మహా శివరాత్రి కోసం శివ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ రోజున శివుడిని పూజించి నిష్టగా ఉపవాసం ఉంటారు. దీనివల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ మహాశివరాత్రి నాడు శివుడు, పార్వతి వివాహం చేసుకున్నారని కూడా నమ్ముతారు. మరి ఈ పవిత్రమైన రోజున రాశిచక్రం ప్రకారం.. ఎలాంటి పరిహారాలు చేస్తే శివానుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మేషం
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గంధాన్ని శివుడికి పెట్టి ఎర్రచందనం పువ్వులను శివుడికి సమర్పించాలి. వీటితో పాటు శివాష్టకాన్ని కూడా పఠించొచ్చు.
వృషభ రాశి
వృషభ రాశి వారు మహాశివరాత్రి రోజున శివలింగానికి గంధం, బిల్వపత్రాన్ని సమర్పించాలి. దీనితో పాటుగా శివ చాలీసా పఠించడం కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
మిథున రాశి
ఈ రాశి వారు శివలింగానికి పూజ చేసి శివలింగంపై ఏడు తెల్లని పువ్వులను సమర్పించండి. తర్వాత శివ స్తోత్రాన్ని పఠించండి.
Mahashivratri
కర్కాటకరాశి
మహాశివరాత్రి నాడు కర్కాటక రాశి వారు ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేసి శివ సహస్రాన్ని పఠించాలి.
సింహ రాశి
శివారాధన సమయంలో సింహ రాశి వారు పసుపు చందనాన్ని పూయాలి. వీటితో పాటుగా శివ మహిమ స్తోత్రాన్ని కూడా పఠించాలి.
కన్యా రాశి
ఈ రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా శివ చాలీసా పఠించాలి. అలాగే శివుని అనుగ్రహం పొందడానికి శివలింగంపై బిల్వ పత్రను సమర్పించండి.
MahaShivratri
తులా రాశి
పూజ సమయంలో శివలింగానికి ఏడు సువాసన గల తెల్లని పువ్వులను సమర్పించండి. అలాగే శివ చాలీసా పఠించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో కష్టాలన్నీ మాయం అవుతాయి.
వృశ్చికరాశి
ఈ రాశివారు శివలింగానికి ఎర్రచందనం చెక్కను, ఏడు ఎర్రచందనం పువ్వులను శివుడికి సమర్పించండి. అలాగే వీలైనంత వరకు 'ఓం నాగేశ్వరాయ నమః' అనే మంత్రాన్ని జపించండి.
ధనుస్సు రాశి
పూజ సమయంలో శివలింగానికి పసుపు పువ్వులు సమర్పించి, మహామృత్యుంజయ స్తోత్రం పఠించండి. ఇలా చేయడం వల్ల శివుని ప్రత్యేక అనుగ్రహం పొందుతారు.
మకర రాశి
మహాశివరాత్రి నాడు శివలింగాన్ని పూజిస్తూ వీలైనంత వరకు 'ఓం అర్ధనారీశ్వరాయ నమః' అనే మంత్రాన్ని పఠిస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది.
కుంభ రాశి
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కుంభ రాశి వారు శివలింగానికి త్రిమూర్తుల భస్మాన్ని పూసి అపరాజిత పుష్పాలను సమర్పిస్తారు. దీనితో పాటుగా మీరు మహామృత్యుంజయ కవచాన్ని కూడా పఠించవచ్చు.
మీన రాశి
ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివుడిని ధ్యానించాలి. దీనితో పాటు 'ఓం అనంతధర్మాయ నమః' అనే మంత్రాన్ని పఠించండి.