Ugadi Rashiphalalu: విశ్వావసు నామ సంవత్సరంలో మేష రాశి ఫలితాలు

Ugadi RashiPhalalu: ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో మొదటి రాశి అయిన మేష రాశివారికి ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 

mesha rasi ugadi panchangam 2025 telugu new year aries rasi phalalu

2025 మార్చి 31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలవుతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో మొదటి రాశి అయిన మేష రాశివారికి ఎలా ఉండనుందో సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

mesha rasi ugadi panchangam 2025 telugu new year aries rasi phalalu

మేష రాశివారికి విశ్వావసు నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించనుంది. ఈ ఏడాదిలో గురుడు వృషభరాశిలో సంచరిస్తుండటం వల్ల మేష రాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.అంటే ఏడాది మొదట్లో ఆర్థికంగా బాగానే కలిసొచ్చే అవకాశం ఉంది. సంపాదనలో వీరు ధర్మకార్యాలకు వెచ్చించే అవకాశం ఉంది.ఆ సమయంలో వారికి వాటిపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు తగ్గిపోయే అవకాశం ఉంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. అయితే మే తర్వాత మాత్రం కష్టాలు మొదలయ్యే అవకాశం ఉంది.
 


mesha rasi ugadi panchangam 2025 telugu new year aries rasi phalalu

15 మే 2025 నుంచి అక్టోబర్ 19, 2025 వరకు గురుడు మిథున రాశిలోకి అడుగుపెట్టనున్నాడు.ఆ సమయంలో వీరికి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసిక సమస్యలు కూడా వస్తాయి. బంధువులు, మిత్రులతో  విబేధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, కాస్త జాగ్రత్తగా ఉండాలి.అక్టోబర్ 20, 2025 నుండి డిసెంబర్ 5, 2025 వరకు కర్కాటక రాశిలో సంచరించే గురుడు, కొన్ని నిర్ణయాల్లో స్థిరత లేకుండా చేయవచ్చు. ఈ సమయంలో ఆకస్మిక ధన వ్యయం జరుగవచ్చు, అందువల్ల ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం.

శని మీన రాశిలో సంవత్సరాంతం వరకు సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, అపకీర్తి భయం, ప్రయాణాల్లో వ్యయప్రయాసలు తప్పవు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే, రాహువు 18 మే 2025 వరకు మీన రాశిలో ఉండడం వల్ల ఆకస్మిక ధన నష్టం, అనారోగ్య సమస్యలు, ప్రయాణాల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. 19 మే 2025 నుంచి కుంభ రాశిలో ప్రవేశించిన తర్వాత కొత్త వస్త్రాలు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. రాహువు ప్రభావం వల్ల అనుకోని ధనలాభం కలగవచ్చు. కేతువు కన్య రాశిలో ఉండడం వల్ల విదేశ యానం అవకాశాలు మెరుగవుతాయి, శుభకార్యాలు సులభంగా నెరవేరతాయి. 19 మే 2025 నుంచి సింహ రాశిలోకి మారిన కేతువు పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసే అవకాశాన్ని అందిస్తాడు.
 

mesha rasi ugadi panchangam 2025 telugu new year aries rasi phalalu

విశ్వావసు నామ సంవత్సరంలో  మేష రాశికి ఏ నెలలో ఎలా ఉంటుందంటే

ఏప్రిల్ నెలలో పెట్టుబడులకు అనుకూల సమయం కాదు, ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మే నెలలో వృత్తి, వ్యాపార రంగంలో సామాన్యంగా ఫలితాలు ఉంటాయి. జూలై నెల అనుకూలంగా ఉంటూ, ఉద్యోగస్తులకు పదోన్నతులు, బదిలీలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలలో అప్పులు తీర్చే అవకాశముండగా, వ్యవసాయదారులకు మంచి లాభదాయక సమయం. సెప్టెంబర్ మధ్యస్థంగా కొనసాగుతుంది. అక్టోబర్ నెల మేష రాశి వారికి అనుకూలంగా ఉండి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నవంబర్ నెలలో అనారోగ్య సమస్యలు, శత్రువుల పెరుగుదల ఉండే అవకాశం. డిసెంబర్ నెలలో ధన నష్టం, కుటుంబంలో ఒత్తిడులు ఎదురయ్యే అవకాశముంది. జనవరి నెలలో కుటుంబ సమస్యలు, ధన ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఫిబ్రవరి నెల అంతగా అనుకూలించకపోవచ్చు, ఆకస్మిక ప్రయాణాలు, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. మార్చి నెలలో డబ్బు ఖర్చు అధికమవుతుందని, వ్యాపారాలు అంతగా రాణించకపోవచ్చని సూచనలు ఉన్నాయి.

mesha rasi ugadi panchangam 2025 telugu new year aries rasi phalalu

ఈ సంవత్సరానికి మేష రాశి వారికి ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. వ్యాపారాల్లో సరిగ్గా ప్రణాళిక చేసుకుని ముందుకు సాగడం మంచిది. శుభకార్యాలకు అనుకూల సమయాల్లో నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది.

Latest Videos

click me!