మనకు నిద్ర చాలా చాలా అవసరం. కంటినిండా నిద్రపోయే వారే ఆరోగ్యంగా ఉంటారు. అయితే సరైన నిద్ర గురించి వాస్తు శాస్త్రంలో వివరించబడింది. జ్యోతిష్యుల ప్రకారం.. నిద్రపోయే దిశ చాలా ముఖ్యం. సరైన దిశలో నిద్రిస్తే ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు. అలాగే నిద్రపోయేటప్పుడు మన పాదాలు, తల ఏ దిశలో ఉండాలో కూడా వాస్తు శాస్త్రం చెబుతుంది.
ఈ దిశలో నిద్రపోవద్దు..
వాస్తు శాస్త్రం ప్రకారం.. నిద్రపోయేటప్పుడు పాదాలను తూర్పు దిశలో ఉంచకూడదు. ఇలా చేయడం మీకు మంచిది కాదు. దీనివల్ల మీరు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ దిశలోనే దేవతలు నివసిస్తారట. అందుకే శాస్త్రాల ప్రకారం.. ఈ దిశలో పాదాలను చాపి పడుకోవడం మంచిది కాదని చెప్తారు.
దిశపై ప్రత్యేక శ్రద్ధ
దక్షిణ దిశను యమరాజు దిక్కుగా భావిస్తారు. అందుకే ఈ దిశలో పాదాలను చాపి ఎప్పుడూ కూడా పడుకోకూడదు. ఇలా చేయడం వల్ల యమరాజుకు మీపై కోపం వస్తుందట. జ్యోతిష విశ్వాసాల ప్రకారం.. ఈ దిశలో పాదాలను పెట్టి నిద్రపోవడం వల్ల మంగళ దోషాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
sleeping
సరైన నిద్ర దిశ ఏది?
నిద్రపోయేటప్పుడు పాదాలను పడమర దిశలో ఉంచి పడుకోండి. ఎందుకంటే ఈ పొజీషన్ లో మీ తల తూర్పు దిశలో ఉంటుంది. సూర్యుడు ఈ దిశ నుంచే ఉదయిస్తాడు. తూర్పు దిశలో తల పెట్టి పడుకోవడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. అలాగే ఉత్తర దిశలో పాదాలను పెట్టి పడుకోవడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.