Mars Transit: జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని ధైర్యం, బలం, ఆస్తి, ప్రతిభకు కారకుడిగా భావిస్తారు. కుజుడు త్వరలో నక్షత్రం మారనున్నాడు. ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తీసుకురానుంది. మరి కుజుడి ఆశీస్సులు పొందే ఆ రాశులేవో చూసేయండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి మారడానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఒక గ్రహం ఏదైనా నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు, ఆ నక్షత్ర అధిపతి, అధిదేవత లక్షణాలు రాశుల ఫలితాలపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. సెప్టెంబర్ 24న కుజుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 17 వరకు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ మొత్తం కాలంలో కుజుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు.
పుష్య నక్షత్రానికి అధిపతి శని కాగా, అధిదేవత బృహస్పతి. కర్కాటక రాశిలో కుజుడు బలహీనంగా ఉన్నప్పటికీ, గురువు ప్రభావం వల్ల కుజుడి ప్రతికూల ఫలితాలు కొంతమేర తగ్గుతాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి డబ్బు, కెరీర్, వ్యాపారం, కుటుంబ జీవితంలో మంచి మార్పులు రావచ్చు. ఈ సంచారంతో ఎక్కువ ప్రయోజనాలు పొందే రాశుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
26
మేష రాశి
మేష రాశి వారికి ఈ కుజ నక్షత్ర సంచారం చాలా విషయాల్లో పురోగతికి అవకాశాలు కల్పిస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్లీ వేగవంతమవుతాయి. ఆస్తి సంబంధిత ప్రయత్నాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారాలలో లాభాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఊహించని శుభవార్తలు మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో బంధం, అవగాహన పెరిగే అవకాశం ఉంది.
36
మకర రాశి
మకర రాశి వారికి ఈ సమయం ఉద్యోగం, డబ్బుకు సంబంధించిన విషయాల్లో మార్పును తీసుకురావచ్చు. ఆఫీసులో మీకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పాటు, మీ ప్రతిభకు, కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం లేదా వృత్తిపరమైన అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా లాభదాయకమైన అవకాశాలు ఏర్పడతాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు దొరుకుతాయి. కుటుంబ మద్ధతుతో ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోగలుగుతారు.
సింహ రాశి వారికి కుజుడి పుష్య నక్షత్ర సంచారం కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ఎదురుచూస్తున్న వారికి తగిన అవకాశం లభించవచ్చు. పని ప్రదేశంలో కొత్త బాధ్యతలు రావడం మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక అవకాశంగా మారుతుంది. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు.
56
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ సంచారం ఆర్థిక విషయాల్లో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఆదాయం పెరిగే అవకాశాలతో పాటు, వ్యాపారంలో ఊహించిన లాభాలు అందుతాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అడ్డంకులు తగ్గి, కెరీర్ అభివృద్ధికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది.
66
కన్య రాశి
కన్య రాశి వారికి కుజుడు పుష్య నక్షత్రంలో సంచరించే కాలం కెరీర్, పదవి, గుర్తింపునకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం లేదా వృత్తిలో కొత్త బాధ్యతలు రావడంతో మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ఊహించని విధంగా రాణిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.