జూన్ 2023 మాస ఫలాలు...ఓ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం

First Published Jun 1, 2023, 10:09 AM IST

జూన్ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ నెల  ఉద్యోగమునందు అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును.

Monthly Horoscope June 2023

(మాసఫలాలు - శ్రావణమాసం01, జూన్ 2023 నుండి 31 జూన్ 2023)
 
 
 గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలు అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పినవి మాత్రమే. మీకు పూర్తి స్దాయి ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది,సమయం తీసుకుని జాతక చక్రం వేయించుకోండి.సమస్యలు ఉంటే రెమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి. చక్కటి తరుణోపాయలతో శుభ ఫలితాలను పొందగలరు. 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర

పంచమాధిపతి అయిన రవి :-16-6-23 వరకు ధనస్థానమైన వృషభరాశి యందు సంచరించి తదుపరి తృతీయ స్థానము నందు సంచరించును. ఈ సంచారము వలన చేయు వ్యవహారమనందు అనవసరమైన మూర్ఖపుపట్టుదల వదలవలెను. బందోవర్గంతోటి భిన్నాభిప్రాయాలు ఏర్పడగలవు. ఉద్యోగమునందు అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును.

జన్మ  అష్టమాధితిస్తమాధిపతి అయిన కుజుడు :-ఈ మాసం అంతా చతుర్ద స్థానము నందు సంచరించును. ఈ సంచారం వలన బందు వర్గముతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. అనారోగ్య సమస్యలు రాగలవు. కుటుంబవనందు ప్రతికూలత వాతావరణం.

తృతీయ షష్టమాధిపతి అయిన బుధుడు:-7-6-23 వరకు జన్మరాశిలో సంచరించి తదుపరి ధనస్థానంలో సంచరించును. దుష్ట సవాసాలకు దూరంగా ఉండవలెను. ఇతరులతోటి అకారణంగా తగాదాలు విరోధాలు ఏర్పడగలవు. వ్యాపారం నందు పెట్టుబడులు ఆలోచించి నిర్ణయం తీసుకొనవలెను. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.

ద్వితీయ సప్తమాధిపతి ఆయన శుక్రుడు:-ఈమాసమంతా చతుర్ధ స్థానము నందు సంచరించును. ఈ సంచారం వలన అభివృద్ధి కార్యక్రమాలకు బంధుమిత్రుల తోటి అనుకూలమైన చర్చలు జరుపుతారు. ఉద్యోగమునందు అధికార ప్రతి కలుగును. కుటుంబ సభ్యులతో కలిసి  వినోదయాత్రలు చేస్తారు
ఈ మాసం అన్ని విధాలుగా కలిసి వచ్చును. మీ ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. దూరపు ప్రయాణాలు లభిస్తాయి. గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఆరోగ్యం కుదుటపడి ప్రశాంతత లభిస్తుంది. గృహవనందు శుభ కార్యక్రమాలు జరుగును. తలపెట్టిన పనులు తగిన సమయానికి పూర్తి చేస్తారు.

ఈ మాసం అశ్విని నక్షత్రం వారికి మాసాధిపతి  రవి    :-       భయాందోళన గా ఉంటుంది. ఈ మాసం సూర్యారాధన లేక మరియు ఆదిత్య హృదయము పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.
ఈ మాసం భరణి నక్షత్రం వారికి మాసాధిపతి  రాహువు    :-  వ్యాపారం ముందు ధన నష్టం. వస్తువు యందు జాగ్రత్త. ఈ మాసం దుర్గారాధన లేదా దుర్గా స్తోత్రం పారాయణ చేయండి

ఈ మాసం కృత్తిక  నక్షత్రం వారికి మాసాధిపతి  కేతువు   :-    అకారణ కలహాలు.అధికారులతోటి సమస్యలు. మనస్పర్ధలు. ఈ మాసంగణపతి అర్చన లేదా గణపతి స్తోత్రం పారాయణ చేయండి .
 

telugu astrology

వృషభం:- (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర

చతుర్ధాదిపతి అయిన రవి 16-6-23 వరకు జన్మరాశిలో సంచరించి తదుపరి ధన స్థానములో సంచరించును. ఈ సంచారం వలన శారీరక శ్రమ పెరుగుతుంది. మనసు నందు పరి విధాల ఆలోచనలతోటి ఉండును. బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. వాహన వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు  పనులలో ఆటంకాలు ఎదురవుతాయి.

సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు ఈ మాసం అంతా తృతీయ స్థానము నందు సంచరించును. ఈ సంచారం వలన తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అప్రయత్నంగా ధనలాభం కలుగును. ఉద్యోగము నందు అధికార వృద్ధి కలుగును.

ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు7-6-23 వరకు వ్యయస్థానం నందు సంచరించి తదుపరి జన్మరాశి యందు సంచరించును. ఈ సంచారం వలన భార్య భర్తల మధ్య అవగాహన తగ్గి మనస్పర్ధలు రాగలవు. వ్యాపారం నందు జాగ్రత్త అవసరము. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం ఏర్పడగలదు.

జన్మ షష్టమాధిపతి అయిన శుక్రుడు ఈమాసం అంతా తృతీయ స్థానము నందు సంచరించును. ఈ సంచారం వలన వ్యతిరేకత ఫలితాలు ఏర్పడగలవు. శత్రువుల వలన అపకారం జరగవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. శారీరక శ్రమ పెరుగుతుంది.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. సంతానము అభివృద్ధి ఉన్నత విద్యా అవకాశాలు  రావచ్చును. అభివృద్ధి కార్యక్రమాలలోఅన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త ఆలోచనలు ఆచరణలో పెడతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆదాయ మార్గాలు బాగుంటాయి. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.

ఈ మాసం కృత్తిక   నక్షత్రం వారికి మాసాధిపతి  కేతువు     :-   అకారణ కలహాలు.అధికారులతోటి సమస్యలు. మనస్పర్ధలు. ఈ మాసంగణపతి అర్చన లేదా గణపతి స్తోత్రం పారాయణ చేయండి .     


ఈ మాసం రోహిణి    నక్షత్రం వారికి మాసాధిపతి  శని      :-       నిరోత్సాహం.కలహాలకు దూరంగా ఉండడం. శని స్తోత్రం లేక ఆంజనేయ స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

ఈ మాసం మృగశిర   నక్షత్రం వారికి మాసాధిపతి  కుజుడు    ప్రయాణాలుయందు జాగ్రత్త.ఈ మాసం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన లేదా స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారములు॥ ఋధ -శుక్ర

తృతీయ అధిపతి అయిన రవి16-6-23 వరకుస్తానమునందు సంచరించి తదుపరి జన్మరాశులు సంచారం సంచరించడం ఈ సంచారం వలన స్థాన చలనం  అనారోగ్య సమస్యలు రాగలవు. ఆ కారణంగా మిత్రులతోటి విరోధాలు కలహాలు రావొచ్చు. ఉద్యోగమునందు అధికారులతోటి అకారణంగా కలహాలు ఏర్పడును. ఇంట బయట ప్రతికూలతగా వాతావరణం. మనసునందు ఆందోళనగా ఉండుట.

సప్తమ లాభాధిపతి అయిన కుజుడు ఈ మాసమంతా ధనస్థానమునందు సంచారం ఈసంచారం వలన తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. శారీరక శ్రమ పెరిగి శారీరక మానసిక బలహీనత ఏర్పడుతుంది. అనవసరమైన ఖర్చులు పెరుగును. ఉద్యోగమనందు పై అధికారులతోటి సమస్యలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారంలో సామాన్యంగా నుండును. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు ఏర్పడను.

జన్మ చతుర్థాధిపతి అయిన బుధుడు7-6-23 వరకు లాభ స్థానం నందు సంచరించి తదుపరి వ్యయస్థానం నందు సంచరించడం వలన ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. సమాజం నందు కీర్తి ప్రతిష్టల పెరుగును. సంతాన వృద్ధి ఆనందం కలిగించును. ఇతరులతోటి ఆ కారణంగా కలహాలు ఏర్పడగలవు. కుటుంబమునందు కుటుంబ సభ్యులతోటి ప్రతికూలత వాతావరణం.

వ్యయ పంచమాధిపతి అయిన శుక్రుడు ఈ మాసమంతా ధనస్థానమునందు సంచారం.   ఈ సంచారం వలన కుటుంబ అభివృద్ధి కనబడుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వస్త్రములు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం లభించును.

శుభవార్తలు వింటారు.సమాజం నందు ప్రతిభగు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయత్నించిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈ మాసం విలాసవంతంగా గడుపుతారు. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది.

ఈ మాసం మృగశిర   నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు :-      ప్రయాణాలుయందు జాగ్రత్త.ఈ మాసం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన లేదా స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి  

ఈ మాసం ఆరుద్ర   నక్షత్రం వారికి మాసాధిపతి  బుధుడు    బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. పనులలో విజయం సాధిస్తారు.

ఈ మాసం పునర్వసు    నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు  ఉద్యోగము నందు ఉన్నత స్థితి. ఈ మాసం రుద్రార్చన లేక శివ స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ

ద్వితీయాధిపతి అయిన రవి 16-6-23 వరకు లాభ స్థానం నందు సంచరించి తదుపరి వ్యయ స్థానము నందు సంచరించును.
పంచమ రాజ్యాధిపతి అయిన కుజుడు ఈ మాసమంతా జన్మరాశిలో సంచరించును.
వ్యయ తృతీయ అధిపతి అయిన బుధుడు7-6-23 భాగ్యస్థానమునందు సంచరించి తదుపరి రాజ్యస్థానము నందు సంచరించును
లాభ చతుర్ధాధిపతి అయిన శుక్రుడు ఈ మాసమంతా జన్మ రాశి లో సంచరించును. ఈ  గ్రహ సంచారం వలన
ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులతోటి విరోధాలకు కలహాలకు దూరంగా ఉండడం మంచిది. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి తోటి మరియు బంధు వర్గం తోటి విరోధాలు రావచ్చు. తలపెట్టిన పనులలో ప్రతిభందకాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయ.
మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.
శుక్రుడు జన్మ రాశి సంచార వలన పనులలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

ఈ మాసం  పునర్వసు  నక్షత్రం వారికి మాసాధిపతి  గురుడు      ఉద్యోగము నందు ఉన్నత స్థితి. ఈ మాసం రుద్రార్చన లేక శివ స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.
  

ఈ మాసం  పుష్యమి  నక్షత్రం వారికి మాసాధిపతి  చంద్రుడు   నూతన కార్యాలకు శ్రీకారం. ఈ మాసం దుర్గారాధనలేక దుర్గా స్తోత్రం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి.

ఈ మాసం  ఆశ్రేష  నక్షత్రం వారికి మాసాధిపతి  శుక్రుడు  :-      వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. శుభవార్తలు వింటారు. ఈ మాసం మహాలక్ష్మి స్తోత్రం పారాయణ చేయండి .

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ

జన్మరాశ్యాధిపతి అయిన రవి 16-6-23 వరకు రాజ్యస్థానం సంచారించి తదుపరి లాభ స్థానం నందు సంచరించును.

చతుర్ధ నవమాధిపతి అయిన కుజుడు ఈ మాసము అంత వ్యయ స్థానము నందు సంచరించును

వ్యయ తృతీయాధిపతి అయిన బుధుడు7-6-723 వరకు భాగ్యస్థానం నందు సంచరించి తదుపరి రాజ్యస్థానము నందు సంచరించును.
లాభ చతుర్ధాధిపతి అయిన శుక్రుడు ఈ మాసము అంత వ్యయస్థానమునందు సంచరించును. ఈ గ్రహ సంచారం వలన ప్రభుత్వ సంబంధించిన అన్ని పనులు పూర్తగును. ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రులతో సత్కాలక్షేపం చేస్తారు. ఉద్యోగమనందు అధికారుల యొక్క ఆదర అభిమానాలు పొందగలరు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. సమాజము నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. వివాహ శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు

ఈ మాసం  మఘ నక్షత్రం వారికి మాసాధిపతి రవి     భయాందోళన గా ఉంటుంది. ఈ మాసం సూర్యారాధన లేక మరియు ఆదిత్య హృదయము పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.
    

ఈ మాసం పుబ్బ  నక్షత్రం వారికి మాసాధిపతి  రాహువు   :-     వ్యాపారం ముందు ధన నష్టం. వస్తువు యందు జాగ్రత్త. ఈ మాసం దుర్గారాధన లేదా దుర్గా స్తోత్రం పారాయణ చేయండి

ఈ మాసం ఉత్తర   నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు      :-     అకారణ కలహాలు.అధికారులతోటి సమస్యలు. మనస్పర్ధలు. ఈ మాసంగణపతి అర్చన లేదా గణపతి స్తోత్రం పారాయణ చేయండి .
 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం

వ్యయాధిపతి అయిన రవి 16-6-23 వరకు భాగ్యస్థానం నందు సంచరించి తదుపరి రాజ్య స్థానం నందు సంచరించును.

తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు లాభ స్థానము నందు సంచరించును

దశమ జన్మరాశ్యాధిపతి అయిన బుధుడు7-6-23వరకు అష్టమ స్థానం నందు సంచరించి తదుపరి భాగ్యస్థానం నందు సంచరించును

నవమ ద్వితీయాధిపతి అయిన శుక్రుడు ఈ మాసము అంత లాభ స్థానం నందు సంచరించెను. ఈ గ్రహ సంచారం వలన
చేయ వ్యవహారంలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. వృత్తివ్యాపారములు సామాన్యంగా ఉంటాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడగలరు. ఉద్యోగమనందు అనుకూలమైన అధికార వృద్ధి కలుగుతుంది. ఆదాయ మార్గాలు బాగుంటాయి. కీలకమైన సమస్యలు పరిష్కారాలు లభిస్తాయి. కుటుంబం నందు సంతోషకరమైన వాతావరణ ఏర్పడుతుంది.

ఈ మాసం ఉత్తర   నక్షత్రం వారికి మాసాధిపతి  కేతువు  :-    అకారణ కలహాలు.అధికారులతోటి సమస్యలు. మనస్పర్ధలు. ఈ మాసంగణపతి అర్చన లేదా గణపతి స్తోత్రం పారాయణ చేయండి .


ఈ మాసం  హస్త  నక్షత్రం వారికి మాసాధిపతి  శని     :-       నిరోత్సాహం.కలహాలకు దూరంగా ఉండడం. శని స్తోత్రం లేక ఆంజనేయ స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

ఈ మాసం చిత్త   నక్షత్రం వారికి మాసాధిపతి  కుజుడు    ప్రయాణాలుయందు జాగ్రత్త.ఈ మాసం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన లేదా స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర

లాభాధిపతి అయిన రవి16-6-23 వరకు అష్టమ స్థానం నందు సంచరించి తదుపరి భాగ్యస్థానం నందు సంచరించును

ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు ఈ మాసమంతా భాగ్యస్థానం నందు సంజరించును.

వ్యయ నవమాధిపతి అయిన బుధుడు7-6-23 వరకు కళత్ర స్థానము నందు సంచరించి తదుపరి అష్టమ స్థానము నందు సంచరించును.
అష్ఠమ జన్మరాశ్యాధిపతి అయిన శుక్రుడు ఈ మాసము అంత భాగ్యస్థానం నందు సంచరించును. ఈ గ్రహ సంచారము వలన ఇతరులతోటి వాదాలకు దూరంగా ఉండవలెను. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించాలి. ప్రయాణాల యందు అవరోధాలు ఏర్పడతాయి. ఉద్యోగమునందు అధికారుల వలన సమస్యలు ఏర్పడవచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఋణము చేయవలసి వస్తుంది.


ఈ మాసం చిత్త   నక్షత్రం వారికి మాసాధిపతి అయిన      కుజుడు  ప్రయాణాలుయందు జాగ్రత్త.ఈ మాసం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన లేదా స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి

ఈ మాసం స్వాతి    నక్షత్రం వారికి మాసాధిపతి అయిన    బుధుడు    బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. పనులలో విజయం సాధిస్తారు.

ఈ మాసం  విశాఖ  నక్షత్రం వారికి మాసాధిపతి అయిన  గురుడు        ఉద్యోగము నందు ఉన్నత స్థితి. ఈ మాసం రుద్రార్చన లేక శివ స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ-గురు -శుక్ర


రాజ్యాధిపతి అయిన రవి16-6-23 వరకు కళాత్ర స్థానము నందు సంచరించి తదుపరి ఆయుః స్థానము నందు సంచరించును.

జన్మ షష్టమాధిపతి అయిన కుజుడు ఈ మాసము అంత భాగ్యస్థానం నందు సంచారము.

లాభ అష్టమాధిపతి అయిన బుధుడు7-6-23 వరకు శత్రు స్థానము నందు సంచరించి తదుపరి కళాత్రస్థానం నందు సంచరించును.

సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ఈ మాసము అంతా భాగ్యస్థానమునందు సంచారము. ఈ గ్రహ సంచారము వలన జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు విరోధాలు రావచ్చు. పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసర ప్రయాణాలు  ఆందోళన కలిగిస్తాయి. సమాజం నందు అపకీర్తి ఏర్పడగలదు. కొద్దిపాటి ఉదర సంబంధ వ్యాధులు వస్తాయి. శారీరక శ్రమ పెరిగి తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ఈ మాసం విశాఖ   నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు    ఉద్యోగము నందు ఉన్నత స్థితి. ఈ మాసం రుద్రార్చన లేక శివ స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

ఈ మాసం అనూరాధ   నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు   నూతన కార్యాలకు శ్రీకారం. ఈ మాసం దుర్గారాధనలేక దుర్గా స్తోత్రం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి.

ఈ మాసం  జ్యేష్ట  నక్షత్రం వారికి మాసాధిపతి  శుక్రుడు   :-    వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. శుభవార్తలు వింటారు. ఈ మాసం మహాలక్ష్మి స్తోత్రం పారాయణ చేయండి .
 

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళవారం

నవమాధిపతి అయిన రవి 16-6-23 వరకు శత్రు స్థానము నందు సంచరించి తదుపరి కళత్రస్థానం నందు సంచరించును

వ్యయ పంచమాధిపతి అయిన కుజుడు ఏ మాసము అంతా అష్టమ స్థానము నందు సంచారము.

రాజ్య సప్తమాధిపతి ఆయన బుధుడు7-6-23 వరకు పంచమస్థానం నందు సంచరించి తదుపరి శత్రు స్థానము నందు సంచరించును

షష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు ఈ మాసము అంత అష్టమ స్థానము అయిన ఆయుః స్థానమునందు సంచరించును. ఈ గ్రహ సంచారం వలన  శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తగును. వృత్తి వ్యాపారములు రాణిస్తాయి. కొద్దిపాటి రుణ బాధలు పెరుగును. సమాజము నందుఅవమానములు రావచ్చు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరము. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి.

ఈ మాసం మూల   నక్షత్రం వారికి మాసాధిపతి  రవి     భయాందోళన గా ఉంటుంది. ఈ మాసం సూర్యారాధన లేక మరియు ఆదిత్య హృదయము పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.


ఈ మాసం పూ.షా  నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు      :-   వ్యాపారం ముందు ధన నష్టం. వస్తువు యందు జాగ్రత్త. ఈ మాసం దుర్గారాధన లేదా దుర్గా స్తోత్రం పారాయణ చేయండి

ఈ మాసం  ఉ.షా నక్షత్రం వారికి మాసాధిపతి  కేతువు       :-      అకారణ కలహాలు.అధికారులతోటి సమస్యలు. మనస్పర్ధలు. ఈ మాసంగణపతి అర్చన లేదా గణపతి స్తోత్రం పారాయణ చేయండి .
 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారములు॥ ఆది -సోమ- శని

అష్టమాధిపతి అయిన రవి16-6-23 వరకు పంచమస్థానం నందు సంచరించి తదుపరి శత్రు స్థానమునందు సంచారము.

లాభ చతుర్ధాధిపతి అయిన కుజుడు ఈ మాసము అంతా కళత్ర స్థానము నందు సంచారము.

నవమ షష్ఠమాధిపతి అయిన బుధుడు7-6-23 వరకు చతురద స్థానము నందు సంచరించి తదుపరి పంచమ స్థానం నందు సంచరించును.

పంచమ రాజ్యాధిపతి అయిన శుక్రుడు ఈ మాసం అంతా కలత్రస్థానం నందు సంచరించును. ఈ గ్రహ సంచారం వలన
ఆదాయ మార్గాలు బాగున్నాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సమాజం నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. చేయు వ్యవహారము నందు అన్నదమ్ముల మిత్రుల  సహాయ సహకారాలు లభిస్తాయి.

ఈ మాసం ఉ.షా  నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు  :-   అకారణ కలహాలు.అధికారులతోటి సమస్యలు. మనస్పర్ధలు. ఈ మాసంగణపతి అర్చన లేదా గణపతి స్తోత్రం పారాయణ చేయండి .

ఈ మాసం  శ్రవణం నక్షత్రం వారికి మాసాధిపతి శని    :-       వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. శుభవార్తలు వింటారు. ఈ మాసం మహాలక్ష్మి స్తోత్రం పారాయణ చేయండి .
ఈ మాసం ధనిష్ఠ  నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు    ప్రయాణాలుయందు జాగ్రత్త.ఈ మాసం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన లేదా స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి
 

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ

సప్తమాధిపతి అయిన రవి16-6-23 వరకు చతుర్ధస్థానం నందు సంచరించి తదుపరి పంచమస్థానం నందు సంచరించును.

రాజ్య తృతీయాధిపతి అయిన కుజుడు ఈ మాసము అంత శత్రు స్థానము నందు సంచరించును.

అష్టమ పంచమాధిపతి అయిన బుధుడు7-6-23 వరకు తృతీయ స్థానం నందు సంచరించి తదుపరి చతుర్ద స్థానం నందు సంచరించును

చతుర్ధ నవమాధిపతి అయిన శుక్రుడు ఈ మాసము అంత శత్రు స్థానము నందు సంచరించెను. ఈ గ్రహ సంచారం వలన
బంధు వర్గం తోటి సహాయ సహకారాలు లభిస్తాయి. చేయ పనులలో బుద్ధి కుశలత ఏర్పడి  పనులన్నీ సకాలంలో పూర్తగును. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదయాత్రలో చేస్తారు. ఉద్యోగమునందు అనుకూలమైన అధికార వృద్ధి కలుగును. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ప్రతి సమస్యను  పరిష్కరించి కోని ముందుకు సాగుతారు.

ఈ మాసం ధనిష్ఠ   నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు   :-       ప్రయాణాలుయందు జాగ్రత్త.ఈ మాసం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన లేదా స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి 

ఈ మాసం శతభిషం నక్షత్రం వారికి మాసాధిపతి  బుధుడు   బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. పనులలో విజయం సాధిస్తారు.

ఈ మాసం పూ.భా   నక్షత్రం వారికి మాసాధిపతి  గురుడు  ఉద్యోగము నందు ఉన్నత స్థితి. ఈ మాసం రుద్రార్చన లేక శివ స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ

షష్టమాధిపతి అయిన రవి16-6-23 వరకు తృతీయ స్థానమునందు సంచరించి తదుపరి చతుర్ధ స్థానము నందు సంచరించెను.

నవమ ద్వితీయాధిపతి అయిన కుజుడు ఈ మాసము అంతా పంచమ స్థానం నందు సంచరించెను.

సప్తమ చతుర్ధాధిపతి అయిన బుధుడు7-6-23 వరకు తృతీయ స్థానము నందు సంచరించి తదుపరి చతుర్ధ స్థానమునందు సంచారము.

తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు ఈ మాసం వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. శుభవార్తలు వింటారు. ఈ మాసం మహాలక్ష్మి స్తోత్రం పారాయణ చేయండి .

ఈ మాసం పూ.భా  నక్షత్రం వారికి మాసాధిపతి  గురుడు  ఉద్యోగము నందు ఉన్నత స్థితి. ఈ మాసం రుద్రార్చన లేక శివ స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

ఈ మాసం   ఉ.భా  నక్షత్రం వారికి మాసాధిపతి  చంద్రుడు    నూతన కార్యాలకు శ్రీకారం. ఈ మాసం దుర్గారాధనలేక దుర్గా స్తోత్రం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి.


ఈ మాసం రేవతి   నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు     :-   వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. శుభవార్తలు వింటారు. ఈ మాసం మహాలక్ష్మి స్తోత్రం పారాయణ చేయండి .

వృత్తి వ్యాపారాలు అనుకూలించను. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సజావుగా సాగును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరికి పూర్తి చేస్తారు. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. విద్యార్థులకు ఉత్సాహకరంగానుండను. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండవలెను. చిన్నపాటి సమస్యలు ఏర్పడగలవు.

click me!