న్యూ ఇయర్ లో ఇంట్లోకి ఇవి తెస్తే.. మీ సంపద పెరుగుతుంది..!

First Published | Dec 19, 2023, 11:33 AM IST

 కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు ఇంటికి కొన్ని వస్తువులను కొనుగోలు చేయాలి. జోతిష్యశాస్త్ర నిపుణులు   కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు మీరు ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులను, వాటితో మీ ఇంటికి వచ్చే ప్రయోజనాలను మాకు తెలియజేశారు.


మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ నూతన సంవత్సరంలో అంతా మంచే జరగాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయాలట.  జోతిష్యశాస్త్రం ప్రకారం, మనం ఏం చేస్తే,  ఈ సంవత్సరం మొత్తం దివ్యంగా సాగుతుందో తెలుసుకుందాం... 

 కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు ఇంటికి కొన్ని వస్తువులను కొనుగోలు చేయాలి. జోతిష్యశాస్త్ర నిపుణులు   కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు మీరు ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులను, వాటితో మీ ఇంటికి వచ్చే ప్రయోజనాలను మాకు తెలియజేశారు.

నెమలి ఈకలను మీ ఇంటికి తెచ్చుకోండి
కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు, అంటే, 2024, మీరు ఖచ్చితంగా నెమలి ఈకలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావాలి, ఎందుకంటే అవి ఇంటి నుండి ప్రతికూలతను తొలగిస్తాయని నమ్ముతారు. ఇవి శ్రీ కృష్ణునికి ఇష్టమైనవిగా పరిగణిస్తారు. వాటిని ఇంటికి తీసుకురావడం ద్వారా, శ్రీ కృష్ణుడితో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా సంవత్సరం మొత్తం మనతో ఉంటాయట.
 


tulsi

తులసి మొక్కను మీ ఇంటికి తెచ్చుకోండి


మీరు మీ ఇంటికి తులసి మొక్కను కూడా తీసుకురావాలి. తులసి ఇప్పటికే మీ ఇంట్లో ఉంటే, మీరు కొత్త సంవత్సరం మొదటి రోజున గంగాజలంతో శుద్ధి చేయాలి. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మీ ఇంటికి తాబేలు తీసుకురండి


తాబేలు లక్ష్మీదేవికి చిహ్నంగా, శాస్త్రాల ప్రకారం విష్ణువు  అవతారంగా పరిగణిస్తారు. రాగి లేదా ఇత్తడి లోహపు తాబేలును ఇంటికి తీసుకురావడం ద్వారా, మీ నూతన సంవత్సరం ఆనందం, శ్రేయస్సుతో నిండి ఉంటుంది మరియు శ్రీ హరి, లక్ష్మీ అనుగ్రహం మీ ఇంట్లో ఉంటుంది. దీంతో అప్పుల సమస్యలు కూడా దూరం అవుతాయి.

మీ ఇంటికి శంఖం  తీసుకురండి


శంఖం లక్ష్మీ దేవి చిహ్నాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది ప్రతికూలతను తొలగిస్తుందని ,ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకువస్తుందని నమ్ముతారు. అందుకే కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేలోపు ఇంట్లో శంఖం పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇది ఇంటి పరిసరాలను శుద్ధి చేసి శాంతిని కాపాడుతుంది.
 

Latest Videos

click me!