. చేయ పనుల యందు ప్రశాంతంగా ఆలోచించి చేయవలెను. కోపాన్ని తగ్గించుకుని మాట్లాడవలెను. వ్యాపారం నందు  పెద్దల యొక్క సలహాలు మేరకు పెట్టుబడులు పెట్టవలెను. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడవలెను. మనస్సు నందు ఆందోళనగా భయంగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనతోటి సమయాన్ని వృధా చేయవద్దు. భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు వాయిదా వేయడం మంచిది. మాసాంతంలో పొదుపు చేసిన ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం విద్యార్థులకు అనుకూలం ఈ మాసం సూర్యారాధన లేదా సూర్యాష్టకం చదవండి శుభ ఫలితాలు పొందండి

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
గృహమునందు శుభకార్యాలు జరుగును.వృత్తి వ్యాపారాల యందు ధనలారం కలుగుతాయి. ప్రారంభించి ఆగిన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మానసికంగా ఉత్సాహంగా  ఉంటుంది. పిల్లల యొక్క చదువు ఉద్యోగము నందు అభివృద్ధి కలుగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. స్తంభించిన ప్రభుత్వ పనులు పూర్తగును. సంఘమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కులదేవతారాధన చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేయువారు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఫలించును. తలపెట్టిన పనులు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతాయి.మాసాంతంలో అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితోటి స్వల్ప మనస్పర్ధలు రావచ్చును. స్థాన చలనం . ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చును. ఈమాసం రుద్రార్చన లేక శివా స్తోత్రం చదవండి శుభ ఫలితాలు పొందండి

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ప్రభుత్వ సంబంధిత పనులు పనుల యందు అనుకూలంగా జరుగును . గతంలో పెట్టిన పెట్టుబడిల వలన ధనలాభం కలుగును.నూతన వ్యాపార అభివృద్ధి పెట్టుబడుల గురించి బంధుమిత్రులతో ఆలోచన చేస్తారు. ప్రతిభ తగ్గ గౌరవం లభించును. ఉద్యోగము నందు పై అధికారుల యొక్క సహాయ సహకారం లభించును . ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ ప్రాప్తించును. ఆర్థికంగా బలంగా చేకూరుతుంది.  దూరాఆలోచనలకు దూరంగా ఉండండి. కొంత సమయం పిల్లలతో సరదాగా గడపండి. ఇతరులతో వాదనలు వేయకండి.  మానసికంగా బలహీనంగా ఉంటుంది. . మాసాంతంలో శుభకార్యాలలో పాల్గొంటారు కుటుంబం నందు అనుకూల వాతావరణం ఉంటుంది. అభివృద్ధి కలుగును. ఏ మాసం మహాలక్ష్మి ఆరాధన లేదా అష్టలక్ష్మి స్తోత్రం చదవండి. మంచి శుభ ఫలితాలు పొందండి

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
మిత్రుల సహాయ సహకారాలు లభించును. కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులు తొలిగి ప్రశాంతత లభిస్తుంది. పనులు అనుకూలంగా జరుగును. సంఘమునందు మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరం. పాత బాకీలు తెలివిగా రాబెట్టవలెను. దురాలోచలకు దూరంగా ఉండండి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కొంతమేర రుణ బాధలు తీరి ఉపశమనం లభిస్తుంది. ఆకారణ కలహాల వలన కొత్త సమస్య ఏర్పడతాయి. ఉద్యోగం నందు పని ఒత్తిడిలు అధికంగా ఉంటాయి.  వ్యాపారం నందు ధన నష్టం కలుగవచ్చు. మానసికంగా  ఆందోళగా ఉంటుంది. సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మాసాంతంలో కోపం తగ్గించ వలెను. భార్య తోటి మనస్పర్ధలు రావచ్చును. ధన లాభం కలుగుతుంది . ఈ మాసం సూర్యారాధన లేక ఆదిత్య హృదయం పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలు పొందండి

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

దీర్ఘకాలిక అనారోగ్యాలు కలవరపెడుతుంది. చెడు వార్తలు వింటారు.   మీరంటే గిట్టినవారి వలన మీకు అపకారం చేయాలని చూస్తారు. గృహ నిర్మాణ క్రయ విక్రయాల యందు పెద్దల యొక్క ఆలోచనతోటి ముందడుగు వేయాలి. వృత్తి వ్యాపారం సామాన్యంగా ఉంటాయి. చేయని తప్పులకు బాధ్యత మీద పెడుతుంది.  భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడతాయి. ఉద్యోగం నందు పై అధికారుల వలన గోడవలు రావచ్చు.   ఆర్థిక ఇబ్బందులు ఉన్న అవసరాలకు ధనం సమకూరుతుంది. కీలకమైన విషయాలలో ధైర్యంగా ముందడుగు వేయాలి. అనవసరమైన ఖర్చులు యందు జాగ్రత్త వహించాలి. ఇతరులకు మీ వంతు సహాయ సహకారములు అందిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.   ప్రజల యొక్క అభిమానాన్ని పొందుతారు. మానసికంగా ఆందోళన పెరుగుతుంది ఈ మాసం గణపతి అర్చన లేదా గణపతి అష్టోత్రం చదవండి మంచి శుభ ఫలితాలు పొందండి

click me!