శని భగవానుడు & కేంద్ర త్రికోణ రాజయోగం
శని కేంద్ర త్రికోణ రాజయోగం ఫలితాలు: శని భగవానుడు ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్నారు. 2025 వరకు ఇక్కడే ఉంటారు. దీనివల్ల ఈ రాశిలో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం కొన్ని రాశులవారికి అదృష్టాన్నిస్తుంది. ఊహించని ఆర్థిక లాభాలు, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది.
కేంద్ర త్రికోణ రాజయోగం & శని భగవానుడు
కేంద్ర త్రికోణ రాజయోగం అంటే ఏమిటి?
జ్యోతిషశాస్త్రం ప్రకారం, జాతకంలో 4, 7, 10వ స్థానాలు కేంద్ర స్థానాలు, 1, 5, 9వ స్థానాలు త్రికోణ స్థానాలు. ఈ స్థానాలకు సంబంధించిన గ్రహాలు ఒకదానికొకటి దృష్టి సంబంధం కలిగి ఉన్నప్పుడు లేదా రాశి మారినప్పుడు కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో ఏ రాశుల వారికి లాభాలు కలుగుతాయో చూద్దాం.
మేష రాశి
మేష రాశి: కేంద్ర త్రికోణ రాజయోగం మేష రాశి వారికి మేలు చేస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఆలోచనల్ని సానుకూలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
మేష రాశి
అప్పుడే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పెద్ద విజయం లభిస్తుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి. వ్యాపారులకు మంచి లాభాలుంటాయి. షేర్ మార్కెట్, జూదం, లాటరీ ద్వారా లాభాలు పొందుతారు.
కుంభ రాశి
కుంభ రాశి: కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడటం వల్ల కుంభ రాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనితీరు మెరుగుపడుతుంది. ధనలాభం ఉంటుంది. ఎక్కువ డబ్బు ఆదా చేస్తారు. వ్యక్తిగత జీవితం కూడా మునుపటి కంటే బాగుంటుంది. వివాహితుల జీవితం ఆనందంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి: కేంద్ర త్రికోణ రాజయోగం వృశ్చిక రాశి వారికి మేలు చేస్తుంది. ఈ సమయం భౌతిక సుఖాల్నిస్తుంది. ఆస్తి, వాహన యోగం ఉంది. ఏదైనా విలాసవంతమైన వస్తువు కొనుగోలు చేయవచ్చు.
వృశ్చిక రాశి
వ్యాపారులు ఎక్కువ లాభాలు పొందుతారు. వ్యక్తిగత జీవితంలో కూడా సంబంధాలు బలపడతాయి. తల్లితో సంబంధం బాగుంటుంది. ఆస్తి, భూమి, రియల్ ఎస్టేట్ సంబంధిత ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారికి మంచి లాభాలుంటాయి.