మే నెల రాశిఫలాలు.. ఆ రాశులవారికి ధనాదాయం పెరుగుతుంది...

First Published May 1, 2021, 10:28 AM IST

ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య
undefined
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ నెలలో ప్రధమ , ద్వితీయ వారాలలో వృత్తి , ఉద్యోగ , వ్యాపార వ్యవహారములో ఆశించిన ఫలితాలు పొందుతారు. ప్రత్యర్ధుల మీద పై చేయి సాధిస్తారు. స్థిరాస్థి సంబంధ అగ్రిమెంట్లకు అనుకూలం. అవివాహితులకు వివాహ సంబంధ సంతోషము లభించును. వాహన సౌఖ్యం పొందుతారు. తృతీయ వారం నుండి కార్య విఘ్నతలు ఎదురగును. కార్యక్రమాలలో శ్రమించవలెను. ప్రైవేట్ ఉద్యోగస్తులకు చికాకులు. కృత్తిక నక్షత్ర స్త్రీలకు అనారోగ్యం. స్టాక్ మార్కెట్ వ్యవహారములో అదృష్టం కలసిరాదు. 20, 21, 29 తేదీలలో సమస్యలు. కుటుంబ సంబంధ వ్యవహార చిక్కులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో అంతగా అనుకూల ఫలితాలు ఉండవు. వాదనలకు ఈ మాసం అనుకూలమైనది కాదు. అయితే ధనాదాయం సామాన్యం గా ఉండును. వ్రుత్తి జీవనంలో వేధింపులు కొనసాగుతాయి. వ్యవహార నష్టములు. నూతన వ్యాపారములు ప్రారంభించుటకు , ఉద్యోగ జీవనంలో మార్పులకు ఈ మాసం మంచిది కాదు. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదరగుట వలన ధన వ్యయం ఎదుర్కొందురు. పితృ వర్గీయుల వలన సహాయం పొందుతారు. ఈ మాసంలో 11,12,15 మరియు 16 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో ముఖ్యమైన కార్యములను అనుకున్న విధంగా పూర్తి చేయగలరు. పిత్రు వర్గం వారి సహకారం లభించును. ధనాదాయం సామాన్యం. రాజకీయంగా పదవులు, హోదా పొందుటకు ప్రయత్నాలు చేయుటకు ఇది అనువైన కాలం. సంతాన ప్రవర్తన కొంత ఆందోళన కలుగచేయును. విదేశి ప్రాంతం లో స్థిరత్వం కొరకు చేయు ప్రయత్నాలు ఫలించును. వ్యాపార రంగంలోని వారికి నూతన పెట్టుబడులు లభించును. వ్యాపార విస్తరణ కు ఇది అనుకూల కాలం. మాసాంతంలో ప్రతిభ కు తగిన ప్రోత్సాహం ఉండును. ఉదర సంభందమైన సమస్యలు భాదించగలవు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ నెలలో అన్నివిధాలా ఆదాయం బాగుండును. స్వశక్తితో అన్ని కార్యములు పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధ ప్రయత్నములకు, వివాహ ప్రయత్నములకు, సంతాన ప్రయత్నములకు ఈ మాసం చక్కటి అనువైన కాలం. ఆర్ధిక రుణాల నుండి బయట పడతారు. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు చక్కటి ఉత్సాహం ఏర్పరచును. 20,21,22 తేదీలలో మిత్ర సంబంధ వ్యవహారముల వలన ఒక నష్టం ఎదుర్కోను సూచన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ నెలలో అతి చక్కటి ఫలితాలను పొందుతారు. ధనాదాయం పెరుగును. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఆశించిన లాభములు లభించును. వివాహ పరంగా దూర ప్రాంతము నుండి వచ్చిన ఎదురుచూస్తున్న శుభ వార్త ఆనంద పరుస్తుంది. గృహ వాతావరణం శాంతిని కలిగి ఉంటుంది. మాస మధ్యలో వ్యక్తిగత ఖర్చులు ముఖ్యంగా వాహనాలు లేదా ఆభరణాలు కొనుగోలు చేయుట వలన అధికంగా ఏర్పడును. కోర్తు వ్యవహరములలో నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చివరి వారంలో ఒంటరితనం అనుభవిస్తారు. కళాకారులకు చక్కటి అభివృద్ధి లభించును. ఈ మాసంలో 2,6,7,15,16,29 తేదీలు ఉద్యోగ జీవనములో మార్పులకు అనుకూలమైనవి. నూతన ప్రణాళికలు రచించడానికి కూడా అనుకూలమైనవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో సమస్యలు తగ్గును.పరిస్థితులు మెరుగు పడును. ఆదాయం లో పెరుగుదల లభించును శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. సమయం ప్రాధాన్యత గుర్తించాలి. ఒత్తిడి ని తట్టుకొని పని చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. బంధువుల కలయికతో సంబంధాలు మెరుగుపడును. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయగలరు.22 వ తేదీ తదుపరి సంతోషకర వార్తలు వింటారు. ఇష్ట దైవ ఆరాధన కలసి వస్తుంది.జీవనంలోఉన్నతి మరియు సంతాన పరంగా శుభం ఏర్పరుస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో ఆదాయంలో కొద్దిపాటి తగ్గుదల ఏర్పడును. ప్రధమ అర్ధ భాగం వ్యయం అదుపు తప్పుతుంది. మిత్రులను సర్దుబాటుకు ధనం అడగవలసి వచ్చును. ఎదురుచూస్తున్న అవకాశములు చేజారిపోవును. ఆదాయ మార్గంలో ఆకస్మిక నష్టములు. శ్రమించవలెను. ఇంటా బయటా సంతృప్తి ఉండదు. వృత్తి నైపుణ్యాలు పెంచుకోవలెను. ద్వితీయ అర్ధ భాగం నుండి కొంత వెసులుబాటు లభిస్తుంది. చిరకాలంగా నలుగుతూన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కూడా సహకరించును. ఈ మాసంలో 3,4,10,12 తేదీలలో ముఖ్య నిర్ణయాలు తీసుకొనుట అంత మంచిది కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. తృతీయ వారం ప్రారంభం వరకు ప్రతికూలతలు అధికంగా ఉండును. ఓర్పుతో వ్యవహరించాలి. ధనాదాయం సామాన్యం. సుఖ వ్యాధుల వలన బాధ. ఆలోచనలు అధికం అగుట వలన సతమతమవుతారు. తప్పిదాలను ఒప్పుకొని దైవాన్ని క్షమాపణ కోరుట వలన సంకల్పములు నెరవేరును. బంధు వర్గం వారితో జాగ్రత్త అవసరం. మొత్తం మీద ఈ మాసం అంత ఉత్సాహపూరిత కాలం కాదు.ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ నెలలో మానసిక ఒత్తిడి అధికం. కానీ ఆదాయం బాగుండును. రావలసిన ధనం చేతికి వచ్చును. ద్వితీయ వారంలో వాహన ప్రమాద సూచన ఉన్నది. తృతీయ వారం అంతగా బాగుండదు. ముఖ్యంగా ధన వ్యయం విపరీతంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో కూడా అననుకూలత ఉన్నది. వ్యాపారులకు ఆశాభంగములు ఎదురగును. రాజకీయ పదవుల కోసం తీవ్రంగా శ్రమించవలెను. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం అగును. తలపెట్టిన పనులు హడావిడిగా సాగుతాయి. ఆగ్రహవేశాలు అదుపులో ఉంచుకోవాలి. ఈ మాసంలో 24,25 తేదీలలో ఉద్రేకం వలన నష్టం మరియు మిత్రు వర్గీయులతో శత్రుత్వములు ఏర్పడు సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో ధనాదాయం సామాన్యం. నూతన పదవులు ఆశించిన వారికి కష్టం మీద పదవులు ప్రాప్తించును. ఉద్యోగ జీవనములో స్థిరత్వం ఉండదు. కుటుంబ సంతోషములు మాధ్యమం. నూతన గృహ సంబంధ ప్రయత్నాలు, స్థానచలన ప్రయత్నాలు విజయవంతం కావు. 16వ తేదీ తదుపరి నూతన వ్యాపారములు యోగించును మరియు నూతన వస్తువుల అమరిక లభించును. మాసాంతంలో వివాహిత స్త్రీలకు తమ వైవాహిక జీవన భవిష్యత్ గురించిన ఆందోళన ఏర్పడు సూచన. ఈ మాసంలో 1,6,10,19 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ నెలలో అనవసరమైన సమస్యలను తగ్గించు కుంటారు. శుభకార్యాలకు పరిస్థితులు అనుకూలం. శస్త్ర చికిత్స తప్పిపోవును. కళత్రసలహాలను పెడచెవిన పెడతారు. జీవిత భాగస్వామి సంబంధిత ధన లాభములు ఏర్పడును. వారసత్వ పరంగా ఆర్ధికంగా వృద్ధి ఏర్పడుతుంది. మానసిక ఉల్లాసం లభిస్తుంది. చివరి వారంలో ఉద్యోగంలో తోటివారిచే అవమానములు లేదా అకారణ తగాదాలు వంటి అననుకూలమైన ఫలితాలు ఏర్పడును. మిత్ర వర్గం అండ లభించదు. ఎవరిని విమర్శించ కూడదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ నెలలో గృహ సంబంధ నిర్మానములకు, ఋణ ప్రయత్నములకు మంచిది కాదు. ద్వితియ వారంలో సన్మానం పొందు అవకాశం ఉన్నది. కార్య సిద్ధత లభిస్తుంది. విదేశీ ప్రయాణాలకు ఈ మాసం అనుకూలమైనది. ఏ పని చేపట్టినా పూర్తి చేయగలుగుతారు. అవసరాలకు లోటు ఏర్పడదు. సాంకేతక రంగ ఉద్యోగులకు చాలా అనుకూలమైన వారం. తృతీయ వారంలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు. శస్త్ర చికిత్స చేయించుకొనుటకు సూచన ఉన్నది. సంతాన ప్రయత్నాలు వృధా ప్రయత్నములగును. నాలుగవ వారంలో సామాన్య ఫలితాలు ఎదురగును. కళత్రముతో చికాకులు తొలగును. నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
click me!