నల్ల గాజులు వేసుకుంటే ఏమౌతుంది?

First Published | May 28, 2024, 5:09 PM IST

ఆడవాళ్లు ఏ రంగు చీర మీదికి ఆ రంగు గాజులను వేసుకుంటుంటారు. కానీ చాలా మంది నల్ల గాజులు వేసుకోకూడదని చెప్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. నల్ల గాజులు వేసుకుంటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

హిందూ మతంలో.. పెళ్లైన ఆడవారు గాజులు ధరించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఒకప్పుడు ఆకుపచ్చని గాజులనే ఎక్కువగా వేసుకునేది. కానీ ఇప్పుడు  ఈ రంగు చీరమీదికి ఆ రంగు గాజులను వేసుకుంటున్నారు. అయితే కొంతమంది నల్ల గాజులు వేసుకోకూడదని చెప్తుంటారు. జ్యోతిష్యుల ప్రకారం.. నల్ల గాజులు వేసుకుంటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

నల్ల గాజులు

నలుపు రంగును అశుభమని నమ్ముతారు. అయితే చాలా చోట్ల పెళ్లి తర్వాత కూడా ఆడవాళ్లు కొన్ని రోజుల పాటు ఎర్ర గాజులతో పాటుగా నల్ల గాజులను కూడా వేసుకుంటుంటారు. ఇది ఆడవాళ్లకు చాలా మంచిదని భావిస్తారు. 



నల్ల గాజులను ఎందుకు వేసుకుంటారు?

చాలా చోట్ల నవ వధువులు నల్ల గాజులను కూడా వేసుకుంటారు. ఎందుకంటే ఈ రంగు ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. ఇది నెగిటివిటీని తొలగిస్తుందని జ్యోతిష్యులు చెప్తారు.అందుకే నవ వధువులు నల్ల గాజులను వేసుకుంటుంటారు.
 

వైవాహిక జీవితంలో సంతోషం

పెళ్లైన తర్వాత  తర్వాత కొన్ని రోజుల పాటు ఎరుపు గాజులతో పాటుగా నల్ల గాజులను ఆడవాళ్లు వేసుకుంటుంటారు. దీనివల్ల మహిళల దాంపత్య జీవితంలో సంతోషం కలుగుతుందని నమ్ముతారు. అలాగే మహిళలు తమ చేతుల్లో నల్ల గాజులను వేసుకుంటే  అది వారి భర్తను చెడు కన్ను నుంచి కాపాడుతుంది. ఇది వారి భర్తను సురక్షితంగా ఉంచుతుందని నమ్ముతారు. 
 

Bangles

ఆర్థిక పరిస్థితి బలోపేతం 

నల్ల గాజులను ధరించడం వల్ల జీవితంలో సానుకూలత వస్తుందని చాలా మంది నమ్ముతారు. అలాగే ఇది భర్త ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది. నూతన వధూవరులు 6 నెలల పాటు నల్ల గాజులు వేసుకుంటే  భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తకుండా బంధం బలపడుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. 6 నెలల పాటు నల్ల గాజులు ధరించే ఆచారం సాధారణంగా ఉత్తర భారతదేశంలో ఉంటుంది. 
 

Latest Videos

click me!