మాస ఫలాలు: ఓ రాశి వారికి ఊహించని అదృష్టం..ధనార్జన

First Published | Jul 1, 2023, 10:00 AM IST

ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెల వృత్తి వ్యాపారము నందు ధన నష్టం. అధికారులతోటి అకారణ కలహాలు ఏర్పడగలవు.

మాసఫలాలు:  01 జూలై  2023 నుండి 31 జూలై  2023 వరకూ
  
 
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ మాసం రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనుభవంలోకి వస్తాయి.

 
ఈనెల 1-7-2023  మరియు 15-7-2023 శని త్రయోదశి కావున(కర్కాటక వృశ్చిక మకర కుంభ మీన రాశులవారు) ఈ రోజున శనికి తైలాభిషేకం తిలదానము చేయండి.


శ్లో॥ కోణస్థ పింగళో బభ్రు కృష్ణో  రౌద్రాంతకోయమః ।
సౌరి శనైశ్చరో మందః పిప్పలాదిషు సంస్థితః॥  ఈ  శ్లోకమను  21 సార్లు జపించండి లేదా శని స్తోత్రం లేదా అష్టోత్రము గాని పారాయణ చేయండి.
 

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర

పంచమాధిపతి అయిన రవి :-తృతీయ స్థానము నందు సంచారము. బంధుమిత్రుల తోటి సత్కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ పరమైన అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. మానసికంగా ఉల్లాసంగా ఆనందంగా గడుపుతారు.

జన్మ  అష్టమాధితిస్తమాధిపతి అయిన కుజుడు :-పంచమ స్థానం నందు సంచారము. సంతానం తోటి అకారణ విరోధాలు ఏర్పడగలవు. పాప కర్మ నందు ఆసక్తి పెరుగును. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. అనవసరమైన ఖర్చులు .

తృతీయ షష్టమాధిపతి అయిన బుధుడు:-తృతీయ స్థానం నందు సంచారం. వృత్తి వ్యాపారము నందు ధన నష్టం. అధికారులతోటి అకారణ కలహాలు ఏర్పడగలవు.

ద్వితీయ సప్తమాధిపతి ఆయన శుక్రుడు:-చతుర్ధ స్థానమునందు సంచారము. విందు వినోదాలలో పాల్గొంటారు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారుఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులు అనుకనట్లుగా సాధిస్తారు. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. సమాజం నందు మీ మాటకు విలువ పెరుగుతుంది. ధర్మకార్యాలు ఆచరిస్తారు.
ఈ మాసం అశ్విని నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు  :- నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.బంధుమిత్రులతో  ఆనందంగా గడుపుతారు. దుర్గా స్తోత్రం పారాయణం చేయండి.

ఈ మాసం భరణి నక్షత్రం వారికి మాసాధిపతి  శుక్రుడు    :-  వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. శుభవార్తలు వింటారు. ఈ మాసం మహాలక్ష్మి స్తోత్రం పారాయణ చేయండి .

ఈ మాసం కృత్తిక  నక్షత్రం వారికి మాసాధిపతి   రవి     :- ఉద్యోగం నందు అధికారులతోటి వివాదాలు రాగలవు.. ఈ మాసం ఆదిత్య హృదయము పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.       


telugu astrology

వృషభం:- (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర

చతుర్ధాదిపతి అయిన రవి ధనస్థానము నందు సంచారము. మిత్రులు శత్రువులు అగుదురు. బందోవర్గముతోటి భిన్నాభిప్రాయాలు ఏర్పడగలవు. మానసికంగా భయంగానుండను.

సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు చతుర్ద స్థానమునందు సంచారము. అనారోగ్య సమస్యలు ఏర్పడగలవు. కుటుంబవనందు ప్రతికూలత వాతావరణం. అనేక ఆలోచనలతోటి చిరాకుగా నుండును.చతుర్ద స్థానమునందు సంచారము. అనారోగ్య సమస్యలు ఏర్పడగలవు. కుటుంబవనందు ప్రతికూలత వాతావరణం. అనేక ఆలోచనలతోటి చిరాకుగా నుండును.

ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు ధనస్థానము నందు సంచారము ఆకస్మిక ధన లాభం కలుగును. గృహ నిర్మాణ పనులు కలిసి వచ్చును. వాహనాది కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనులు పూర్తి అవుతాయి.

జన్మ షష్టమాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానము నందు సంచారము. అనవసరమైన ఖర్చులు. శత్రువృద్ది. కొద్దిపాటి వ్యాపారం నందు ధన నష్టం ఏర్పడగలవు.ఆర్థికంగా లాభ పడతారు.భూ గృహ నిర్మాణ పనులు పూర్తి చేస్తారు.విద్యార్థులకు అనుకూలం . కుటుంబ  సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తు వాహనాలకు కొనుగోలు చేస్తారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును.

ఈ మాసం కృత్తిక   నక్షత్రం వారికి మాసాధిపతి   రవి     :- ఉద్యోగం నందు అధికారులతోటి వివాదాలు రాగలవు.. ఈ మాసం ఆదిత్య హృదయము పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.  

ఈ మాసం రోహిణి    నక్షత్రం వారికి మాసాధిపతి రాహు      :- పనులలో ఆటంకాలు. అవమానం.వ్యాపారం ముందు ధన నష్టం. వస్తువు యందు జాగ్రత్త. దుర్గా స్తోత్రం పారాయణ చేయండి  

ఈ మాసం మృగశిర   నక్షత్రం వారికి మాసాధిపతి   కేతువు     :-  పనులలో అలసత్వం.అకారణ కలహాలు.అధికారులతోటి సమస్యలు. మనస్పర్ధలు.  గణపతి స్తోత్రం పారాయణ చేయండి .
 

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారములు॥ ఋధ -శుక్ర

తృతీయ అధిపతి అయిన రవి జన్మరాశిలో సంచారము. శారీరక శ్రమ అధికంగా ఉండును. అనారోగ్య సమస్యలు ఏర్పడగలవు. బంధుమిత్రులతోటి అకారణ విరోధాలు.

సప్తమ లాభాధిపతి అయిన కుజుడు చతుర్ధ స్థానము నందు సంచారము. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. మిత్రులు వలన నష్టపోయే అవకాశం. స్థాన చలనము ఏర్పడగలదు.

జన్మ చతుర్థాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో సంచారము దుష్టసావాసాలు ఏర్పడగలవు. జాగ్రత్త వహించాలి. విలువైన వస్తువులు యందు జాగ్రత్త.  కలహాలుకు దూరంగా ఉండటం మంచిది.

వ్యయ పంచమాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానము నందు సంచారము. అనవసరమైన ఖర్చులు పెరుగును. సంతానంతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు.బంధుమిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. సంతాన అభివృద్ధి ఆనందం కలగజేస్తుంది.  ఊహించని అదృష్టం..ధనార్జన,వివాహ నిర్ఛయం   ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి ‌. ఆర్థికంగా అన్న విధాలా బాగుంటుంది. వృత్తి వ్యాపారం నందు లాభాలు పొందగలరు. సమాజం నందు మీ మాటకు విలువ పెరుగుతుంది.

ఈ మాసం మృగశిర   నక్షత్రం వారికి మాసాధిపతి   కేతు     :-  పనులలో ఆటంకాలు. వ్యాపార ధన నష్టం.ఈ మాసం సుబ్రహ్మణ్యేశ్వర  స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి

ఈ మాసం ఆరుద్ర   నక్షత్రం వారికి మాసాధిపతి  శని    :- వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. శుభవార్తలు వింటారు. ఈ మాసం మహాలక్ష్మి స్తోత్రం పారాయణ చేయండి .  

ఈ మాసం పునర్వసు    నక్షత్రం వారికి మాసాధిపతి కుజ  :-  పనులలో ఆటంకాలు. వ్యాపార ధన నష్టం.ఈ మాసం సుబ్రహ్మణ్యేశ్వర  స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ

ద్వితీయాధిపతి అయిన రవి వ్యయ స్థానమునందు సంచారము. ఉద్యోగం నందు అధికారులతోటి కలహాలు. స్థాన చలనము. ఆర్థిక ఇబ్బందులు కలగ గలవు.


పంచమ రాజ్యాధిపతి అయిన కుజుడు ధనస్థానము నందు సంచారము. ఈ సంచారము అనుకూలమైనది కాదు. శారీరక మానసిక బలహీనముగా ఉండును. పుత్రుల వలన మన స్థాపం. ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు.

వ్యయ తృతీయ అధిపతి అయిన బుధుడు వ్యయ స్థానమునందు సంచారము. ఇతరులతోటి అకారణ కలహాలు ఏర్పడగలవు. మనసునందు భయాందోళనగా ఉండును. శత్రువృద్ది.

లాభ చతుర్ధాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో సంచారము. ప్రయత్నించిన కార్యాలు సఫలం అగును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.ప్రయత్న కార్యాలు సఫలీకృతం అవుతాయి. వృత్తి వ్యాపారం నందు లాభసాటిగా రాణిస్తాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగమనందు అధికార అభివృద్ధి కలుగుతుంది. కొద్దిపాటి కలహాలు రావచ్చు. రవి బుదుల సంచారం అంత అనుకూలంగా లేదు.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో రాణిస్తారు.

ఈ మాసం  పునర్వసు  నక్షత్రం వారికి మాసాధిపతి   కుజ  :- పనులలో ఆటంకాలు. వ్యాపార ధన నష్టం.ఈ మాసం సుబ్రహ్మణ్యేశ్వర  స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి 

ఈ మాసం  పుష్యమి  నక్షత్రం వారికి మాసాధిపతి బుధ   :-  వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును.పనులలో విజయం. విష్ణుసహస్రనామం పారాయణ చేయండి.శుభ ఫలితాలు పొందండి  

ఈ మాసం  ఆశ్రేష  నక్షత్రం వారికి మాసాధిపతి  గురు  :-  తలపెట్టిన పనులు పూర్తి అగును.ఉన్నత అధికారులతోపరిచయాలు.శివ స్తోత్రంపారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ

జన్మరాశ్యాధిపతి అయిన రవి లాభ స్థానము నందు సంచారము. అనేక విధాల లాభాలు సమకూరును. గృహమునందు శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.

చతుర్ధ నవమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో సంచారము. భార్య భర్తల మధ్య అవగాహన తగ్గి మనస్పర్ధలు రాగలవు. తలపెట్టిన పనులలో ఆటంకాలు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

వ్యయ తృతీయాధిపతి అయిన బుధుడు వ్యయ స్థానము నందు సంచారము. కుటుంబ సౌఖ్యం తగ్గును. ఇతరులతోటి అకారణం కలహాలు ఏర్పడగలవు.

లాభ చతుర్ధాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానమునందు సంచారము. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. అనవసరమైన ఖర్చులు.
ఈ మాసం అన్న విధాలా అనుకూలించును. వ్యాపారమునందు పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు పొందగలరు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కుజ సంచారం వలన అకారణ విరోధాలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామి తోటి గాని కుటుంబ సభ్యుల తోటి మధ్య మనస్పర్ధలు ఏర్పడవచ్చు.

ఈ మాసం  మఘ నక్షత్రం వారికి మాసాధిపతి  చంద్ర    :-  నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.బంధుమిత్రులతో  ఆనందంగా గడుపుతారు. దుర్గా స్తోత్రం పారాయణం చేయండి.

ఈ మాసం పుబ్బ  నక్షత్రం వారికి మాసాధిపతి శుక్ర   :- వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. శుభవార్తలు వింటారు. ఈ మాసం మహాలక్ష్మి స్తోత్రం పారాయణ చేయండి .    

ఈ మాసం ఉత్తర   నక్షత్రం వారికి మాసాధిపతి రవి   :- ఉద్యోగం నందు అధికారులతోటి వివాదాలు రాగలవు.. ఈ మాసం ఆదిత్య హృదయము పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.       

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం

వ్యయాధిపతి అయిన రవి రాజ్యస్థానము నందు సంచారము. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. ఉద్యోగ అభివృద్ధి. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.

తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానమునందు సంచారము. పొదుపు చేసిన ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. బంధు విరోధం. సమాజమునందు అపవాదములు ఏర్పడగలవు.

దశమ జన్మరాశ్యాధిపతి అయిన బుధుడు రాజ్య స్థానమునందు సంచారము. వాద ప్రతివాదములకు దూరంగా ఉండవలెను. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభించును.

నవమ ద్వితీయాధిపతి అయిన శుక్రుడు లాభ స్థానము నందు సంచారము. అనుకోని ఆకస్మిక ధన లాభం కలుగును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.
సమాజం నందు అపవాదములు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. బంధవర్గంతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. ఆదాయానికి మించి అనేక విధాలుగా ఖర్చు చేయవలసి వస్తుంది. వివాదాలకు కలహాలు దూరంగా ఉండండి. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఇబ్బందులు కలుగుతాయి
ఈ మాసం ఉత్తర   నక్షత్రం వారికి మాసాధిపతి రవి   :- ఉద్యోగం నందు అధికారులతోటి వివాదాలు రాగలవు.. ఈ మాసం ఆదిత్య హృదయము పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి. 

ఈ మాసం  హస్త  నక్షత్రం వారికి మాసాధిపతి రాహు    :- పనులలో ఆటంకాలు. అవమానం.వ్యాపారం ముందు ధన నష్టం. వస్తువు యందు జాగ్రత్త. దుర్గా స్తోత్రం పారాయణ చేయండి   

ఈ మాసం చిత్త   నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు  :- పనులలో అలసత్వం.అకారణ కలహాలు.అధికారులతోటి సమస్యలు. మనస్పర్ధలు.  గణపతి స్తోత్రం పారాయణ చేయండి .  

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర

లాభాధిపతి అయిన రవి భాగ్యస్థానమునందు సంచారము. అకారణ కలహాలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. మానసికంగా శారీరకంగా బలహీనత.

ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు లాభ స్థానమునందు సంచారము. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. వివాహ ప్రయత్నాలు ఫలించెను. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి.

వ్యయ నవమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానమునందు సంచారము. వచ్చిన అవకాశాలని చేజారుస్తారు. పనులలో ఆటంకాలు.

అష్ఠమ జన్మరాశ్యాధిపతి అయిన శుక్రుడు రాజ్యస్థానం నందు సంచారము. ఇతరుల యొక్క విషయాలకు దూరంగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రాగలవు.ఈనెల అన్ని విధాల యోగించును. ఆరోగ్య సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. ప్రయత్నించిన కార్యాలు ఫలిస్తాయి. ఇష్టమైన మరియు విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. కుటుంబవనందు ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

ఈ మాసం చిత్త   నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు  :- పనులలో అలసత్వం.అకారణ కలహాలు.అధికారులతోటి సమస్యలు. మనస్పర్ధలు.  గణపతి స్తోత్రం పారాయణ చేయండి . 

ఈ మాసం స్వాతి    నక్షత్రం వారికి మాసాధిపతి శని    :- వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. శుభవార్తలు వింటారు. ఈ మాసం మహాలక్ష్మి స్తోత్రం పారాయణ చేయండి .

ఈ మాసం  విశాఖ  నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు    :- పనులలో ఆటంకాలు. వ్యాపార ధన నష్టం.ఈ మాసం సుబ్రహ్మణ్యేశ్వర  స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి   

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ-గురు -శుక్ర


రాజ్యాధిపతి అయిన రవి అష్టమ స్థానము నందు సంచారము. ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి. వాగ్వాదాలకు దూరంగా ఉండవలెను. అధికారులతోటి సఖ్యతగా వ్యవహరించవలెను.

జన్మ షష్టమాధిపతి అయిన కుజుడు రాజ్యస్థానము నందు సంచారము. ఆరోగ్య సమస్యలు రాగలవు. విరోధాలు కలహాలకు దూరంగా ఉండవలెను. చేయ పనులలో శ్రమ అధికంగా నుండును.

లాభ అష్టమాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానం నందు సంచారము. మానసిక భయాందోళన ఏర్పడగలవు. సంతానము గూర్చి ఎదురుచూస్తున్న వారు శుభవార్త వింటారు. వ్యాపారులు లాభసాటిగా జరుగును.

సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానమునందు సంచారము. తలపెట్టిన పనులు పూర్తి అగును. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభించును. వివాహాది ప్రయత్నాలు ఫలించును.
ఈమాసం మిశ్రమంగా ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. సంతాన మూలక లాభాలు చేకూరుతాయి. ఉద్యోగమునందు అధికార అభివృద్ధి కలుగును. ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం పొందగలరు.

ఈ మాసం విశాఖ   నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు   :- పనులలో ఆటంకాలు. వ్యాపార ధన నష్టం.ఈ మాసం సుబ్రహ్మణ్యేశ్వర  స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి 

ఈ మాసం అనూరాధ   నక్షత్రం వారికి మాసాధిపతి  బుధుడు    :- వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును.పనులలో విజయం. విష్ణుసహస్రనామం పారాయణ చేయండి.శుభ ఫలితాలు పొందండి 

ఈ మాసం  జ్యేష్ట  నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు  :- తలపెట్టిన పనులు పూర్తి అగును.ఉన్నత అధికారులతోపరిచయాలు.శివ స్తోత్రంపారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళవారం

నవమాధిపతి అయిన రవి కళాత్రస్థానం నందు సంచారము. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు. అనవసరమైన ప్రయాణాలు ఏర్పడగలవు. మానసిక అశాంతి.

వ్యయ పంచమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానమునందు సంచారము. సమాజము నందు అపవాదములు రాగలవు. వ్యవహారములలో అకారణంగా ధన నష్టం రాగలదు. అనారోగ్య సమస్యలు.

రాజ్య సప్తమాధిపతి ఆయన బుధుడు కళత్ర స్థానమునందు సంచారము. అధికారులతోటి అకారణ కలహాలు. కుటుంబవనందు ప్రతికూలత వాతావరణం. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు.

షష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానము నందు సంచారము. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును. ఉద్యోగము నందు అధికారుల గౌరవ మర్యాదలు పొందగలరు. అన్ని విధాల అభివృద్ధి పొందగలరు.
శుక్ర గ్రహ సంచారం వలన బంధుమిత్రుల యొక్క కలయక. వృత్తి వ్యాపార ముందు ధన లాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆర్థికంగా అన్ని విధాలా బాగుంటుంది. చేయ పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కొద్దిపాటి ఖర్చులు పెరుగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

ఈ మాసం మూల   నక్షత్రం వారికి మాసాధిపతి    చంద్ర    :- నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.బంధుమిత్రులతో  ఆనందంగా గడుపుతారు. దుర్గా స్తోత్రం పారాయణం చేయండి.     

ఈ మాసం పూ.షా  నక్షత్రం వారికి మాసాధిపతి శుక్ర     :- వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. శుభవార్తలు వింటారు. ఈ మాసం మహాలక్ష్మి స్తోత్రం పారాయణ చేయండి .   

ఈ మాసం  ఉ.షా నక్షత్రం వారికి మాసాధిపతి రవి   :- ఉద్యోగం నందు అధికారులతోటి వివాదాలు రాగలవు.. ఈ మాసం ఆదిత్య హృదయము పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారములు॥ ఆది -సోమ- శని

అష్టమాధిపతి అయిన రవి శత్రుస్తానమునందు సంచారము. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శరీర సౌఖ్యం లభించును. కుటుంబ సౌఖ్యం పొందగలరు.

లాభ చతుర్ధాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానము నందు సంచారము. ఈ సంచారము అనుకూలమైనది కాదు. జాగ్రత్తలు తీసుకోవాలి. పొదుపు చేసిన ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్య సమస్యలు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము.

నవమ షష్ఠమాధిపతి అయిన బుధుడు శత్రు స్థానమునందు సంచారము. ధన ధాన్యాలు లాభాలు పొందగలరు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. సమాజమునందు గౌరవ మర్యాదలు పెరుగును.

పంచమ రాజ్యాధిపతి అయిన శుక్రుడు కళత్ర స్థానమునందు సంచారము. అకారణ కోపము. జీవిత భాగస్వామికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొనవలెను.
ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కొంత ఋణం చేయవలసి వస్తుంది. ప్రయత్నించిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారమునందు శారీరక శ్రమ పెరుగుతుంది. సమాజం నందు ప్రజాభిమానం పొందగలరు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవగలవు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరము. వచ్చిన అవకాశాలని చేజార్చగూడదు.

ఈ మాసం ఉ.షా  నక్షత్రం వారికి మాసాధిపతి రవి  :- ఉద్యోగం నందు అధికారులతోటి వివాదాలు రాగలవు.. ఈ మాసం ఆదిత్య హృదయము పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.     

ఈ మాసం  శ్రవణం నక్షత్రం వారికి మాసాధిపతి  రాహువు :- పనులలో ఆటంకాలు. అవమానం.వ్యాపారం ముందు ధన నష్టం. వస్తువు యందు జాగ్రత్త. దుర్గా స్తోత్రం పారాయణ చేయండి       

ఈ మాసం ధనిష్ఠ  నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు   :-  పనులలో అలసత్వం.అకారణ కలహాలు.అధికారులతోటి సమస్యలు. మనస్పర్ధలు.  గణపతి స్తోత్రం పారాయణ చేయండి .    

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ

సప్తమాధిపతి అయిన రవి పంచమస్థానమునందు సంచారము. మిత్రుల వలన అపకారము జరిగే అవకాశం. అనారోగ్య సమస్యలు రాగలవు. ఉద్యోగ సంబంధిత విషయాలలో ఆటంకాలు ఎదురవుతాయి.

రాజ్య తృతీయాధిపతి అయిన కుజుడు కళత్ర స్థానమునందు సంచారము. భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గును. ఉద్యోగము నందు అధికారులతోటి వివాదాలు రాగలవు.

అష్టమ పంచమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానం నందు సంచారము. ఇతరులతోటే కలహాలకు దూరంగా ఉండవలెను. వ్యవహారములలో అధిక శ్రమ. సమాజమునందు అపకీర్తి రాగలదు.

చతుర్ధ నవమాధిపతి అయిన శుక్రుడు శత్రుస్తానమునందు సంచారము. అనవసరమైన ఖర్చులు పెరుగును. వ్యవహారము నందు ఆటంకాలు ఏర్పడ గలవు. శత్రువృద్ది.
సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును. మనసునందు ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు యందు లాభం చేకూరుతుంది. చేయ వ్యవహారము నందు విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. గృహవనందు శుభకార్యా చరణ. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

ఈ మాసం ధనిష్ఠ   నక్షత్రం వారికి మాసాధిపతి  కేతువు  :- పనులలో అలసత్వం.అకారణ కలహాలు.అధికారులతోటి సమస్యలు. మనస్పర్ధలు.  గణపతి స్తోత్రం పారాయణ చేయండి .   

ఈ మాసం శతభిషం నక్షత్రం వారికి మాసాధిపతి  శని  :- వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. శుభవార్తలు వింటారు. ఈ మాసం మహాలక్ష్మి స్తోత్రం పారాయణ చేయండి .      

ఈ మాసం పూ.భా   నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు    :-  పనులలో ఆటంకాలు. వ్యాపార ధన నష్టం.ఈ మాసం సుబ్రహ్మణ్యేశ్వర  స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి     

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ

షష్టమాధిపతి అయిన రవి చతుర్థ స్థానమునందు సంచారము. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. కుటుంబం నందు చికాకులు. మానసిక ఆవేదన పెరుగును.

నవమ ద్వితీయాధిపతి అయిన కుజుడు శత్రు స్థానము నందు సంచారము. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

సప్తమ చతుర్ధాధిపతి అయిన బుధుడు చతుర్ధ స్థానమునందు సంచారము బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు. భూ గృహ క్రయ విక్రయములు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.

తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమస్థానమునందు సంచారము. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగును. మిత్రుల యొక్క ఆదర అభిమానాలు పొందగలరు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.
గృహం నందు శుభ కార్యాచరణ. ఆర్థికంగా బలపడతారు. చేయు వ్యవహారం నందు కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించవలెను. కొన్ని సంఘటనలు భయాందోళన కలిగించిను. బంధుమిత్రులతోటి విరోధాలు ఏర్పడగలవు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం. వృత్తి వ్యాపారములు అనుకూలంగా ఉండను.

ఈ మాసం పూ.భా  నక్షత్రం వారికి మాసాధిపతి   కుజుడు: పనులలో ఆటంకాలు. వ్యాపార ధన నష్టం.ఈ మాసం సుబ్రహ్మణ్యేశ్వర  స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి    
ఈ మాసం   ఉ.భా  నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు :- వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును.పనులలో విజయం. విష్ణుసహస్రనామం పారాయణ చేయండి.శుభ ఫలితాలు పొందండి    

ఈ మాసం రేవతి   నక్షత్రం వారికి మాసాధిపతి  గురుడు :- తలపెట్టిన పనులు పూర్తి అగును.ఉన్నత అధికారులతోపరిచయాలు.శివ స్తోత్రంపారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.
 

Latest Videos

click me!