Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు

First Published | Apr 3, 2024, 4:16 PM IST

శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలివి. ఈ ఉగాది మొదలుకుని వచ్చే ఏడాది వరకు  కర్కాటక రాశి వారికి సంబందించిన మాస, వార్షిక ఫలితాలను ఇక్కడ చూడొచ్చు. అలాగే జన్మ నక్షత్రం ఆధారంగానూ ఫలితాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

ఆదాయం:-14
వ్యయం:-2

రాజపూజ్యం:-6
అవమానం:-6

గురుడు 1-5-24 వరకు రాజ్య స్థానంలో సువర్ణ మూర్తిగా సంచరించి సంవత్సరాంతం లాభ స్థానంలో  తామ్ర మూర్తిగా సంచారం.

శని ఈ సంవత్సరం అంతా అష్టమ స్థానంలో రజత సంచారం.

రాహువు ఈ సంవత్సరం అంతా భాగ్యస్థానంలో సువర్ణ మూర్తి గా సంచారం.

కేతువు ఈ సంవత్సరం అంతా తృతీయ స్థానంలో సువర్ణ మూర్తి గా సంచారము.


(ఈ రాశి వారికి అష్టమ శని )

ఈ సంచారం వలన ఈ సంవత్సరం తలచిన అన్ని పనులలో విజయం సాధిస్తారు.అనుకూలమైన ఫలితాలు పొందగలరు.సుఖ సౌఖ్యములు పొందగలరు.కుటుంబ అభివృద్ధి కలుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్న కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.సమాజంలో గౌరవ మర్యాదలు పొందగలరు. ఉద్యోగాలు లో అధికారంతో కూడిన ప్రమోషన్లు పొందుతారు.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. స్థలం కొనడం లేక గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో శుభకార్యాలు జరుగును.భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం అవును.వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది.సమస్యల వలన ఎడబాటు గా ఉన్న దంపతులు ఈ సంవత్సరం కలుసుకుంటారు.అన్ని విధాల అభివృద్ధి పొందుతారు.కోర్టు వ్యవహారాలు అనుకూలంగా తీర్పు వస్తాయి.విదేశీ వ్యవహారాలు అనుకూలం.

అష్టమ శని సంచారం వలన ఆరోగ్య సమస్యలు రాగలవు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం.ఉమ్మడి ఆస్తి వ్యవహారాలు ఇబ్బందులు రాగలవు.

కేతువు సంచారం అనుకూలం సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.


పునర్వసు నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు సాధన తార లో సంచారం తదుపరి 13-6-24 నుంచి నైధనతార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి మిత్ర తార లో సంచారం.

శని 3-10-24 వరకు జన్మతారలో సంచారం తదుపరి 04-12-24 నుంచి పరమ మిత్ర తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు జన్మతారలో సంచారం.

రాహువు 7-7-24 వరకు విపత్తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  సంపత్తార లో సంచారం.

కేతువు 11-11-24 వరకు నైధనతార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం సాధన తార లో సంచారం
 



పుష్యమి నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు సాధన తార లో సంచారం తదుపరి 13-6-24 నుంచి నైధనతార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి మిత్ర తార లో సంచారం.

శని 3-10-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి మిత్ర తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు పరమ మిత్ర తార లో సంచారం.

రాహువు 7-7-24 వరకు సంపత్తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం జన్మతారలో సంచారం.

కేతువు 11-11-24 వరకు సాధన తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం ప్రత్యక్తార లో సంచారం.

ఆశ్రేష నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు క్షేమ తార లో ంచారం తదుపరి 13-6-24 నుంచి ప్రత్యక్తార లో  సంచారం తదుపరి 20-8-24 నుంచి సాధనతార లో సంచారం.

శని 3-10-24 వరకు మిత్ర తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి నైధనతార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు మిత్ర తార లో సంచారం.

రాహువు 7-7-24 వరకు జన్మతారలో సంచారం తదుపరి సంవత్సరాంతం వరకు పరమ మిత్ర తార లో సంచారం.

కేతువు 11-11-24 వరకు ప్రత్యక్తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం క్షేమతార లో సంచారం.

(ఈ సంవత్సరం ఈ రాశి వారు శని రాహు సంచారం అనుకూలంగా లేదు కాబట్టి తరచుగా శనికి తైలాభిషేకం ప్రతి నెల మూలా నక్షత్రం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయడం మంచిది.
ఈ రాశి వారికి అర్థాష్టమ శని జరుగుతున్నది కావున శని జపం తిల దానం చేయడం మంచిది)


ఏప్రిల్
ఈనెల సామాన్య ఫలితాలు పొందగలరు.వ్యవహారాల్లో ఆలోచనలు స్పష్టత లేక ఇబ్బందులకు గురి అవుతారు.ప్రయత్న కార్యంలో ఆటంకాలు ఎదురవుతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు వలన బాధపడతారు.ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు కలిసి వస్తాయి.అనుకోని ప్రయాణం చేయవలసి ఉంటుంది.ఖర్చులు యందు ఆచితూచి వ్యవహరించాలి.వ్యవహారాల్లో పరాక్రమం చూపిస్తారు. బంధుమిత్రులు సహాయ సహకారాలు అధిష్టాయి.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.

మే
అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నూతన అవకాశాలను పొందగలరు.ఖర్చులకు తగినట్లుగా ఆదాయం లభిస్తుంది. ఉద్యోగాలలో అనుకూలమైన వాతావరణం.మీ ఆలోచనలు నిర్ణయాలు తగిన గుర్తింపు లభిస్తుంది.అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తి చేస్తారు.కోర్టు వ్యవహారాలలో విజయం లభిస్తుంది.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. నూతన పరిచయాలు వలన లాభాలు పొందుతారు ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.


జూన్
మన సంకల్పం నెరవేరుతుంది.వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులు తో సంయమనం అవసరం.ప్రయత్న కార్యాలు పూర్తి అవ్వడం కోసం ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది.ముఖ్యమైన వస్తువులు తో జాగ్రత్త అవసరం.ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆదాయానికి మించి ఖర్చు చేయుదురు.సంతానం తో ప్రతికూలత.అకారణంగా బంధుమిత్రులతో విరోధాలు.ఊహించని సమస్యలు ఎదురవగలవు.

జూలై

కుటుంబ సభ్యులతో వ్యతిరేకత.మాట్లాడితే విరోధాలు రాగలవు.మానసిక ఆవేదన ఆందోళన పెరుగుతాయి.సమయం కానీ సమయంలో భోజనాలు చేయాల్సి వస్తుంది.తల పట్టిన పనులు ఆలస్యంగానైనా పూర్తి కాగలవు.ఉద్యోగాలలో అధికారులచే ఒత్తిడి పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.వాహనం గాని ఎలక్ట్రానిక్ వస్తువులు గాని కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి.ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం.భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి.

ఆగస్టు
ఈనెల అంతా ప్రతికూలంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.సమాజంలో వాద ప్రతివాదములు లందు జాగ్రత్తలు తీసుకోవాలి.కుటుంబంలో వివాహాలు శుభకార్యాలు జరుగుతాయి.దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకోని దుస్సంఘటన లు ఎదురవుతాయి.చేసే పనుల్లో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.మానసిక ఆందోళన పెరుగుతుంది.శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చెడు సావాసాలు కు దూరంగా ఉండాలి.

సెప్టెంబర్
ఈనెల చిన్నపాటి ప్రయోజనం పొందుతారు.మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేయవలసి వస్తుంది.ఉద్యోగాలలో అధికారులు తో మరియు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి.వృత్తి వ్యాపారాల్లో చిన్నపాటి ఇబ్బందులకు గురి అవుతారు.వాహనం నడిపేటప్పుడు లేదా యంత్రాల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి.ఆదాయానికి మంచి ప్రోత్సాహం కలుగుతుంది.తోబుట్టువులు వలన లాభాలు పొందగలరు.పిల్లల విషయంలో అభివృద్ధి కనబడుతుంది.


అక్టోబర్
చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తలపట్టుకున్న పనులు నత్తనడకన సాగుతాయి.కుటుంబంలో మీ మాటే పై చేయి గా ఉంటుంది. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని నింపుతుంది.ఓర్పు పట్టుదల తో అభివృద్ధి ఏర్పరచుకుంటారు.వచ్చే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.పనులలో ఆటంకాలు ఏర్పడిన ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు.వ్యవహారాల్లో కుటుంబ వ్యక్తుల సహకారం లభిస్తుంది.విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

నవంబర్
వాహన ప్రయాణాలు లో జాగ్రత్తలు తీసుకోవాలి.ఇంటా బయటా తగ్గి ఉండటం శ్రేయస్కరం.ఖర్చులు మితిమీరకుండా జాగ్రత్త అవసరం.ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి రుణాలు చేయవలసి వస్తుంది.యంత్రాల వాడుకలో  జాగ్రత్త అవసరం.విద్యార్థులు పట్టుదలతో  లక్ష్యాన్ని అందుకుచ్చుకునేలా చూసుకోవాలి.వ్యవహారాల్లో దూకుడుగా దురుసుగా ప్రవర్తించడం వలన పనులు మధ్యలో నిలిచిపోవడం జరుగుతుంది. భార్య భర్తల మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తుతాయి.నమ్మిన వారి వల్ల దగా పడుదురు.
 

Cancer Horoscope

డిసెంబర్
అనవసర విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి.శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.వృత్తి ఉద్యోగాలు లో అంకితభావం చూపించాలి.కుటుంబ వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి. అధికారులు మరియు పెద్దవారితో సంయమనంతో ఉండాలి.ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలను ఉత్తమంగా తప్పించుకోవడానికి ప్రయత్నించాలి . విద్యార్థులు ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి.చదువు విషయంలో మరింత కృషి శ్రద్ధ అవసరం.

జనవరి
వ్యవహారాల్లో ఆసక్తికరంగా వ్యవహరిస్తారు.చిన్నపాటి సుఖ సౌఖ్యాలు పొందుతారు. అనవసరమైన ఖర్చులు ఉన్నా అవి సంతృప్తికరంగా ఉంటాయి. ప్రయత్న కార్యంలో ఆటంకాలు ఏర్పడి చివరకు పూర్తి కాగలవు.విద్యార్థులు స్నేహ వర్గంతో జాగ్రత్తలు పాటించాలి. బంధువర్గంతో సహాయ సహకారములు పొందుతారు.అన్ని వ్యవహారాల్లో తగు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అనుకోకుండా కొన్ని సమస్యలలో చిక్కుకునే అవకాశం.ఊహించని పరిణామాలు అపవాదులు ఎదురవుతాయి.సోదరులతో విరోధాలు రాగలవు.

Cancer Horoscope


ఫిబ్రవరి
ఈనెల చిన్నపాటి ప్రయోజనం పొందగలరు.చేపట్టిన పనులు ఆలస్యంగానైనా పూర్తి చేసుకోగలరు.కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం శ్రేయస్కరం. మధ్యవర్తత్వ ములకు పెద్దమనిషి తరహా పాత్రలకు దూరంగా ఉండాలి.కుటుంబ వ్యక్తుల సహకారం లభిస్తుంది.నూతన అభివృద్ధి కార్యాలకు ప్రణాళికలు రచిస్తారు. ఆరోగ్య ఇబ్బందులు తప్పకపోవచ్చు.అనుకోని ఊహించని పరిణామాలు ఆందోళన కలిగిస్తాయి.స్థాన మార్పులు లేదా గృహ మార్పులు జరగలవు. వివాహాది శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. దూరపు బంధువులు తో కలిసి ఆనందంగా గడుపుతారు.

మార్చి
ప్రయత్నించిన కార్యాలలో నిరాశ నిస్పృహలకు గురవుతారు. కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి.వివాహ ప్రయత్నాలు లో కొందరికి నిశ్చితార్థం అవ్వగలవు. కొద్దిపాటి రుణము తీర్చగలరు.ఉద్యోగాలలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఆర్థిక లావాదేవీల సంతృప్తికరంగా ఉంటాయి.గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. సమాజంలో పెద్దవారిని కలుసుకుంటారు.దూరపు ప్రయాణాలు వలన లాభాలు పొందుతారు.సంతాన సౌఖ్యం లభిస్తుంది.ప్రభుత్వ పరంగా మద్దతు గుర్తింపు కలిసి వస్తాయి.


 జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
   

Latest Videos

click me!