ప్రేమించినవారిని మోసం చేసేటప్పుడు ఈ రాశుల వారు ఏం చేస్తారో తెలుసా?

Published : Nov 29, 2021, 05:22 PM IST

ఆ ప్రేమించిన వారితో.. అందరూ జీవితాంతం కలిసి ఉండలేరు. ఏదో ఒక కారణంతో విడిపోయేవారు కూడా ఉంటారు. కొందరేమో.. కావాలని చీటింగ్ చేసి వెళ్లిపోతూ ఉంటారు. అలా చీటింగ్ చేసే క్రమంలో.. ఏ రాశివారు ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దామా.

PREV
113
ప్రేమించినవారిని మోసం చేసేటప్పుడు ఈ రాశుల వారు ఏం చేస్తారో తెలుసా?


జీవితంలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరిని ప్రేమిస్తారు. అది  చాలా సహజం కూడా. అయితే.. ఆ ప్రేమించిన వారితో.. అందరూ జీవితాంతం కలిసి ఉండలేరు. ఏదో ఒక కారణంతో విడిపోయేవారు కూడా ఉంటారు. కొందరేమో.. కావాలని చీటింగ్ చేసి వెళ్లిపోతూ ఉంటారు. అలా చీటింగ్ చేసే క్రమంలో.. ఏ రాశివారు ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దామా.
 

213

1.మేష రాశి..
ఈ రాశివారు తాము ప్రేమించిన వారిని వదిలేసి వెళ్లిపోవాలి.. చీట్ చేయాలి అనుకున్నప్పుడు.. వారితో గొడవపడటం, వాదించడం మానేస్తారు. ఏది చెప్పినా.. మౌనంగా ఉండిపోతారు.
 

313

2.వృషభ రాశి..
ఈ రాశివారు ఈ వ్యక్తులు వాదిస్తారు . మిమ్మల్ని గందరగోళానికి గురిచేయడానికి ప్రయత్నిస్తారు. వారు సంభాషణ , మానసిక స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తారు. గొడవ పెట్టుకొని మరీ వాదించి.. వారే విజయం సాధిస్తారు.
 

413

3.మిథున రాశి..
ఈ రాశివారు.. మొదట వారు వాదిస్తారు. తర్వాత మిమ్మల్ని ఒప్పిస్తారు.  వారు వింతగా ప్రవర్తిస్తారు. చాలా ఆలస్యంగా వారు మిమ్మల్ని వదిలేస్తున్నారనే  విషయం మీకు తెలుస్తుంది.

513


4.కర్కాటక రాశి..
ఈ రాశివారు.. తమ పార్ట్ నర్ ని వదిలేయాలి అనుకుంటే.. ఆ విషయాన్ని నిర్మొహమాటంగా.. వారికి చెప్పేస్తారు. వెంటనే వదిలేసుకొని వెళ్లిపోతారు.
 

613

5.సింహ రాశి..
ఈ రాశివారు.. చాలా తెలివిగలవారు. వీరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు.. మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నారనే విషయం కూడా మీకు తెలీదు. మీరు రియలైజ్ అయ్యేసరికి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది.
 

713

6.కన్య రాశి..
ఈ రాశివారు..  నిజాన్ని దాచడంలో సిద్దహస్తులు. వారు అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తారు, కానీ చివరికి మీకు నిజం చెబుతారు.

813

7.తుల రాశి..
ఈ వ్యక్తులు వారు ప్రశ్నలను తప్పించుకుంటారు . మీరు మొదట అడిగిన వాటిని మరచిపోయేలా చేస్తారు. కానీ వారు చివరికి మీకు తెలియజేస్తారు.
 

913

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు.. మోసం చేయడంలో ఫుల్ టాలెంట్ ఉంటుంది. అయితే.. ఆ విషయాన్ని ఎప్పటికోగానీ మీ ముందు బయటపెట్టరు.

1013

9.ధనస్సు రాశి..
ఈ రాశివారు.. మోసం చేసే సమయంలో బాగా తడపడతారు. వీరు చాలా తొందరగా దొరికిపోతారు. ఏవేవో కథలు చెప్పి నమ్మించడానికి ప్రయత్నిస్తారు.

1113

10.మకర రాశి..
ఈ రాశివారు.. మోసం చేస్తారు. కానీ.. దానిని దాచడం వీరికి రాదు.. దాచడానికి ప్రయత్నిస్తారు కానీ.. దొరికిపోతారు. కాబట్టి.. వీరికి కనిపెట్టడం  చాలా సులభం.

1213

11.కుంభ రాశి..
ఈ  రాశివారు చేయాల్సింది మొత్తం చేస్తారు. కానీ.. తాము అబద్ధం చెబుతున్నామనే విషయాన్ని మాత్రం అస్సలు అంగీకరించరు. మహా ముదురులు.

1313

12.మీన రాశి..
ఈ రాశివారు.. వాళ్ళు నవ్వుతూ, అవసరమైతే కప్పిపుచ్చుకుంటారు కానీ తప్పు అని తెలిసినప్పుడు, వారు వాదించరు.

click me!

Recommended Stories