2023లో తుల రాశివారి ఫలితాలు..!

First Published | Dec 7, 2022, 11:00 AM IST

2023 లో తుల రాశివారికి రోజురోజుకు అనుకూల స్థితి పెరగడం దృష్ట్యా మీకు భవిష్యత్తు బాగుంటుంది. అందరి నుంచి ప్రోత్సాహం బాగా అందడమే కాకుండా కొత్త వ్యాపార అంశాలకు పాత వ్యవహార చికాకుల పరిష్కారాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు.

Astro


 
ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)


2023 సంవత్సరంలో ఈ రాశివారి గోచారం పరిశీలించగా  ఆర్థిక లావాదేవీలు సంవత్సరం అంతా కూడా మీకు అనుకూల స్థితిని కలుగచేసేవిగా ఉంటాయి. అంతేకాకుండా మధ్యమధ్యలో నెలకు ఒకసారి మారే గ్రహ సంచారం ప్రభావం చేత కూడా యింకా విశేషాలు అందే అవకాశం ఉంది.దైనందిన కార్యక్రమములు అన్నీ సవ్యంగా ఉన్నాయి. రోజురోజుకు అనుకూల స్థితి పెరగడం దృష్ట్యా మీకు భవిష్యత్తు బాగుంటుంది. అందరి నుంచి ప్రోత్సాహం బాగా అందడమే కాకుండా కొత్త వ్యాపార అంశాలకు పాత వ్యవహార చికాకుల పరిష్కారాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. వ్యాపారులకు మంచి పోటీతత్వంతో వ్యాపారం నడిచి లబ్దిని అందుకునే కాలము. అయితే ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో కుంభకోణాలు భయటపడాయి. భూమి కోనుగోలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలి. 
 

Libra Zodiac

ఈ రాశివారి నెలవారీ ఫలితాలలోకి వెళితే... 
 
జనవరి 2023
 
ఈ నెలలో  కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. శ్రతృవులు కూడా మిత్రులుగా మారతారు, శుభకార్య ప్రయత్నాలలో వున్నవారికి అంతా అనుకూల వాతావరణమే. గ్రహచారం దృష్ట్యా పుణ్యక్షేత్రాలు సందర్శించడం, గురువులను, పూజ్యులను సందర్శించడం వంటి ఫలితాలు ఉంటాయి. కోర్టు వ్యవహారములలో వున్న వారికి ఈ నెల అంతా యిబ్బందికర అంశాలు ఎదురౌతాయి. అయితే విజయం వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో వున్నవారికి పనులు వేగవంతం అవుతాయి.
 
 లవ్ లైఫ్ : మీ భాగస్వామి తరుపు బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వారి నుండి లబ్ది  కోసం యత్నాలు సాగిస్తారు. ఈ క్రమంలో కొందరు ప్రత్యర్థులు ఏర్పడతారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. 

ఉద్యోగం-వ్యాపారం:    ఉద్యోగం వ్యాపారాల్లో ఈ సంవత్సరం గత సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగం చేయువారికి అధికారుల ప్రోత్సాహం, వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరం అవుతాయి.
 
 ఆరోగ్యం:    ఆరోగ్య విషయంలో అంతా అనుకూలమే అయితే కొత్తగా వచ్చే సమస్యలు ఏమీ ఉండవు కానీ హృద్రోగులు చర్మ వ్యాధులు వున్నవారు చిన్నచిన్న చికాకులు పొందే అవకాశం ఉంటుంది.

 
ఫిబ్రవరి 2023

ఈ నెలలో మిశ్రమంగా ఉంది.   ఈ రాశివారికి మిగిలిన గ్రహముల ప్రభావంగా ఎన్నిరకములైన ఒత్తిడి వున్ననూ దైనందిన కార్యక్రమములలో అంతా శుభసూచకమే ఉంటుంది. అయితే మానసిక అధైర్యము, అశాంతి ఒత్తిడి, అందరినీ అనుమానించే లక్షణం ఉంటుంది. ఇతురల వ్యవహారములలో కలుగ చేసుకోవద్దు.   ఆర్థిక లావాదేవీలు బాగా జరిగి మీరు చాలా ఆనందంగా కాలం గడుపుతుంటారు. ఒక్కోసారి ఎందుకు దుఃఖభరితమైనటువంటినీ, ఏదో తెలియని భారంతో కూడిన మనస్సుతో సంచరిస్తూ ఉంటారు కారణం ఉండదు. ఆదాయం రావలసిన స్థాయికి తగిన రీతిగా అందుకుంటారు.
 

లవ్ లైఫ్:  మీ లైఫ్ పార్టనర్ తో కొత్త అనుభూతులు ఆస్వాదించే సమయం..ఆనందంగా ఉండండి. చిన్న చిన్న గొడవలతో ఆనందాన్ని దూరం చేసుకోకండి. గ్రహాల అనుకూలత ఉంది.  దూరమైన సంబంధాలు మెరుగు పడే అవకాశాలు ఉన్నాయి.పిల్లలు సైతంమిమ్మల్ని అర్దం చేసుకుంటారు. కుటుంబ విషయంలో వేరే వారి సలహాలు ఇబ్బంది పెడతాయి.   
  
 ఉద్యోగం-వ్యాపారం:  ఈ నెల లోఉద్యోగస్తులకు శుభసూచకం. ప్రమోషన్లతో కూడిన బదిలీలుంటాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. స్టాకిస్టులు హోల్ సేల్ వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 

ఆరోగ్యం:   స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.  వ్యయ ప్రయాసలు తప్పవు. హాస్పటిల్ పాలు కాకుండా జాగ్రత్తపడుట మంచిది. కొద్ది రోజుల్లోనే అన్ని సర్దుకుని మనోల్లాసాన్ని పొందుతారు.  

మార్చి 2023

ఈ రాశివారికి  ఈ నెల శుభప్రదం. ఏవ్యవహారాలైనా మరింత విజయవంతంగా పూర్తి చేస్తారు. సహనం మీకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరే సమయం. ధార్మిక కార్యక్రమాలలో మరింతగా పాల్గొంటారు. వ్యాపారస్తులు లాభాలను పెంచుకునే దిశగా అడుగులువేస్తారు. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. నెల మధ్యలో  స్వల్ప మార్పులు ఉంటాయి. పారిశ్రామి క, రాజకీయవేత్తలు మరిన్ని విజయాలు సాధిస్తారు. 

లవ్ లైఫ్ :   కుటుంబ జీవితం విషయంలో జాగ్రత్తలు వహించాలి. భార్య,భర్తల మధ్య అనుకూలతలు అంతంత మాత్రమే. మీకుటుంబ జీవనాన్ని మెరుగుపరిచే అవకాశాలు అందినట్టే వెనక్కి వెళ్లిపోతాయి. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించాలి. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. 

ఉద్యోగం-వ్యాపారం: ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉపాధ్యాయులకు బదిలీలు ఆందోళన కలిగిస్తాయి.  మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. వ్యాపారాలు ప్రధమార్ధం కంటె ద్వితీయార్థంలో బాగుంటాయి. 

ఆరోగ్యం: ఆరోగ్య విషయంలో   కుటుంబంలో చికాకులు ఉన్నప్పటికీ అవన్నీ త్వరలోనే సమసిపోతాయి. గురుబలం తోడవటం వల్ల ఈ నెల మీ ఆరోగ్యం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. 

ఏప్రియల్  2023

ఈ నెల ఆశాజనకంగానే ఉంది. ఆదాయం బాగుంటుంది. రుణ బాధలు తొలగుతాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. కార్యం సిద్ధిస్తుంది. వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే కొన్ని చికాకులు తలెత్తే ఆస్కారం ఉంది. వ్యవహారాలు ఆశించినంత ప్రశాంతంగా సాగవు. కొన్ని విషయాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. అవివాహితులకు శుభదాయకం. 
 
లవ్ లైఫ్ :    ముఖ్యమైన విషయాల్లో   మీ జీవిత భాగస్వామి ని సంప్రదించటం వలన పనులు సులభంగా అవుతాయి. అలాగే కుటుంబ స‌భ్యుల‌తో విభేదాలు రానీయ‌వ‌ద్దు. ఒత్తిడి లేకుండా ఆలోచించండి తొంద‌ర‌పాటు నిర్ణ‌యాల వ‌ల్ల ఇబ్బందులు ఎదుర‌వుతాయి. 
 
ఉద్యోగం-వ్యాపారం: బిల్డర్స్ కు  నిర్మాణాల విషయంలో అభ్యంతరాలు తొలగుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. వృత్తులు, కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి.  వ్యాపారస్దులు పెద్దమొత్తం సరుకు నిల్వ శ్రేయస్కరం కాదు. 
 
ఆరోగ్యం: వాహనం నడిపేటపుడు జాగ్రత్త.   గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అనవసర విషయాలపై ఆసక్తి ప్రదర్శిస్తూ, ఇతరుల వివాదాల్లో తలదూర్చితే మీ ఆరోగ్యం పై దాని ప్రభావం పడుతుంది. 
 

మే  2023

ఈ నెల    అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. సమాజంలో విశేష ఖ్యాతి పొందుతారు. ధైర్యం, పట్టుదలే ఆయుధాలుగా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ధార్మికవేత్తలు ప్రవచనాలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఖ్యాతిగాంచిన వ్యక్తులను కలుసుకుంటారు. మీపై బంధువుల్లో అపార్ధాలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారస్తులు లాభాలు గడిస్తారు. అనుకున్న సమయానికి పెట్టుబడులు సమకూరే సమయం. ఉద్యోగస్తులు తగినంత గుర్తింపు పొందుతారు. అలాగే, ప్రమోషన్లు కూడా లభిస్తాయి.

లవ్ లైఫ్ :   ప్రేమికులకు ఇది కలిసొచ్చేకాలం.  మిమ్మల్ని తప్పుగా అర్దం చేసుకుని కొందరు విరోధులు ఏర్పడతారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరి మధ్యా జరిగే వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. 

ఉద్యోగం-వ్యాపారం:   జాగ్రత్తగా ఉండవలసిన కాలం. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. వ్యాపారస్దులకు కూడా ఇదే సూచన. 

ఆరోగ్యం:  శని వ్యయస్థానంలో సంచార సమయంలో కొంత ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. .కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా చికాకులు తరచుగా రాగలవు అయితే కొన్ని సందర్భాలలో ముందు జాగ్రత్తలు పాటించి మంచి ఫలితాలు కూడా తీసుకుంటారు. 

జూన్   2023
 
ఈ నెలలో  చికాకులు సానుకూలం అవుతాయి. నెల చివరలో కొన్ని కొత్త కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగించేవి కలుగుతాయి. విద్యా విషయముగా విదేశాలకు వెళ్ళేవారికి  కాలం అనుకూలం. అనవసర ఆలోచనలు ఏమీ చేయకుండా ఉంటే మంచిది. ఫైనాన్స్ వ్యాపారులు అధికమైన జాగ్రత్తలు పాటింపవలసిన కాలము. విద్యార్థులు తరచుగా నిగ్రహం కోల్పోయే స్థితిలో ఉంటారు. రైతులకు జాగ్రత్తలు తీసుకోవలెనని ప్రత్యేక సూచన. కోర్టు వ్యవహారములలో వున్నవారికి మోసపూరిత వాతావరణం వెనుకనే ఉంటుంది. స్థానచలన ప్రయత్నాలలో వున్నవారికి యిబ్బందికర ఘటనలు  ఎదురౌతాయి.
 

లవ్ లైఫ్ :    కొత్త అనుభూతులు ఆస్వాదించే సమయం..  గ్రహాల అనుకూలత బాగా ఉంది.  దూరమైన సంబంధాలు మెరుగు పడే అవకాశాలు ఉన్నాయి.పిల్లలు సైతంమిమ్మల్ని అర్దం చేసుకుంటారు. ప్రేమికులకు వేరే వారి సలహాలు ఇబ్బంది పెడతాయి.  

ఉద్యోగం-వ్యాపారం: ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ఇబ్బందులెదుర్కుంటారు. వ్యవసాయ తోటల రంగాల వారికి గిట్టుబాటు ధర విషయంలో సంతృప్తి ఉండదు. పంట చేతికొచ్చే సమయానికి వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలు బాగున్నా సంతృప్తి ఉండదు.    రోజు దక్షిణామూర్తి స్తోత్రం దుర్గా సప్తశ్లోకీ పారాయణ చేయండి.
 
ఆరోగ్యం: ఈ నెలలో ఆకస్మిక అనారోగ్యం. చిన్నపాటి వైద్యంతోనే సర్దుకుంటుంది. హాస్పటిల్స్ చుట్టూ తిరగకండి. కొద్ది రోజుల్లోనే అన్ని సర్దుకుని మనోల్లాసాన్ని పొందుతారు. కంటినిండా నిద్రే మీ బాధలకు మందు అని గ్రహిస్తారు.
 

జూలై   2023

ఈ నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పట్టుదలతో శ్రమిస్తే మీదే విజయం. స్వయంకృషితోనే సత్ఫలితాలు సాధిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిశ్చయమవుతుంది. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు.  పదవులు బాధ్యతల నుంచి తప్పుకోవలసి వస్తుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభిస్తాయి.

లవ్ లైఫ్ : మీ జీవిత భాగస్వామితో జీవితం బ్రహ్మాండంగా ఉంది.  దంపతుల మధ్య సఖ్యత లోపం ఉన్నా కొద్దిపాటి సహనం, తెలివితో పరిష్కారం అవుతుది. ఉద్యోగ ఒత్తిడి కుటుంబంపై పడనీయకండి. శుభకార్యాలకు తరుచు హాజరవుతారు. అందువలన మీకు కొన్ని కలసివచ్చే పరిస్దితులు కనపడుతున్నాయి.  మీ పిల్లలకు ఉపాధి,  ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. 

ఉద్యోగం- వ్యాపారం:    ఉపాధి పథకాలు, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు బాగుంటుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు సదవకాశాలు లభిస్తాయి. కార్మికులకు యోగదాయకం.  మార్కెట్ రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. వ్యవసాయ రంగాల వారికి సామాన్యం. 

 ఆరోగ్యం:  దంత బాధలు సూచిస్తున్నాయి. రాత్రిళ్లు మీకు నిద్రలేకుండా చేస్తుంది. అయితే చిన్న పాటి సర్జరీ లేదా వైద్యంతో  మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.   ఆహార,విహారాదులలో తప్పనిసరిగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. 
 

ఆగస్ట్    2023

 ఈ నెల  ప్రతికూలతలు అధికంగా ఉన్నాయి. అయితే ద్వితీయార్ధం కొంతమేరకు అనుకూలిస్తుంది. ప్రథమార్గంలో వ్యవహారాలు ఆశించంత అనుకూలంగా సాగవు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఖర్చులు విపరీతం, ప్రయోజనకరం. దంపతుల మధ్య అవగాహన లోపం, తరచు అకాల కలహాలు తలెత్తుతాయి. ద్వితీయార్థం ప్రతికూలతలు తొలగి కుదుటపడతారు.  ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అవివాహితులకు శుభయోగం. 

 లవ్ లైఫ్ :   ఈ నెలలో అవివాహితులకు శుభదాయకం. భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటారు. సాంసారిక జీవితం ఏ ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది. మీ జీవితంలో కొన్ని మధురమైన క్షణాలను మిగిలుస్తుందీ ఈ నెల.


ఆరోగ్యం:   పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. దాంతో సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి.  పరిష్కార సాధనకు  ఓర్పు, పట్టుదలతో శ్రమించాలి. పనిభారం, విశ్రాంతి లోపం. అయినా మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. 

ఉద్యోగం- వ్యాపారం:  కెరీర్‌లో కొత్త చిక్కులు ఎదురవుతాయి. మీరు పనిచేసే చోట ఒకరి ప్రవర్తన మిమల్ని బాధిస్తుంది. మీ విజయానికి కొత్త మెట్లు ఏర్పడతాయి. శ్రమకు తగిన ప్రతి ఫలం లభిస్తుంది. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది.
 

సెప్టెంబర్    2023

ఈ నెలలో   అద్భుతమైన గ్రహముల కలయిక వలన కాలం గడుచును. కంగారు పడవద్దు.  ఉద్యోగ విషయాలు చూస్తే మీకు యితరుల సహకారం బాగుంటుంది.  మీరు తొందరపాటుగా మాట్లాడడం వంటివి చేసి కొన్ని చికాకులు తెచ్చుకుంటారు. ఆదాయం సాధారణ స్థాయి . ఖర్చులు అధికం . అనవసర ఖర్చులు ఉంటాయి. విద్యా విషయంగా విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు అయినా పనులు పూర్తి అవుతాయి కానీ ధనవ్యయం కాల విలంబం ఎక్కువ అవుతుంది.  మీరు మొండిధైర్యం ప్రదర్శించి, ధనవ్యయం అధికంగా చేసి పనులు పూర్తి చేసుకోవాలి అని ప్రయత్నిస్తారు.శని, రాహు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. 
 
లవ్ లైఫ్ :  భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటారు. సాంసారిక జీవితం ఏ ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది. మీ జీవితంలో కొన్ని మధురమైన క్షణాలను మిగిలుస్తుందీ ఈ నెల.

ఉద్యోగం- వ్యాపారం: కన్స్ట్రక్షన్ రంగంలోను, రియల్ ఎస్టేట్ రంగంలో వున్నవారు శ్రమ ఎక్కువ చేసి సత్ఫలితాలు అందుకుంటారు. ఫైనాన్స్ వ్యాపారులు ధైర్యంగా వ్యాపారం చేసి వ్యవహారములు సానుకూలం చేసి కొన్ని సత్ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ ప్రయత్నాలలో ఆలస్యం చోటు చేసుకుంటుంది. 

ఆరోగ్యం: ఆరోగ్య విషయంలో పెద్దగా సమస్యలు ఏమీ లేవు. గతంలో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలకు ఈ నెలలో పూర్తి పరష్కారం దొరుకుతుంది. నీటిని ఎక్కువగా తాగమని వైద్యులు మీకు ప్రత్యేకంగా సూచిస్తారు. 

అక్టోబర్    2023

ఈ నెలలో స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో వున్నవారికి పనులు ఆలస్యం అవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. ఫలితాలు సంబంధం లేకుండా ధైర్యంగా ప్రయత్నిస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు చాలా చక్కగా నడుచును. అందరూ సహకారం చేస్తారు. ధనవ్యయం ఎక్కువ. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలకు ఈ నెల  శారీరక రక్షణ విషయంలో తెలివిగా జాగ్రత్తగా వ్యవహరించి ఆరోగ్యం కాపాడుకుంటారు. ఉద్యోగ నిర్వహణ, కుటుంబ విషయాలు సమర్థంగా గడుపుతారు.
 
లవ్ లైఫ్ :   కుటుంబ జీవనంలో కొన్ని సమస్యలు ఎదురైనా పరిష్కరించుకునే నేర్పు ఉంది. మీ భాగస్వామి తరుపు బంధుత్వాలు, పరిచయాలు వాటి నుంచిబయిటపడటానికి సాయిపడతాయి. ప్రేమికులకు ఇది కలిసొచ్చేకాలం.  మిమ్మల్ని తప్పుగా అర్దం చేసుకుని కొందరు విరోధులు ఏర్పడతారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరి మధ్యా జరిగే వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. 

ఉద్యోగం- వ్యాపారం: ఉద్యోగస్తులకు అధికారుల వేధింపులతో మనశ్శాంతి ఉండదు. ఒత్తిడి, పనిభారం. మీ సమర్ధత మరొకరికి కలిసివస్తుంది. వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పంట దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర నిరుత్సాహం కలిగిస్తుంది.  తోటల రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

ఆరోగ్యం:  గతంలోని ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఆ చిరాకులతో అకారణ విరోధాలు. నెలలో  ప్రథమార్ధంలో బాగా గడిచినా, ద్వితీయార్థం అంతగా కలసిరాకపోవచ్చు. ఈ క్రమంలో ఉద్యోగస్తులు పనితీరు మెరుగ్గా ఉన్నా పైస్థాయి వారితో మాటపడతారు. 

నవంబర్    2023

ఈ నెలలో   అన్ని అనుకూలంగానే ఉన్నా రాహు, కేతువుల సంచారం అధికంగా ఉండటం వల్ల ఊహించని సమస్యలెదురవుతాయి. వ్యవహారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవటం ఉత్తమం. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. పొదుపునకు ఆస్కారం లేదు.  స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో మెలకువ వహించండి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. శుభకార్యం తలపెడతారు. పరిచయాలు, బంధువుత్వాలు అధికమవుతాయి. 

లవ్ లైఫ్ : జీవన భాగస్వామి మీకు అనుకూలం. కొన్ని అంతరంగిక విషయాల్లో మీ దూకుడుకి అడ్డు కట్టు వేస్తున్నారని కోపం పెట్టుకోకండి. మీ మేలు కాంక్షించేవారు మీ వెన్నంటే ఉన్నారని భావించండి. అంతటా మీరు గౌరవింపబడతారు. 

ఆరోగ్యం:  ఈ నెలలో వృత్తి వ్యవహారాల ఒత్తిడి  రాత్రిళ్లు మీకు నిద్రలేకుండా చేస్తుంది. అయితే  జాగ్రత్తలతో మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. ఏదైమైనా ఆహార,విహారాదులలో తప్పనిసరిగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనతో అన్ని సర్దుకుంటాయి.
  
ఉద్యోగం- వ్యాపారం:    నిరుద్యోగులు ఏడాది ప్రారంభంలో ఉద్యోగావకాశాలు. వ్యవహారాలలో అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. సమస్యలను మీ అంతట మీరు పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతారు. విద్యార్థులు తమ ప్రావీణ్యంతో విజయాలు సాధిస్తారు. పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు శ్రమానంతరం లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవేత్తలకు కొన్ని అవాంతరాలు ఏర్పడి పరీక్షాకాలంగా ఉంటుంది. సినిమా వాళ్లు తొందరపాటు నిర్ణయాలతో అవకాశాలు దూరంగ చేసుకోవడం తగదు.
 

డిసెంబర్    2023


 ఈ నెల పరిక్షా సమయం.   మీరు ఎవరినయితే మీ స్వంతవారు అని భావిస్తారో వారు మీ యొక్క నిజ అవసరాలకు సంబంధించిన సమయంలో సహకరించరు. అలాగని మీరు ఎవరిమీదా ద్వేషపూరిత మనస్సును ప్రదర్శింపవద్దు. భోజన సౌకర్యం బాగుంటుంది. ప్రతి వ్యవహారమూ నడిపే ప్రయత్నంలో శరీరం మనస్సు బాగా సహకరిస్తాయి. కానీ ఆర్థిక వనరులు సరిగా సమకూరవు. ఆదాయం తక్కువ స్థాయిగాను ఖర్చులు అధిక స్థాయిలోను ఉంటాయి. అధికారులు బాగా సహకరిస్తారు. తద్వారా ఉద్యోగ వ్యాపార విషయాలలో అనుకూలస్థితి ఉంటుంది. అనుకున్న ఫలితాలు వృత్తి విషయంలో అందుకుంటారు. సాంఘిక కార్యకలాపాల ద్వారా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 
  
లవ్ లైఫ్ : మంచి రోజులు వచ్చినట్లే. మీ భాగస్వామి పూర్తిగా మిమ్మల్ని నమ్మటం జరుగుతుంది. ఈక్రమంలో వృత్తి పర కష్టాలు మీ ఫ్యామిలీ లైఫ్ పై పడనివ్వకండి. దగ్గర ఉంటూ ఒకరి సలహాలు మరొకరు తీసుకుంటూ ఉంటే  మీ బంధం మరింత బలపడుతుంది. ప్రేమికులకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది.  ఆనందం పెరుగుతుంది. 

ఆరోగ్యం: మీ ఆరోగ్యంలో ఏ సమస్యలు గ్రహాలు సూచించటం లేదు.అంతా  బాగుంది.  అయితే కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో  జాగ్రత్త పడండి.  ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం.  అందు నిమిత్తం ఋణప్రయత్నాలు చేస్తారు.

ఉద్యోగం- వ్యాపారం :   ఉద్యోగ విషయంగా విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు సానుకూలం. రియల్ ఎస్టేట్ రంగంలో వారి విషయమై అనుకూల గ్రహ సంచారం లాభ ఫలితాలనే సూచిస్తోంది. పుణ్యక్షేత్ర సందర్శన చేయు సంకల్పం వున్నవారు మంచి ఫలితాలు అందుతాయి. కోర్టు వ్యవహారములలో వున్న వారికి ప్రత్యక్షంగా శత్రువులతో లావాదేవీలు జరుగక మధ్యవర్తుల ద్వారా వ్యవహారం జరిగి కార్యలాభం చేకూరగలదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి.

Latest Videos

click me!