Palmistry: మీ చేతిలో ఈ 5 రేఖలు ఉంటే చాలు ఎప్పటికైనా కోటీశ్వరులవుతారు

Published : Jul 19, 2026, 09:49 AM IST

Palmistry: హస్తసాముద్రికం ప్రకారం అరచేతిలోని గీతలు మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి.  కొన్ని అరుదైన గీతలు సంపదను సూచిస్తాయి. అరచేతిలో ఏ గీతలు ఉంటే మీరు కోటీశ్వరుల అవుతారో తెలుసుకోండి.

PREV
15
విధి రేఖ

అరచేతిలో విధిరేఖ ఉంటే ఎంతో మంచిది. ఇది అరచేతి మణికట్టు నుంచి మధ్య వేలు వైపు నిలువుగా వెళుతుంది.  ఈ గీత ఎలాంటి అడ్డంకులు లేని జీవితాన్ని సూచిస్తుంది. దీనివల్ల స్థిరమైన ఆర్థికాభివృద్ధి ఉంటుంది. సరైన సమయంలో మీకు అవకాశాలు, పెద్దల నుంచి సపోర్టు వాటంతట అవే వస్తాయి

25
సూర్య రేఖ

సూర్య రేఖ అనేది ఉంగరపు వేలు కింది భాగంలో ఉంటుంది. దీన్ని 'సూర్య స్థానం' అంటారు. అక్కడి నుంచి కిందికి వెళ్లే రేఖే 'సూర్య రేఖ'. ఈ రేఖ స్పష్టంగా ఉన్నవారు సమాజంలో కీర్తి, గౌరవం, గొప్ప సంపదను పొందుతారు. ముఖ్యంగా కళలు, రాజకీయాలు, రచన, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈ రేఖ ఉంటే త్వరగా కోటీశ్వరులవుతారు.

35
మత్స్య చిహ్నం

చేపగుర్తు కూడా ఎంతో మంచిది.  అరచేతిలో చేప ఆకారంలో గుర్తు ఉండటం  అత్యంత అదృష్టకరం. ఇది ఉండే వ్యక్తికి దైవానుగ్రహం ఉంటుంది. అతను చేసే  ప్రయాణాల ద్వారా లాభం, ఊహించని ధనప్రాప్తి పొందుతాడు. వీరు విజయవంతం అవ్వడానికి పూర్వజన్మలో చేసిన పుణ్యం కూడా తోడవుతుంది

45
త్రిభుజాకార గుర్తులు

అరచేతిలో త్రిభుజాకార గుర్తులు ఉండడం ఎంతో సంపదను తెచ్చిపెడుతుంది.  గురు స్థానం (చూపుడు వేలు కింద), సూర్య స్థానం లేదా బుధ స్థానం (చిటికెన వేలు కింద)లో త్రిభుజాకార గుర్తులు ఉండటం ఎంతో మంచిది.

55
త్రిశూల చిహ్నం

అరచేతిలో త్రిశులూ చిహ్నం ఉంటే అంతకన్నా ఇంకేం కావాలి ఎవరికైనా.  విధి రేఖపై లేదా సూర్య రేఖపై 'త్రిశూలం' వంటి గుర్తు ఉంటే ఆ వ్యక్తికి రాజయోగం దక్కుతుంది.  ఇది ఆ వ్యక్తిని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తుంది. వీరు ఏ పని చేసినా విజయం దక్కుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories