Zodiac sign: లై డిటెక్టర్ టెస్ట్ పెడతానంటే ఏ రాశివారు ఎలా ఫీలౌతారో తెలుసా..!

Published : Jul 26, 2022, 12:39 PM IST

ఈ టెస్టు చేసేటప్పుడు మనం అబద్దాలు చెబితే ఇట్టే పసిగట్టేస్తారు. అయితే.. ఒకేసారి అన్ని రాశుల వారికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాల్సి వస్తే..  ఏ రాశివారు ఎలా ఫీలౌతారో ఓసారి చూద్దాం..

PREV
113
 Zodiac sign: లై డిటెక్టర్ టెస్ట్ పెడతానంటే ఏ రాశివారు ఎలా ఫీలౌతారో తెలుసా..!

లై డిటెక్టర్ టెస్ట్.. దీని గురించి వినే ఉంటారు. ఈ టెస్టు చేసేటప్పుడు మనం అబద్దాలు చెబితే ఇట్టే పసిగట్టేస్తారు. అయితే.. ఒకేసారి అన్ని రాశుల వారికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాల్సి వస్తే..  ఏ రాశివారు ఎలా ఫీలౌతారో ఓసారి చూద్దాం..

213

1.మేష రాశి..
వామ్మో.. లై డిటెక్టర్ టెస్టా..? ముందు నేను మూతికి మాస్క్ వేసుకోవాలి. నేను నోరు తెరిస్తే అబద్దాలు చెబుతానని అందరికీ తెలిసిపోతుందేమో.. అని మేష రాశివారు భయపడతారు.

313

2.వృషభ రాశి..
ఈ రాశివారు తాము ఆ టెస్టు ద్వారా అబద్దాలు చెబుతామని తెలిసినందుకు బాధపడరు. కానీ.. తమ మనసులో ఉన్న వ్యక్తి గురించి ప్రశ్నలు అడగకుండా ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటారు. ఆ ఒక్క విషయం ఒక్కటి అడగకుంటే చాలు అని ఫీలౌతారు.
 

413

3.మిథున రాశి..
వామ్మో లై డిటెక్టర్ టెస్టా.. అని లోపల భయపడతారు. కానీ.. భయటకు మాత్రం కూల్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు. వెంటనే కూల్ వాటర్ తెచ్చుకొని ఓ గ్లాస్ వాటర్ తాగుతారు.

513

4.కర్కాటక రాశి...
ఈ రాశివారు.. హమ్మయ్య... నేను ఎక్కువ అబద్దాలు చెప్పను లే.. ప్రాబ్లమేమీ లేదు. ఒకవేళ అబద్దం చెప్పినా నేను వెంటనే దొరికిపోతాను. కాబట్టి.. నాకు పెద్దగా లై డిటెక్టర్ తో పనిలేదు. పెద్దగా భయపడాల్సిన అవసరం కూడా లేదు లే అనుకుంటారు.

613


5.సింహ రాశి..
లై డిటెక్టర్ మెషిన్ లో నేను అబద్దం చెప్పాను అని తెలిస్తే.. వెంటనే ఓ నవ్వు నవ్వేయాలి. అయినా.. నా ప్రేమ గురించి.. మనసులో ఉన్న వ్యక్తి గురించి మాత్రం అడకుండా ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటారు.
 

713

6.కన్య రాశి..
ఈ రాశివారు... ఒకే లై డిటెక్టర్ టెస్ట్ పెట్టనివ్వండి.. నాకు ఏం పర్వాలేదు. ఇది చాలా ఇంటస్ట్రింగ్ గా ఉంది. ఇలాంటిది నేను కూడా మా జూనియర్స్ దగ్గర ప్రయత్నించవచ్చు అని అనుకుంటూ ఉంటారు.
 

813

7.తుల రాశి..

ఈ రాశివారు.. ఈ టెస్టు గురించి చెప్పగానే.. ఏంటి ఈ పిచ్చి టెస్టులు... నాకు అసు ఇలాంటివి అస్సలు నచ్చవు. నేను ఈ టెస్టుకి అస్సలు ఒప్పుకోను.. ఒప్పుకోను అంటే ఒప్పుకోను అంటారు.

913

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు కూడా లై డిటెక్టర్ టెస్టు గురించి చెప్పగానే అస్సలు ఒప్పుకోరు. తాము అస్సలు చేయడానికి ఒప్పుకోమని చెప్పేస్తారు.. తాము ఇక్కడి నుంచి వెళ్లిపోతామని చెప్పేస్తారు. తమకు అర్జెంట్ గా పని ఉందని.. అక్కడి నుంచి వెళ్లిపోతామని చెప్పేస్తారు.
 

1013

9. ధనస్సు రాశి..
ఈ రాశివారు మామూలూ ముదురులు కాదు. లై డిటెక్టర్ టెస్టును కూడా ఎలా మోసం చేయాలా అని ఆలోచిస్తారు. దీని  కోసం ఏకంగా గూగుల్ చేస్తారు. ఎలా చీట్ చేసి ఈ టెస్టు నుంచి ఎలా బయటపడాలా అని చూస్తారు.
 

1113

10మకర రాశి..

ఈ రాశివారు మామూలుగానే ఎక్కువగా అబద్దాలు చెబుతూ ఉంటారు. కాబట్టి.. ఈ టెస్టు పేరు చెప్పగానే భయపడిపోతూ ఉంటారు.  ఎంత నోర్మూసుకొని ఉంటే అంత బెటర్ అని ఫీలౌతూ ఉంటారు. తమకు ఇలాంటి టెస్టుల పేర్లు వినగానే పీడకలలు గుర్తుకు వస్తాయి. ఈ టెస్టులో ఎలాంటి సమాధానాలు బయటకు వస్తాయో అని భయపడాల్సి వస్తోంది. ముందుగానే దీని గురించి మా పార్ట్ నర్ కి చెప్పడం ఉత్తమం అని ఫీలౌతూ ఉంటారు.

1213

11.కుంభ రాశి..
ఈ రాశివారు తొందరగా అబద్దాలు చెప్పరు.. కాబట్టి ఈ విషయంలో పెద్దగా టెన్షన్ పడరు. తొందరగా అయిపోతే.. బయటకు వెళ్లాలి.. కాఫీ తాగాలి అని అనుకుంటూ ఉంటారు.

1313

12.మీన రాశి..
ఈ రాశివారు తమ కు లై డిటెక్టర్ టెస్టు పెట్టడాన్ని అస్సలు ఒప్పుకోరు. తమ సీక్రెట్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయని భయపడతారు. ముందు... ఈ టెస్టుకి వెళ్లకుండానే.. అక్కడి నుంచి  పారిపోవాలని అనుకుంటూ ఉంటారు.

click me!

Recommended Stories