Mercury Transit: భరణి నక్షత్రంలోకి బుధుడు.. నెలరోజులు ఓపిక పడితే ఈ 5 రాశులకు మంచి రోజులు మొదలు

Published : Apr 01, 2026, 07:54 PM IST

Mercury Transit: బుధుడు భరణి నక్షత్రంలోకి మరో నెల రోజుల్లో మే 7న ప్రవేశించబోతున్నాడు. ఈ గ్రహ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పడుతుంది. ముఖ్యంగా 5 రాశుల వారికి ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

PREV
15
మేష రాశి

భరణి నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడం వల్ల మే 7 నుంచి మేష రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. వారికి వారిపై నమ్మకం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బుధుడి నక్షత్ర మార్పు మేష రాశిలోనే జరుగుతుంది కాబట్టి వీరి వ్యక్తిత్వానికి మరింత ఆకర్షణ తోడవుతుంది. ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. చేసే ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. ఇక వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు వస్తాయి.  వీరికి కొత్త ఆదాయ మార్గాలు దొరుకుతాయి. అయితే ఈ రాశి వారు తమ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

25
మిథున రాశి

మిథున రాశికి అధిపతి బుధుడు. కాబట్టి బుధుడి సంచారం వల్ల ఈ రాశి వారికి రాజయోగం దక్కుతుంది. వ్యాపారం చేస్తున్నవారికి కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయమనే చెప్పాలి. ఇక వ్యాపార భాగస్వాములతో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. వీరికి వివిధ  మార్గాల నుంచి డబ్బు చేతికి అందుతుంది. వీరి వాక్చాతుర్యంతో కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆర్థిక లాభం, పురోగతికి అనేక దారులు తెరుచుకుంటాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక సమస్యలు ముగిసిపోతాయి.

35
సింహ రాశి

సింహ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చే కాలం ఇది. బుధుడు వల్ల ఈ రాశి వారికి  తెలివితేటలు పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యే కాలం ఇది.  కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారం చేస్తున్న వారికి ఆర్థిక వృద్ధి కనిపిస్తుంది. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్యలో రాణిస్తారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి శుభవార్తలు అందుతాయి. తండ్రి నుంచి మద్దతు, ఆస్తులు పొందే అవకాశం ఉంది.

45
తులా రాశి

భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. అలాగే తులా రాశి శుక్రుడికి సొంత రాశి అవుతుంది.  కాబట్టి బుధ సంచారం ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. కళలు, మీడియా, రచన రంగాలలో ఉన్నవారు మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఇక భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు కలుగుతాయి. ఊహించని ధనలాభం కలిగే అవకాశం ఉంది. మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. తోబుట్టువుల నుంచి సపోర్టు లభిస్తుంది.

55
ధనుస్సు రాశి

ధనుస్సు రాశికి ఐదవ ఇంట్లో బుధుడి ప్రవేశిస్తాడు. బుధ సంచారం ఈ రాశి వారి కెరీర్‌లో పెద్ద పురోగతి కలుగుతుంది. ఉద్యోగం మారాలని ఆలోచించే వారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. ఇక పరిశోధన రంగంలో ఉన్నవారు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. వ్యాపారంలో గణనీయమైన ఆర్థిక లాభం ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories