ధనస్సు రాశివారితో లవ్ లైఫ్.. ఏ రాశివారు సెట్ అవుతారు..!

Published : Jun 14, 2022, 10:39 AM IST

ఇక ధనస్సు రాశి విషయానికి వస్తే... వీరు మరీ ఎక్కువ తెలివిగల వారు కాకపోవచ్చు.. చురుకుగా ఉండకపోవచ్చు.. కానీ... ఒక్కసారి రిలేషన్ లోకి అడుగుపెడితే.. ఆ బంధం విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. 

PREV
113
 ధనస్సు రాశివారితో లవ్ లైఫ్.. ఏ రాశివారు సెట్ అవుతారు..!
The Sagittarius

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో లవ్ లైఫ్ ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. తమ వ్యక్తిత్వానికి తగిన వ్యక్తి మన జీవితంలోకి వస్తే బాగుండని అందరూ అనుకుంటారు. ఇక ధనస్సు రాశి విషయానికి వస్తే... వీరు మరీ ఎక్కువ తెలివిగల వారు కాకపోవచ్చు.. చురుకుగా ఉండకపోవచ్చు.. కానీ... ఒక్కసారి రిలేషన్ లోకి అడుగుపెడితే.. ఆ బంధం విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. మరి అలాంటి ధనస్సు రాశివారికి ఏ రాశివారు కరెక్ట్ గా సెట్ అవుతారో ఓసారి చూద్దాం..

213

మేషంతో ధనస్సు రాశి..

మేష రాశి వారికీ, ధనస్సు రాశి వారికి అభిరుచుల్లో తేడాలు ఉంటాయి. ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు అస్సలు కలవవు. చాలా కొద్ది విషయంలో మాత్రం వీరు ఒకేలా ఆలోచిస్తారు. అయితే... వీరు కలిసి ప్రయాణం చేయడం మొదలుపెడితే మాత్రం.. నెమ్మదిగా వారి అభిప్రాయాలు కలిసే అవకాశం ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా మొదలుపెడతారు.

ఈ రెండు రాశుల మధ్య కంపాటబులిటీ మొత్తం: 4

సెక్స్: 5

ప్రేమ: 3

కమ్యూనికేషన్: 4

313

వృషభంతో ధనస్సు రాశి..
ఈ రెండు రాశులకు అంత పెద్దగా సెట్ అవ్వకపోవచ్చు.  చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇద్దరి మధ్య ఏదో తెలియని కోల్డ్ వార్ జరుగుతున్న ఫీలింగ్ ఉంటుంది. ఆలోచనలు కూడా భిన్నంగా ఉంటాయి. కాబట్టి.. ఈ రెండు రాశుల ప్రయాణం అనుకున్నంత సజావుగా సాగకపోవచ్చు.

ఈ రెండు రాశుల కంపాటబులిటీ మొత్తం: 3

సెక్స్: 4

ప్రేమ: 5

కమ్యూనికేషన్: 3

413

మిథునంతో ధనస్సు రాశి..
ఈ రెండు రాశుల మధ్య కమ్యూనికేషన్, లవ్ లైఫ్ బాగానే ఉన్నా.. ఏదో ఒక విషయంలో కాస్తో కూస్తో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది. అయితే.. వాటిని ఎవరో ఒకరు సర్దుకుంటే... వీరి లైఫ్ బాగానే ఉంటుంది. ఎప్పుడూ బాధతో కాకుండా.. నవ్వుతూ జీవితంలో ముందుకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి.

ఈ రెండు రాశుల కంపాటబులిటీ మొత్తం: 4

సెక్స్: 2

ప్రేమ:3

కమ్యూనికేషన్: 3

513

కర్కాటకంతో ధనస్సు రాశి..

ఈ రెండు రాశులు జీవితం ప్రారంభిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఒకరినొకరు గౌరవించుకుంటారు. అన్ని విషయాల్లో మద్దతుగా నిలుస్తారు. అత్యంత కష్టమైన సమస్యలను కూడా పరిష్కరించగలరు. వీరి బంధం చివరి వరకు ఆనందంగా ఉంటుంది. 
ఈ రెండు రాశుల కంపాటబులిటీ మొత్తం: 4

సెక్స్: 4

ప్రేమ: 5

కమ్యూనికేషన్: 5
 

613

సింహంతో ధనస్సు రాశి..

ఈ రెండు రాశులు ది బెస్ట్ ఛాయిస్ అనే చెప్పొచ్చు.  ఈ రెండు రాశులు అన్ని విషయాల్లోనూ బాగా కలిసిపోతుంటారు. కలిసి మీరు ఒకరినొకరు ఎక్కువ కాలం కోరుకునే ప్రేమికులు అవుతారు. బహుశా మీ సహచరులు , ప్రియమైనవారు కూడా కలిసి ఉండటానికి మీకు మద్దతునిస్తారు. వీరి బంధం బాగుంటుంది.
ఈ రెండు రాశుల కంపాటబులిటీ మొత్తం: 5

సెక్స్: 5

ప్రేమ: 4

కమ్యూనికేషన్: 3

713

కన్య రాశితో ధనస్సు రాశి..
ఈ రెండు రాశులు కూడా కలిసి జీవితం మొదలుపెడితే బాగుంటుంది. వీరి అభిరుచులు కలుస్తాయి. వీరు ఒకరికొకరు అన్నింటిలోనూ తోడుగా ఉంటారు. ఈ రెండు రాశులు అన్ని విషయాలను అర్థం చేసుకుంటారు.సమస్యలు ఎదురైనా ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. చాలా ఉల్లాసంగా జీవిస్తారు. 

ఈ రెండు రాశుల కంపాటబులిటీ మొత్తం: 4

సెక్స్: 3

ప్రేమ: 3

కమ్యూనికేషన్: 5

813

తుల రాశితో ధనస్సు రాశి..

గేర్‌ను మార్చుకోవడానికి, కెరీర్ మార్గాలతో పాటు మీ జీవిత మార్గాన్ని కూడా మార్చుకోవడానికి , కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి సహాయపడుతుంది. కొన్ని విషయాల్లో సర్దుకుపోతే... వీరి లైఫ్ ఆనందంగా ఉంటుంది. ఒకసారి ఏదైనా సమస్య వస్తే.. అది మళ్లీ పునరావృతం కాకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడు వీరి బంధం బాగుంటుంది. 

ఈ రెండు రాశుల కంపాటబులిటీ మొత్తం: 4

సెక్స్: 3

ప్రేమ: 5

కమ్యూనికేషన్: 4

913

వృశ్చిక రాశితో ధనస్సు రాశి..

ఈ రెండు రాశులు ఒకరిని మరొకరు ఆకర్షించగలరు. వీరు కలిసి ఆనందంగా జీవించగలరు. వీరిద్దరూ కలిసి ఉండటానికి పెద్దగా బుర్రకు పదును పెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు.కేవలం ఎమోషన్స్, బంధాలతో వీరి బంధం సాగుతుంది.

ఈ రెండు రాశుల కంపాటబులిటీ మొత్తం: 4

సెక్స్: 4

ప్రేమ: 5

కమ్యూనికేషన్: 4

1013

ధనస్సు రాశి తో ధనస్సు రాశి..

ఈ రెండు రాశుల వారి ఆలోచనలు, అభిప్రాయాలు, అభిరుచులు అన్నీ ఒకేలా ఉంటాయి. ఎవరు ఎప్పుడు ఆలోచిస్తారో.. వీరికి బాగా తెలుసు. కాబట్టి.. ఈ రెండు రాశుల కాంబినేషన్ బాగుంటుంది. ఒకరినొకరు స్ఫూర్తి నింపుకుంటారు. అర్థం చేసుకుంటారు. సంతోషంగా జీవించగలరు.


ఈ  రెండు రాశుల కంపాటబులిటీ మొత్తం: 5

సెక్స్: 5

ప్రేమ: 5

కమ్యూనికేషన్: 3

1113

మకర రాశితో ధనస్సు రాశి..

ఈ రెండు రాశుల కాంబినేషన్ కూడా బాగుంటుంది. ధనస్సు రాశివారిలో ఉన్న మంచి వ్యక్తిత్వమే.. ఈ రాశివారితో కలవడానికి కారణం కావచ్చు. ఈ రెండు రాశుల వారు కలిస్తే జీవితం ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. వీరిద్దరి కొత్త ప్రయాణం చాలా సరదాగా సాగుతుంది. కొత్త ఆవిష్కరణలు కూడా చేస్తారు.


మొత్తం: 5

సెక్స్: 4

ప్రేమ:3

కమ్యూనికేషన్: 4

1213

కుంభ రాశితో ధనస్సు రాశి..
ఈ రెండు రాశుల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గు మంటుంది. వీరికి పెద్దగా సెట్ కాకపోవచ్చు. ప్రతి విషయంలోనూ గొడవలు పడుతూ ఉంటారు. ప్రతిదీ భిన్నంగానే ఆలోచిస్తారు. వీరి మధ్య సానుకూలతలకన్నా..ప్రతికూలతలే ఎక్కువగా ఉంటాయి.

ఈ రెండు రాశుల కంపాటబులిటీ మొత్తం: 3

సెక్స్: 3

ప్రేమ: 4

కమ్యూనికేషన్: 3
 

1313

మీన రాశితో ధనస్సు రాశి..

ఈ రెండు రాశులు అమితంగా ఒకరినొకరు ప్రేమించుకుంటే తప్ప వీరు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టకూడదు. ఎందుకంటే.. వీరి మధ్య ఎన్ని సందేహాలు తలెత్తినా.. వాటిని పరిష్కరించినా.. మళ్లీ సందేహాలు వస్తూనే ఉంటాయి. ఒకరిపై ఒకరు తరచూ డౌట్ పడుతూ ఉంటారు. 

ఈ రెండు రాశుల కంపాటబులిటీ మొత్తం: 3

సెక్స్: 4

ప్రేమ 3
కమ్యూనికేషన్  4
 

click me!

Recommended Stories