
కొందరికి దైవ భక్తి చాలా ఎక్కువ. ప్రతిరోజూ పూజలు చేస్తూ చేస్తుంటారు. మరి కొందరు కేవలం పండగల సందర్భంలో మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. ఇక కొందరికి అయితే.. అసలు పూజలు లాంటివి చేయడం పెద్దగా ఇష్టం ఉండదు. మరి అలాంటిది.. అన్ని మనస్తత్వాలు ఉన్న రాశులవారందరూ ఒకేసారి.. ఓ దైవ కార్యానికి వెళితే.. వారు ఎలా స్పందిస్తారు..? ఒక్కొక్కరు ఎలా ఉంటారో ఓసారి చూద్దాం..
1.మేష రాశి..
ఈ రాశివారు దైవ కార్యాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. అక్కడకు వెళ్లిన తర్వాత.. శ్రద్దగా కళ్లు మూసుకొని కూర్చుంటారు. కానీ.. కళ్లుమూసుకొని కూడా.. పక్కంటివారితో.. లేదా ఇంకెవరితోనో అంతక ముందు మాట్లాడని సంభాషణను తలుచుకుంటారు. దాని గురించే ఆలోచిస్తారు.
2.వృషభ రాశి..
ఈ రాశివారు దైవ కార్యక్రమానికి వెళితే.. అక్కడ పూజలు బాగా చేస్తారు. కీర్తనలు లాంటివి నిర్వహిస్తే.. అక్కడకు వచ్చిన భక్తులతో పాటు వీరు కూడా పాడుతారు. అయితే.. భక్తి గీతాలు పాడుతూ కూడా వీరు.. ప్రసాదం ఎక్కడ అయిపోతుందా అని ఆలోచిస్తారు.
3.మిథున రాశి..
ఈ రాశివారు దైవ కార్యక్రమానికీ, కీర్తనలకు వెళ్లినప్పుడు.. అక్కడకు ఎవరెవరు వచ్చారు..? ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు..? అనే విషయాలపై ఎక్కువ దృష్టి పెడతారు. వాటి గురించే వారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు.
4.కర్కాటక రాశి..
ఈ రాశివారు దైవ కార్యక్రమానికీ, కీర్తనలకు వెళ్లినప్పుడు వాటిలో లీనమైపోతారు. భక్తి కీర్తనలు పాడుతూ పరవశించిపోతారు. దేవుడికి పూజలు చేస్తూ.. తమకు అంతా మంచి చేయాలంటూ భగవంతుడిని కోరుకుంటారు.
5.సింహ రాశి..
ఈ రాశివారు దైవ కార్యానికి వెళ్లినప్పుడు అక్కడ చేస్తున్న భక్తి కీర్తనలను వీరు కూడా ఆలపిస్తారు. అయితే.. అక్కడకు వెళ్లే ముందు.. మంచి దుస్తులు వేసుకొని వెళతారు. ఆ దుస్తుల్లో.. మంచి ఫోటోలు దిగడం మాత్రం మర్చిపోరు.
6.కన్య రాశి..
ఈ రాశివారు దైవ కార్యక్రమానికి వెళ్లినప్పుడు ప్రశాంతంగా ఉంటారు. చాలా కామ్ గా ఒక చోట కూర్చొని.. అక్కడకు వచ్చిన వారిని పరిశీలిస్తారు. ఎవరైనా అక్కడకు వచ్చిన వారు మాట్లాడటం నవ్వడం లాంటివి చేస్తే.. వారిని సీరియస్ అవుతుంటారు.
7.తుల రాశి..
ఈ రాశివారు దైవ కార్యక్రమానికి వెళ్లినప్పుడు.. ఆ దైవ కీర్తనలను బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా.. మేష రాశివారి పక్కన కూర్చొని వీరు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు.
8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు దైవ కార్యక్రమానికి వెళ్లినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా మెడిటేషన్ చేస్తున్నట్లుగా కూర్చొొని ఆ కీర్తలను వింటారు. అంతేకాకుండా.. తమ జీవితంలో ఎదురౌతున్న సమస్యలకు పరిష్కారాన్ని దేవుడిని మనసులోనే కోరుకుంటారు.
9.ధనస్సు రాశి..
ఈ రాశివారు దైవ కార్యానికి వెళ్లినప్పుడు భక్తితో పాటలు పాడతారు. చప్పట్లు కొడతారు. తమ జీవితంలోని ముఖ్యమైన కోరికను పూర్తి చేయాలని ఆ సమయంలో దేవుడిని వీరు కోరుకుంటారు.
10.మకర రాశి..
మకర రాశివారు దైవ కార్యానికి వెళ్లినప్పుడు ఆటోమెటిక్ గా.. దేవుడికి పూజలు చేస్తూ పాటలు పాడతారు. అయితే.. ఆ తర్వాత.. ఏం చేయాలి అని మాత్రం మరో వైపు ఆలోచిస్తూనే ఉంటారు.
11.కుంభ రాశి..
ఇక కుంభ రాశివారు.. దైవ కీర్తనలు ఎవరు సరిగా పాడుతున్నారు..? ఎవరు సరిగా పాడటం లేదో చూస్తూ.. వారిని జడ్జ్ చేస్తూ ఉంటారు. అక్కడకు వచ్చిన వారిలో.. ఆసక్తి ఎవరెవరికో లేదో వాళ్ల ముఖాలు చూసి చెప్పేస్తూ ఉంటారు.
12.మీన రాశి..
ఈ రాశివారు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోరు. దైవ కీర్తనల్లో పాల్గొన్నప్పుడు.. శ్రద్దగా పూజ చేస్తున్నట్లు నటిస్తారు. కళ్లు మూసుకొని మెడిటేషన్ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి.. చిన్నపాటి కనుకు తీస్తారు.