Lord Shiva: ఈ 3 రాశులపై శివుని కృప.. మహాశివరాత్రి నుంచి ఆదాయం, ఆనందం రెట్టింపు

Published : Feb 03, 2026, 10:18 AM IST

Lord Shiva: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహాశివరాత్రి నుంచి కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు. ముఖ్యంగా  మూడు రాశుల వారికి భారీగా కలిసివస్తుంది. ఆ మూడు రాశులు ఏవో తెలుసుకోండి. అందులో మీ రాశి ఉందేమో చూడండి. 

PREV
14
2026లో మహాశివరాత్రి ఎప్పుడు?

హిందూ సంప్రదాయంలో మహా శివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది.  ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు. మన క్యాలెండర్ ప్రకారం మహా శివరాత్రి ఫిబ్రవరి 15 సాయంత్రం 5.04 గంటలకు మొదలై ఫిబ్రవరి 16 సాయంత్రం 5.34 గంటలకు ముగుస్తుంది.  ఈ సంవత్సరం మహాశివరాత్రి ఉపవాసం ఫిబ్రవరి 15, 2026న పాటించాల్సి వస్తుంది.

మహాశివరాత్రి నాడు అనేక శుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. ఇది కొన్ని రాశుల వారికి ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మహాశివరాత్రి నాడు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతోంది. ఈ శుభ యోగ సమయంలో శివునికి నీటితో అభిషేకం చేస్తే శివుని ప్రత్యేక ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇక శివుని కరుణ అధికంగా ఉన్న రాశులు మూడు ఉన్నాయి. ఆ మూడు రాశుల గురించి ఇక్కడ ఇచ్చాము.

24
మేష రాశి

మేష రాశి వారికి మహాశివరాత్రి రోజు ఎంతో బాగా కలిసి వస్తుంది.  ఈ రాశి వారు శివుని ప్రత్యేక ఆశీస్సులు కలిగిఉంటారు. ఈ రాశి వారి జీవితం నుంచి ఆర్థిక ఇబ్బందులు తొలగి సంతోషంగా జీవిస్తారు. వీరు ఎంతో కాలంగా పడుతున్న కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఆర్ధికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.

34
కన్యా రాశి

మహాశివరాత్రి కన్యారాశికి ఎంతో కలిసొస్తుంది. ఈ పండుగ వారి జీవితంలో సంతోషాన్ని తెస్తుంది. ఈ రాశి వారికి కష్టాలు, సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. ఈ రాశి వారికి బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు అవుతుంది. వీరికి ఆస్తి, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు అనకున్న విషయాల్లో విజయం సాధించే అవకాశం ఉంది.

44
కుంభ రాశి

జ్యోతిషశాస్త్రం ప్రకారం, కుంభ రాశి వారికి మహాశివరాత్రి బాగా కలిసివస్తుంది. ఈ రాశి వారికి శివరాత్రి ఎంతో శుభప్రదమైన రోజుగా చెప్పుకుంటారు. ఈ రాశి వారు ఆ శివుని దయ వల్ల గొప్ప విజయాలను అందుకుంటారు.  వీరికి అధిక సంపదను పొందే అవకాశం ఉంది. అలాగే జీవిత భాగస్వామితో  మంచి సంబంధాలు బలపడతాయి. కుటుంబం నుంచి మంచి మద్దతు లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories