మాస ఫలాలు: ఓ రాశి వారికి ఈనెలలో ఆకస్మిక థనలాభం..!

First Published | Jan 1, 2023, 10:05 AM IST

జనవరి నెల  రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశి వారికి  పెద్దలతో చేయు వ్యవహారం నందు ఆచితూచి వ్యవహరించవలెను. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగుతాయి. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. అన్ని విధాల అభివృద్ధి కనబడుతుంది.

Horoscope

ఈ నెలలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ మాస ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)


Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

శారీరకంగా మానసికంగా బలహీనత ఏర్పడుతుంది.  అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారముల యందు ధన నష్టం వాటిల్లుతుంది. ఉద్యోగమునందు అధికారుల యొక్క నిరాదరణ పొందుతారు. సమాజము నందు కుటుంబమునందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ఆతుర తో చేయ పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సంతానం తోటి విరోధాలు ఏర్పడవచ్చును.  అపకారం చేయాలని కొంతమంది చూస్తారు. జీవిత భాగస్వామితో తోటి మనస్పర్ధలు రావచ్చును. దగ్గర బంధువులు వలన కొత్త సమస్యలు ఏర్పడవచ్చును. మృదువుగా సంభాషణ చేస్తూ వ్యవహారాన్ని చెక్కపెట్టుకొనవలెను. మధ్యవర్తత్వానికి దూరంగా ఉండటం మంచిది .వ్యాపారము నందు పెట్టుబడి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులు పట్టుదల తోటి చదివిన పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది.   మా సాంతం  అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. వృత్తి వ్యాపారాల యందు లాభసాటిగా జరుగుతాయి. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు .ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. అధికారులతోటి సత్సంబంధాలు ఉపయోగపడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా బలపడతారు. క్రమం క్రమంగా అభివృద్ధి చెందుతారు. ఈ మాసం రుద్రార్చన లేక శివ స్తోత్రం గాని ప్రతినిత్యం పారాయణ శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఉద్యోగమునందు అధికార అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.  ఆర్థికంగా బలపడతారు. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వ్యవహారాల యందు ఆవేశం తగ్గించుకుని వ్యవహరించవలెను. దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. ఆప్త మిత్రుల నుండి గాని బంధువుల నుండి గాని ఎడబాటు రావచ్చును. పెద్దలతో చేయు వ్యవహారం నందు ఆచితూచి వ్యవహరించవలెను. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగుతాయి. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. అన్ని విధాల అభివృద్ధి కనబడుతుంది. మా సాంతంలో అనవసరమైన విరోధాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం కలుగుతుంది. శారీరకంగా మానసికంగా బలహీనపడతారు. జీవిత భాగస్వామి తోటి అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడను. గృహమునందు సమాజము నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. తలపెట్టిన  కార్యాలలో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఈ మాసం ఈ రాశి వారు మహాలక్ష్మి ఆరాధన లేక మహాలక్ష్మి అష్టోత్తరం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
కొన్ని కీలకమైన సమస్యలలో జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు తీసుకుని చేయట మంచిది. చేయు వృత్తి వ్యాపారముల యందు లాభసాటిగా జరుగును. ఉద్యోగం నందు అధికార వృద్ధి  కలుగును. భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. .సంతానమునందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. బంధువులతోటి మనస్పర్ధలు ఏర్పడగలవు. జీవిత భాగస్వామి తోటిసఖ్యతగా మెలగవలెను. కలహాలకు దూరంగా ఉండవలెను. చేయు ఖర్చు యందు ఆచితూచి అడుగులు వేయవలెను.  ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉండును. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. మనసునందు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.  స్థిరాస్తి విషయంలోప్రతిబంధకాలు తొలుగును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని విధాలా లాభం చేకూరును. మాసాంతంలో శారీరకంగా బలహీనపడతారు. దీర్ఘకాలిక అనారోగ్యాలు వలన ఇబ్బందులుంటాయి.  అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండడం మంచిది. పై అధికారులు ఒత్తిడి పెరుగును. అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఈ మాసం ఈ రాశి వారు విష్ణు అర్చన లేక విష్ణు సహస్రనామం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4): 

విద్యార్థులు కొద్దిగా కష్టపడిన విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. కోపతాపాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల తోటి ప్రతికూలతలు వాతావరణం ఏర్పడుతుంది. భూ గృహ క్రయవిక్రయాలు  వాయిదా వేయటం మంచిది. వాహన ప్రయాణాల యందు తగు జాగ్రత్త అవసరము. అన్నదమ్ముల తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. వ్యాపారమునందు పెట్టుబడి విషయంలో పెద్దల యొక్క సూచనలు తీసుకొని వలెను. ఉద్యోగమనందు పై అధికారులతో   విరోధాలు ఏర్పడవచ్చు. తలపెట్టిన పనుల్లో ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది.  అనవసరమైన కోరికలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో  కలహాలు రావచ్చు. నిరాశ నిస్పృహలకు లోనవుతారు. అష్టమ శని ప్రారంభం అవుతున్నది జాగ్రత్త అవసరము. మాసాంతంలోవృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది.ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. భూ గృహ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. సమాజం నందు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.  నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఈ మాసం ఈ రాశి వారు సూర్యారాధన లేకఆదిత్య హృదయం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
కొద్దిపాటి రుణాలు చేయవలసిన వస్తుంది.  చేయు పనులలో ఆటంకాలు ఏర్పడను. సమాజము నందు కుటుంబము నందు గౌరవం తగ్గుతుంది. అపకారం చేయాలని కొంతమంది చూస్తారు.  కీలకమైన సమస్యలు వలన మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది. చేయు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగమనందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. జీవన విధానంలో కొద్దిపాటి మార్పులు రావచ్చును. వృత్తి వ్యాపారాలు యందు ధన నష్టం వాటిల్లుతుంది. చేయు పని వారి తోటి అకారణవిరోధాలు ఏర్పడును. చేయు వ్యవహారము నందు ఉద్రేకతను కోపాన్ని తగ్గించుకుని వ్యవహరించవలెను. కలహాలకు దూరంగా ఉండండి.  జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగు  జాగ్రత్తలు తీసుకొని వలెను. శారీరక శ్రమ పెరుగుతుంది. మా సాంతంలో  విందు వినోదాలలో పాల్గొంటారు. సమాజము నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది ‌. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. మనసునందు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానాలు పొందగలరు. ఆర్థికంగా బలపడతారు.  జీవిత భాగస్వామితో టి ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ మాసం ఈ రాశి వారు దుర్గా అర్చన లేక దుర్గా స్తోత్రం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
వృత్తి వ్యాపారాల యందు ధన ధాన్యాది లాభాలు కలుగును. అనుకున్న పనులు సిద్ధిస్తాయి. చేయు పని వారు అనుకూలంగా ఉంటారు. ప్రత్యర్ధులపై పై చేయి సాధిస్తారు. మిత్రుల యొక్క ఆదర అభిమాన పొందగలరు. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. పెద్దల యొక్క సహాయంతోటి కొత్త అభివృద్ధి పనులకు శ్రీకారం చేస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. రావలసిన బకాయిలు వసూలు అవుతాయి. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు. స్థిరాస్తులు పరిష్కారాలు లభిస్తాయి. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. సమాజము నందు ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఉద్యోగమునందు అధికారం కలుగును. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు ఫలించును. ప్రయాణాలు కలిసి వస్తాయి. మా సాంతంలో అనవసరమైన గొడవలు ఏర్పడుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం ఇబ్బందులుంటాయి.  జీవిత భాగస్వామితోటి  భిన్న అభిప్రాయాలు ఏర్పడుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సంఘమునందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి రుణాలు చేయవలసి వస్తుంది. కీలకమైన సమస్యలు మనసు నందు బాధ కలిగించును. చేయ వ్యవహారాల్లో మెళుకువలు పాటించక తప్పదు. ఈ మాసం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన లేక సుబ్రహ్మణ్య అష్టోత్తరం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఆదాయ మార్గాలు బాగుంటాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నూతన వస్తూ వాహనాది కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు  వినోదాలలో పాల్గొంటారు.  అన్నదమ్ముల తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. భార్య భర్త మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడను. ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరము. ముఖ్యమైన వస్తువుల యందు ధనమందు జాగ్రత్త అవసరం. చేయు ఖర్చు యందు నియంత్రణ లేక ఇబ్బందులకు గురి అవుతారు. ఉద్యోగమునందు అధికార అభివృద్ధి కలుగును. మిత్రులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.  ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. సంతాన వృద్ధి ఆనందం కలిగించును. విద్యార్థులు ఉన్నత విద్య యందు ప్రతిభ కనబరుస్తారు. సమాజం నందు పెద్దవారి యొక్క ఆదర అభిమానాలు పొందగలుగుతారు. మాసాంతంలో ఆర్థిక బలంగా ఉన్న కొంత రుణం చేయవలసి  వస్తుంది.  శారీరకంగా బలహీనపడతారు. నిరాశ నిస్పృహలకు గురి అవుతారు. కొద్దిపాటి అనారోగ్యం ఇబ్బందులుంటాయి. తలపెట్టిన పనులలో అవాంతరాలు ఏర్పడతాయి. ఈ మాసం ఈ రాశి వారు రుద్రార్చన లేక శివ అష్టోత్తరం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా ధనం వృధాగా ఖర్చు . ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఆదాయ మార్గాల కోసం అన్వేషణ చేస్తారు. సమాజము నందు మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. పాతమిత్రులను కలుస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. వివాహాది ప్రయత్నాలు సఫలీకృతం అగును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృతి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానాలు పొందగలరు. మాసాంతంలో చేయు వ్యవహారాల యందు కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించవలెను. కొన్ని విషయాలు వినడం వలన మానసికంగా బాధపడతారు. సమాజము నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడవచ్చును. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడవచ్చును. దగ్గర బంధు వర్గం తోటి కలహాలు ఏర్పడును. ప్రత్యర్థులు అపకారం చేయాలని చూస్తారు. మిత్రుల తోటి సఖ్యతగా ఉండవలెను. భార్యతోటి అభిప్రాయ బేధాలు రాగలవు. ఈ మాసం ఈ రాశి వారు గణపతి అర్చన లేక గణపతి అష్టోత్రం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో కలిసి విందు వినోదాలు తోటి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు విద్య యందు ప్రతిభ కనబరుస్తారు. సమాజము నందు సన్మానాలు బహుమతులు లభిస్తాయి. పొదుపు పథకాల మీద దృష్టి సారిస్తారు. కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం లభించును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. రుణ బాధలు తీరి ప్రశాంతత లభిస్తుంది. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఉద్యోగమునందు పని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. మాసాంతంలో అనవసరంగా ధనం ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడుతుంది. సమస్యలు కీలకంగా మారి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ మాసం ఈ రాశి వారు రుద్రార్చన చేయండి లేక శివ అష్టోత్తరం లేదా స్తోత్రం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
మనసునందు భయంగా ఉండును. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడుతుంది. ఉద్యోగమునందు అధికార అధికారుల ఒత్తిడిలు ఎక్కువగా నుండును.  సంతాన పరంగా ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. జీవన విధానంలో స్వల్ప మార్పులు రావచ్చును. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు తగ్గును. చెడు పనుల యందు ఆసక్తి పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం వలన ఇబ్బందులుంటాయి. కోపాన్ని అదుపు చేసుకోవాలి. ఇతరులతోటి విరోధాలకు దూరంగా ఉండవలెను. శారీరకంగా బలహీనంగా ఉంటుంది.. బంధువర్గం తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. పుత్రుల వలన మనస్థాపం పెరుగును. మిత్రులతోటి కలిసిమెలిసి మెలగాలి. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త వహించవలెను. దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడను. మాసాంతంలో సమాజం నందు కుటుంబము నందు ప్రతిభ  తగ్గ గౌరవం లభించును. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులు కలసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు విద్య యందు ప్రతిభ పాటలు కనబరిచారు.  నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఈ మాసం ఈ రాశి వారు దుర్గా అర్చన లేక దుర్గ అష్టోత్తరం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఆకస్మిక ధన లాభం వరిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. విందు వినోదాలు తోటి ఆనందంగా గడుపుతారు.  వృత్తి వ్యాపారాల యందు లాభసాటిగా జరుగును. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి.  చేయ పనులలో పెద్దవారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు. గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. విద్యార్థులు విద్య యందు శ్రద్ధ చూపిస్తారు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. సంతాన వృద్ధి ఆనందం కలుగుతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.  ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానములు లభించును. మా సాంతంలో మానసికంగా శారీరకంగా బలహీనపడతారు. అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. శారీరక శ్రమ పెరుగుతుంది. తలపెట్టిన పనులలో అవరోధాలు ఎదురైనా పట్టుదలతోటి పూర్తి చేయాలి. ఈ మాసం ఈ రాశి వారు విష్ణు అర్చన లేక విష్ణు సహస్రనామం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4): 

శారీరక శ్రమ తగ్గి సౌఖ్యంగా సౌఖ్యం గలుగును. సమాజము నందు మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తిస్తుంది. కీలకమైన సమస్యలను ధైర్యంగా ముందడుగు వేయండి. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగును.  వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. కీలకమైన సమస్యలు  పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది . ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. సంఘమునందు ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి బంధవర్గంతోటి చర్చిస్తారు. ఉద్యోగమునందు అధికారుల యొక్క స్నేహ సంబంధాలు బలపడతాయి. జీవన విధానంలో మంచి మార్పులు రావచ్చును. దాస దాసి వర్గము తోటి అభిప్రాయ బేదములు  లేకుండా చూసుకొని వలెను. దూరపు ప్రయాణాలు వలన లాభం కలుగుతుంది. తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మాసాంతంలో అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మనసునందు భయంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు యందు ధన నష్టం కలగవచ్చు. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చును. అధిక శ్రమ ఏర్పడుతుంది. ఈ మాసం ఈ రాశి వారు మహాలక్ష్మి అర్చన లేక లక్ష్మి అష్టోత్రం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి

Latest Videos

click me!