వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల జాతకంలో శుక్రుడు , బుధుడు కలయిక ఏర్పడుతుతోంది. దీని కారణంగా ఆ రాశుల జాతకంలో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత పవిత్రమైన , ప్రయోజనకరైనదిగా పరిగణిస్తారు. బుధుడు జూన్ 14 న మిథునంలోకి ప్రవేశిస్తాడు, ఇప్పటికే ఈ రాశిలో శుక్రుడు ఉన్నాడు. మిథునరాశిలో బుధ, శుక్రుల కలయిక వల్ల లక్ష్మీ నారాయణ రాజయోగం కలుగుతుంది. ఈ రాజయోగం దాదాపు 18 రోజుల పాటు కొనసాగుతుంది, కాబట్టి 2 జూలై 2024 వరకు ఈ క్రింది రాశులకు భారీ లాభాలు ఉన్నాయి. ఆ రాశులేంటో చూద్దాం...