Simha Rasi 2024:న్యూ ఇయర్ లో సింహ రాశివారి వారికి వ్యయప్రయాసలు తప్పవు..!

Published : Dec 19, 2023, 03:16 PM IST

2024లోకి మనం అడుగుపెడుతున్నాం. మరి ఈ నూతన సంవత్సరంలో సింహరాశివారికి  వృత్తి, ఉద్యో గాల్లో గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు

PREV
13
Simha Rasi 2024:న్యూ ఇయర్ లో సింహ రాశివారి వారికి వ్యయప్రయాసలు తప్పవు..!
telugu astrology

సింహ రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం (2024 జనవరి నుంచి 2024 డిసెంబర్) ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఏయే నెలలు కలిసి వస్తుంది...ఎప్పుడు  ఇబ్బందులు ఉంటాయి ... రాశి వార్షిక ఫలాలు లో తెలుసుకుందాం

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

గురు:- ఏప్రిల్ నెలాఖరు వరకు భాగ్య స్థానంలో సంచరించి మే నెల నుండి రాజ్య స్థానంలో సంచారము.

శని:- ఈ సంవత్సరమంతా కళత్ర స్థానంలో సంచారము

రాహు:-ఈ సంవత్సరమంతా  అష్టమ స్థానంలో సంచారము

కేతు:-ఈ సంవత్సరమంతా  ధన స్థానంలో సంచారము

23

ఈ రాశివారు ఈ సంవత్సరంలో  శుభకార్య ప్రయ త్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి. 13.4.2024  నుండి వత్సరాంతం వరకు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుండుటచే మానసికానందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యో గాల్లో గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఇతరులకు ఇబ్బంది కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు వస్తాయి.

 30.4.2024 నుండి 12.7.2024  వరకు కొద్ది పాటి  అనారోగ్య బాధలతో సతమతమవుతారు.ఆరోగ్య సమస్యలు తొలగటానికి ఈ సంవత్సరం లలితాదేవిని పూజించడం మంచిది. అలాగే దుర్గాష్టకం మేలు చేస్తుంది. అలాగే , అవేశాలకు,కోపాలకు దూరంగా ఉండటం మంచిది. గుండె సంబంధిత వ్యాధులు, బిపి, షుగర్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి .సింహరాశివారికి  స్థానచలన సూచనలుంటాయి.ఆ క్రమంలో  నూతన వ్యక్తులు కలు స్తారు. కుటుంబ పరిస్థితులవల్ల మానసికాందోళన చెందుతారు. గృహలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చుచేస్తారు. తీర్థయాత్ర లు చేస్తారు. దైవదర్శనం ఉంటుంది.

33


ఇక ఆగస్ట్,సెప్టెంబర్ నెలల్లో  భార్య,భర్తలు కుటుంబం,పిల్లలు , ప్రేమ వ్యవహారాల విషయాలలో చికాకులు, గొడవలు వస్తూంటాయి.  వంటివి కొంత ఇబ్బంది కలిగించును. అవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉంటే ప్రేమ వ్యవహారాలు, జీవిత భాగస్వామితో ప్రేమ జీవితం సింహరాశి వారికి ఈ సంవత్సరం కలసివచ్చును. వ్యాపారస్తులకు ఆర్ధికపరమైనటువంటి లాభాలు చేకూర్చును. రైతాంగం వంటి రంగాలలో ఉన్నటువంటి వారికి ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టును.  దైవదర్శనంతో అన్ని సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసి కానందాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్టలు లభిస్తా యి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు విం టారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెర వేర్చుకుంటారు.

 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

click me!

Recommended Stories