July Horoscope: ఈ నెలలో ఓ రాశివారు స్త్రీ సంబంధిత వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది!

Published : Jul 01, 2026, 12:26 PM IST

July Horoscope: ఈ మాస ఫలాలు జూలై నెలకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల మాస ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
మాస ఫలాలు

ఈ మాస ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

మేష రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు కొంతవరకు బాగున్నప్పటికీ వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. దూరప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిదికాదు. మాసం చివర పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. 

313
వృషభ రాశి ఫలాలు

వృషభ రాశి వారికి ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యా ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. ఉద్యోగులకు అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. మాసం మధ్యలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. 

413
మిథున రాశి ఫలాలు

మిథున రాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు. ఇంటా బయటా వ్యతిరేకత పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి. కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. వ్యాపార వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు తప్పవు. డబ్బు వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

513
కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పాత అప్పులు కొంత వరకు తీర్చాగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మీ ఆలోచనా విధానంతో ఇంటా బయటా అందరిని ఒక మాట మీదకి తీసుకొస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న శత్రు పరమైన సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగి లాభాలు అందుకుంటారు. 

613
సింహ రాశి ఫలాలు

సింహ రాశి వారికి ఈ మాసంలో కొంత అనుకూల వాతావరణం ఉంది. వృత్తి, వ్యాపారాలలో విశేషంగా రాణిస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అవసరానికి ఏదో విధంగా డబ్బు సహాయం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. శత్రు సంబంధిత సమస్యలు కొంత వరకు తొలగి ఊరట చెందుతారు. దూరపు బంధువుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. మాసం చివర డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.

713
కన్య రాశి ఫలాలు

కన్య రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇంట్లో కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. అకారణ వివాదాలు మానసికంగా బాధిస్తాయి. వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. సంతాన విద్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. కొన్ని పనులలో బద్దకాన్ని వీడి ముందుకు సాగడం మంచిది. 

813
తుల రాశి ఫలాలు

తుల రాశివారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఆదాయానికి లోటు ఉండదు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఊహించని సమస్యల వల్ల మానసిక అశాంతి కలుగుతుంది. స్త్రీ సంబంధిత వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మాసం మధ్య నుంచి కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 

913
వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. మాసం చివరన జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలుగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు ఆశించిన పదవులు పొందుతారు. వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది.

1113
మకర రాశి ఫలాలు

మకర రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేదు. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి, ఉద్యోగాలలో ఇతరుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో కొంత జాగ్రత్త వహించాలి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. నూతన రుణ యత్నాలు చేయాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. మాసం మధ్యన కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 

1213
కుంభ రాశి ఫలాలు

కుంభ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. కీలక వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. మాసం చివర బంధుమిత్రుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

1313
మీన రాశి ఫలాలు

మీన రాశివారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. అవసరానికి సహాయం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానం విద్య, ఉద్యోగ విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. మాసం చివరన జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. 

Read more Photos on
click me!

Recommended Stories