మే నెల మాస ఫలాలు: ఓ రాశివారికి శుభవార్తలు..!

First Published | May 1, 2023, 11:02 AM IST

మే నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెల ఆర్థికంగా బలపడతారు. వృత్తి వ్యాపారాలు యందు ధన లాభం కలుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించును. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. 

ఈ నెలలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ మాస ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ  రాశి ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనుభవంలోకి వస్తాయి.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీమాతా' జ్యోతిష్యాలయం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర

మిత్రులే శత్రువులయ్యే అవకాశం. సమాజము నందు అవమానం వంచన జరిగే అవకాశం. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మానసికంగా అనేక ఆలోచనలతోటి చికాకుగా ఉండును. ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగం నందు పైఅధికారులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. అప్రయత్నంగా ధన లాభం కలుగును. స్వర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వైవాహ జీవితం ఆనందంగా గడుస్తుంది. సంతానం తోటి ప్రతికూలత వాతావరణ ఏర్పడను. శారీరక శ్రమపరిగి శరీర సౌఖ్యం తగ్గును. అన్నదమ్ముల తోటే అకారణంగా కలహాలు ఏర్పడగలవు. రుణ శత్రు బాధలు పెరుగును. ఆర్థికంగా బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలించును. మా సాంతంలో అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వ్యాపార విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. ఈ మాసం ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మరియు గణపతి స్తోత్రం పాటించండి శుభ ఫలితాలు పొందండి.
 


Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటుంది. పిల్లలు విషయంలో శ్రద్ధ వహించవలెను. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. జీవిత భాగస్వామి తోటి ఆ కారణంగా విరోధం ఏర్పడుతుంది. భూ గృహ క్రయ విక్రయములు ఈ మాసం అంత అనుకూలమైన వాతావరణం కాదు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ఏదో విధంగా ధనం సమకూరును. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగవనందు అధికారులతోటి సమస్యలు ఏర్పడను. ఊహించిన సమస్యలు ఎదురవగలవు. అనుకున్న పనులు వాయిదా పడొచ్చు. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇతరులతోటి వాగ్వాదాలకు దూరంగా ఉండండి. మా సాంతంలో రుణ శత్రు బాధలు పెరుగును. వివాహ ప్రయత్నాల ఫలించును. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఈ మాసం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్రం మరియు లక్ష్మీనారాయణ అర్చన చేయండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారములు॥ ఋధ -శుక్ర
మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. గృహమనందు ఉత్సవాలు వివాహాది శుభ కార్యక్రమాలు జరుగును. కులదేవతారాధన చేస్తారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలలో అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. భూ గృహ క్రయ విక్రయములు కలిసి వస్తాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.అన్ని  విధాల అనుకూలంగా ఉండును. ఆర్థికంగా బలపడతారు. వృత్తి వ్యాపారాలు యందు ధన లాభం కలుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించును. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. వివాహ ది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలకమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభించును
సంతానానికి ఉన్నత చదువు లేదా ఉద్యోగం లభిస్తుంది. వైవాహక జీవితం ఆనందంగా  గడుపుతారు. మా సాంతంలో కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారం నందు జాగ్రత్త అవసరము. బంధుమిత్రులతోటి అకారణంగా కలహాలు ఏర్పడగలవు. ఈ మాసం సుబ్రహ్మణ్య స్తోత్రం. మరియు మహాలక్ష్మి ఆరాధన చేయండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
బంధుమిత్రులతో కలిసి కాలక్షేపం చేస్తారు. ఉద్యోగమునందు అధికారులతోటి సంబంధాలు మెరుగుపడతాయి. మీయొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగం ప్రయత్నాలు ఫలించును.
ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగుతాయి. కులదేవతారాధన దైవ సంబందిత పూజా కార్యక్రమాల్లో ఉద్యోగం నందు మీ యొక్క బాధ్యత సక్రమంగా నిర్వహిస్తారు. బందువర్గం తోటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చిస్తారు. ఆరోగ్యం చేకూరి  ప్రశాంతత లభిస్తుంది. పెద్దవారి యొక్క ఆదరణ అభిమానాలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగి అన్యోన్యత పెరుగుతుంది. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ధనానికి లోటు ఉండదు. సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మా సాంతంలో అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారమనందు కొద్దిపాటి ధన నష్టం రావచ్చు. భార్య భర్తల మధ్య మానస్పర్ధలు ఏర్పడగలవు. ఉద్యోగమునందు అధికారుల తోటి సమస్యలు ఏర్పడతాయి. ఈ మాసం ఈ రాశి వారు కుజ స్తోత్రం దుర్గారాధన చేయండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign


శో॥ కోణస్థ పింగళో బభ్రు కృష్ణో  రౌద్రాంతకోయమః ।
సౌరి శనైశ్చరో మందః పిప్పలాదిషు సంస్థితః॥ ఈ నెల అంతా ఈ  శ్లోకమను రోజు 21 సార్లు జపించండి లేదా శని స్తోత్రం లేదా అష్టోత్రము గాని పారాయణ చేయండి.

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
ఇతరులతోటి ఆ కారణంగా కలహాలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. సమాజము నందు ఆచితూచి వ్యవహరించవలెను. వ్యవహారవనందు నిరాశ నిస్పృహలకు గురివుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. దేహ కాంతి క్షీనించును. భూ గృహ క్రయవిక్రయాలు నిర్మాణ పనులు కలిసి వస్తాయి. ధన ధాన్యాలు లాభం పొందుతారు. ప్రయత్నించిన కార్యాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో గల ఆనందంగా గడుపుతారు. స్థలము లేకగృహము కొనుగోలు చేస్తారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. వృత్తి వ్యాపారం నందు లాభాలు పొందగలరు. మా సాంతంలో వంద వర్గం తోటి విరోధాలు ఏర్పడగలవు. అనేక విధాల ఖర్చులు పెరుగును. జీవిత భాగస్వామి తోటి వివాదాలు ఏర్పడగలవు. ఈ మాసం ఈ రాశి వారు ఆదిత్య హృదయం మరియు గణపతి స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం

ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల తోటి ప్రతికూలత వాతావరణ. ప్రయాణాలయందు తగు జాగ్రత్తలు అవసరం. వాగ్వాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగం నందు అధికారుల వలన భయంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. చేయ పని యందు అధిక శ్రమ కష్టాలు ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని ఏదో ఒక సమస్యలో ఇరికించాలని ఇతరులు చూస్తూ ఉంటారు. చేయు ప్రయాణాల యందు అవరోధములు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులు యందు  జాగ్రత్త అవసరము. జీవిత భాగస్వామి తోటి అకారణంగా విరోధాలు ఏర్పడ గలవు ‌ ఉద్యోగమునందు అధికారులతోటి సమస్యలు ఏర్పడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అగును. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొద్దిపాటి రుణాల తీరి ప్రశాంతత లభిస్తుంది. ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అప్రయత్నంగా ధన లాభం కలుగుతుంది. మా సాంతంలో భూ గృహ క్రయవిక్రయాల  కలిసి వస్తాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. అన్న విధాల అనుకూలంగా ఉంటుంది. ఈ మాసం ఈ రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ మరియు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర
వలన తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి తోటి మనస్పర్తిలో రాగలవు.బంధుమిత్రుల యొక్క కలయక. వ్యాపారాలు రాణిస్తాయి. ఉద్యోగవనందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. జీవిత భాగస్వామి తోటి చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. సమాజము నందు అపవాదములు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనసునంగా ఆందోళనగా ఉండుట. శత్రువుల వలన అపకారాలు జరగవచ్చు. కొద్దిపాటి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. మా సాంతంలో దుర్వార్తలు వినవలసి వస్తుంది. మిత్రులే శత్రువులయ్యే అవకాశం. వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకున్న పనులు అనకొనట్లుగా జరుగును. అన్న విధాల లాభాలు కనబడును. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ రాశి వారు ఈ మాసం గురు స్తోత్రం మరియు మహాలక్ష్మి ఆరాధన చేయండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ-గురు -శుక్ర
ఆర్థికంగా బలంగా ఉన్న ఎంతోకొంత రుణాలు చేయాల్సి వస్తుంది. తలపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు. శారీరకంగా బలహీనంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు నిరాశ నిస్పృహలకు గురి అవుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘం నందు మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మనస్పర్ధలు. విలాసవంతమైన వస్తువులకు ఖర్చు చేస్తారు. రుణములు తీరి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. నూతన వ్యక్తులు పరిచయమై కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగంలో పై అధికారుల నుంచి గౌరవం పొందగలరు. వృత్తి వ్యాపారులకు పురోభివృద్ధి సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలించును. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అష్టమ కుజ సంచారం వలన కొద్దిపాటి అవమానాలు కలగవచ్చు. వాహన ప్రయాణం నందు జాగ్రత్త అవసరము. మా సాంతంలో ఆరోగ్య సమస్యలు ఏర్పడగలరు. ఇతరులతోటి కలహాలకు విరోధాలకు దూరంగా ఉండటం మంచిది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ మాసం ఈ రాశి వారు దుర్గా స్తోత్రం పారాయణ దుర్గ అర్చన చేయండి శుభ ఫలితాలు పొందండి.


శో॥ కోణస్థ పింగళో బభ్రు కృష్ణో  రౌద్రాంతకోయమః ।
సౌరి శనైశ్చరో మందః పిప్పలాదిషు సంస్థితః॥ ఈ నెల  అంతా ఈ  శ్లోకమను రోజు 21 సార్లు జపించండి లేదా శని స్తోత్రం లేదా అష్టోత్రము గాని పారాయణ చేయండి.

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ
బంధుమిత్రుల తోటి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ పరమైన అభివృద్ధి కలుగుతుంది. కీలకమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పొందగలరు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినా అవసరానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబం నందు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వృత్తి వ్యాపారాలలో ధన లాభాలు.భూ గృహ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. దూర ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరము.. ఆధ్యాత్మిక చింతన. దైవ కార్యాలలో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. కోర్టు వ్యవహారములలో అనుకూలమైన వాతావరణం. ప్రభుత్వ సంబంధిత పనులలో పురోగతి. సంఘము నందు మీ గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రుల కలయిక. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.మా సాంతంలో రుణాల వల్ల అవమానం ఏర్పడగలదు. తలపెట్టిన పనులు పూర్తి కాక‌‌ చికాకు పుట్టించును. ఈమాసం ఈ రాశి వారు గణపతి స్తోత్రం పారాయణ  గణపతి అర్చన చేయండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారములు॥ ఆది -సోమ- శని
అనుకున్న పనులు అనుకొనట్లుగా పూర్తి చేస్తారు. మీ ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. సంతానం అభివృద్ది లోకి వస్తుంది. సమాజము నందు పెద్దల యొక్క ఆదరణ అభిమానాలు పొందగలరు. వృత్తి వ్యాపారాలు  రాణిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ఆనందంగా గడుపుతారు. సంతోషకరమైన వార్తలు వింటారు.ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. శత్రువర్గంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుభకార్యాచరణ. స్థల విక్రయాలకు అనుకూలమైన వారం.బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. మా సాంతంలో భార్య భర్తల మధ్య అవగాహన తగ్గి విరోధాలు ఏర్పడగలవు. బంధువులతోటి విరోధాలు. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ఈ మాసం ఈ రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ లక్ష్మీనారాయణ అర్చన చేయండి శుభ ఫలితాలు పొందండి. 

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
చేయ పనులలో అనవసరమైన పట్టుదల వదిలినట్టయితే పనులు సజావుగా సాగును. మిత్రుల వలన అపకారం జరిగే అవకాశం. బందు వర్గం తోటి భిన్నాభిప్రాయాలు రాగలవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. సంతానం తోటి విరోధం. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మనసునందు భయాందోళనగా ఉండుట. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడగలవు.ఆలోచించి ఖర్చు చేయవలెను. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలో సౌమ్యంగా వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఆస్తి వ్యవహారాల్లో ఇబ్బందులు. రుణ శత్రు బాధలు. సంఘంలో గొడవలకు దూరంగా ఉండవలెను. జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండవలెను. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.వృత్తి వ్యాపారాల్లో సామాన్యం. సంఘంలో తెలివిగా వ్యవహరిస్తారు.  అన్నదమ్ములతో కలహాలు.  చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. మా సాంతంలో సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభించును. నూతన ఉత్సవాహనది కొనుగోలు చేస్తారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఈ మాసం ఈ రాశి వారు శివ స్తోత్రం పారాయణం రుద్రార్చన చేయండి శుభ ఫలితాలు పొందండి. 

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ
అష్టమ కుజ సంచారము రుణాల వల్ల అవమానం ధన నష్టం శారీరక బలహీనత ఏర్పడను.వృత్తి వ్యాపారమునందు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ సభ్యుల తోటి ఆప్యాయత అనురాగాలు పొందగలరు. చేయి వ్యవహారంయందు పెద్దల యొక్క సలహాలు సహకారాలు తీసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.సమస్యలు ను ధైర్యంగా ఎదుర్కొంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రావలసిన బకాయిలు వసూలగును.ధనాదాయ మార్గాలు బాగుంటాయి. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. సంఘంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగం నందు  పై అధికారుల ఒత్తిడిలు పెరగగలవు. తల్లిదండ్రుల ఆరోగ్యం  విషయంలో జాగ్రత్త వహించవలెను. కుటుంబమునందు సంతోషకరమైన వాతావరణం.  మంచి పనులకు ధనం ఖర్చు చేస్తారు.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోండి. మా సాంతంలో అనారోగ్య సమస్యలు ఏర్పడగలవు. సంతానం తోటి విరోధం. శారీరక మానసిక బలహీనత. ఈ మాసం ఈ రాశి వారు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణ మహాలక్ష్మి అర్చన చేయండి శుభ ఫలితాలు పొందండి.

Latest Videos

click me!