వార ఫలాలు: ఓ రాశివారికి ఆస్తి లాభం, నిరుద్యోగులకు శుభవార్తలు

First Published | Jan 1, 2023, 9:30 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  రుణ బాధలు తీరి ఉపశమనం లభిస్తుంది.  వృత్తి వ్యాపారాలలో సామాన్యం. దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం
 

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి  ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం


Zodiac Sign

 
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
శారీరక శ్రమ తగ్గి శరీర సుఖం లభిస్తుంది. సమాజము నందు కుటుంబమునందు గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. సంఘమునందు బహుమానాలు పొందుతారు. ఆకస్మిక ధనం లభిస్తుంది. మిత్రుల యొక్క ఆదరణ అభిమానాలు పొందుతారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభాలు పొందుతారు.. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. ఉద్యోగులకు పై అధికారులు ఒత్తిడిలు శ్రమ తగ్గి ప్రశాంతత లభిస్తుంది. వారాంతంలో పనులయందు ఆటంకాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని వలెను. ఊహించిన ఖర్చులు పెరుగును. మానసిక ఆందోళన. వాహన ప్రయాణాలందు జాగ్రత్త అవసరం.

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఆదాయ మార్గాలు తగ్గును. అనుకోని సమస్యల వలన మనసు నందు కలతలు ఏర్పడుతాయి. అసూయ ద్వేషాలకు దూరంగా ఉండండి. మిత్రులతోటి సఖ్యతగా ఉండవలెను. ఆచితూచి ఖర్చు చేయవలెను. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. వారాంతంలోగృహమునందు శుభకార్యాచరణ. అనుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు.  సంతాన అభివృద్ధికి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. రుణ బాధలు తీరి ఉపశమనం లభిస్తుంది.  వృత్తి వ్యాపారాలలో సామాన్యం. దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభించును ఆలోచన విధానం పెరుగుతుంది. మానసికంగా శారీరకంగా బలపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Zodiac Sign


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ వృద్ధి కొరకు ఆలోచనలు  ఫలిస్తాయి . తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా నిర్వహించారు. .ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పెట్టుబడులలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగులు పై అధికారులతో సమయస్ఫూర్తిగా వ్యవహరించవలెను. ప్రయాణంలో జాగ్రత్త వహించాలి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. వారాంతంలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చు కొనవలెను. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతోటి పూర్తి చేయాలి. జీవిత భాగస్వామి తోటి అన్యోన్యత పెరిగి దాంపత్య జీవితం ఆనందంగా గడుపుతారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లాభిస్తాయి. కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు. సంతాన వృద్ధి ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు.  అవసరాల మేరకు ఖర్చు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును . రుణ బాధలు తీరి ఉపశమనం పొందుతారు. ఇతరుల విషయంలో జోక్యం తగదు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. పట్టుదలతో ప్రయత్నించిన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. వారాంతంలో సమస్యలు కీలకంగా మారి ఇబ్బందులు ఎదురవుతాయి. సమాజం నందు కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. ఖర్చు విషయంలో జాగ్రత్తలు అవసరము.

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
కలహాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం. ఉద్యోగం నందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఎక్కువగా నుండును.  శారీరకంగా మానసికంగా బలహీనం గా ఉంటుంది. ప్రత్యర్థులు అపకారం చేయాలని చూస్తారు.  అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని వలెను. సమాజం నందు అవమానాలు కలుగును. వారాంతంలో శుభకార్యాల నిమిత్తం  ఖర్చు చేస్తారు.  ఆకస్మిక ప్రయాణాలు.  ఉద్యోగం నందు అధికారుల ఒత్తిడి తగ్గుతుంది.   వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు.. సోదరుల మధ్య అన్యోన్యత పెరుగును. వ్యాపార భాగస్వాములతో తెలివిగా వ్యవహరించవలెను. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు తీరి అనుకూలమైన లాభాలు పొందుతారు. సంతాన అభివృద్ధికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
మానసిక ఉద్రేకతలు పెరుగును.  సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు ఆందోళన కలిగిస్తాయి.వృత్తి వ్యాపారాలకు సామాన్యం.  క్రయవిక్రయాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించవలెను. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండవలెను. ప్రభుత్వ సంబంధిత పనుల్లో  ఏర్పడతాయి. వారాంతంలో ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. ఉద్యోగమునందు అభివృద్ధి కనబడును. ఆదాయ మార్గాలు బాగుంటాయి.సంతాన మూలకంగా లాభం. కోర్టు వివాదాలు  పరిష్కారం అవుతాయి.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.  వాహన ప్రయాణాలలో మెలకువ అవసరం. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ఆలోచనలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించవలెను. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రావాల్సిన బాకీలు వసూలగును. కోర్టు వ్యవహారాల యందు విజయం. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి.కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులు యొక్క కలయక.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. వారాంతంలో కలహాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ఉద్యోగము నందు అధికారులతో కలహాలు ఏర్పడవచ్చును.  శారీరక శ్రమ పెరుగుతుంది

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. రుణ బాధలు తీరి ఊరట లభిస్తుంది. సన్నిహిత సహాయ సహకారాలతో ధన లాభాన్ని పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన పదోన్నతులు పొందొచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. నూతన వ్యాపార ఆలోచనలు ఫలిస్తాయి . ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో లాభాలు. వారాంతంలో కొన్ని వార్తల వలన మనసు నందు బాధ కలుగుతుంది.ఆవేదన చెందుతారు. సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. కొన్ని ఆకస్మిక పరిణామాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి.

Zodiac Sign


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
వచ్చిన అవకాశాలని తెలివితేటలుగా అందుపుచ్చుకొనవలెను. నిరాసాన్నిస్పృహలకు గురవుతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.  సమాజము నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.  ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. గృహ నిర్మాణ విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను.  సంతాన మూలకంగా లాభాలు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాలు యందు ధనలాభం కలుగుతుంది.ఉద్యోగులకు పై అధికారుల యొక్క స్నేహ సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతారు.

Zodiac Sign


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
మనసునందు అనేక ఆలోచనలతోటి తికమకగా ఉంటుంది. ఇతరులతోటి కలహాలు ఏర్పడను. బుద్ధి కుశలత తగ్గుతుంది. కొన్ని విషయాలు వలన బాధ కలుగుతుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వారాంతంలోకుటుంబం నందు శుభకార్యచరణ. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం. ఉద్యోగులకు పదోన్నతులు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన వస్తు వాహన ప్రాప్తి. కుటుంబ వృద్ధికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. తలపెట్టిన కార్యములలో జాప్యం జరిగిన పూర్తి చేస్తారు. గృహము నందు ప్రతికూల వాతావరణం. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం.

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు. వృతి వ్యాపారాలు స్వల్ప లాభాలు. వారాంతంలో నూతన పరిచయాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. నూతన వస్తు వాహనాది  కొనుగోలు చేస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. కీలకమైన సమస్యలు పరిష్కారం మగును.భూ గృహ క్రయవిక్రయాల కలిసి వస్తాయి.రుణ రోగ బాదలు తగ్గును. వారాంతంలో వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు పై అధికారుల మూలంగా చికాకులు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోని వలెను. సమాజము నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. చేయ ఖర్చులు ఆచూతూచి చేయవలెను. మనసునందు ఆందోళనగా ఉంటుంది.

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
మనసునందు అనేక ఆలోచనలతోటి చికాకుగా ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. శారీరక శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రావచ్చు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు  తగ్గును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగించును. వారాంతంలోసంఘంలో గౌరవ ప్రతిష్ఠలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు అనుకూలమైన పదోన్నతులు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన మూలకంగా లాభాలు. రుణాలు కొంతమేర తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు.

Latest Videos

click me!