జీవితం నుంచి ఈ రాశివారు ఏం నేర్చుకుంటారు..?

Published : Aug 30, 2021, 12:56 PM IST

కొందరు.. విజయమైనా.. అపజయమైనా.. రెండింటినీ సమానంగా స్వీకరిస్తారు. ఏది ఎలా ఉన్నా.. అసలు.. జీవితం గురించి ఏ రాశివారు ఏమనుకుంటున్నారు..? వారు జీవితం నుంచి ఏం నేర్చుకుంటున్నారో ఓసారి  చూద్దాం..

PREV
113
జీవితం నుంచి  ఈ రాశివారు ఏం నేర్చుకుంటారు..?

జీవితం మనకు ఎన్నో నేర్పిస్తుంది. కొన్ని సార్లు ఆనందాన్ని ఇస్తే.. మరికొన్ని సార్లు దుఖాన్ని ఇస్తుంది. అయితే.. కొందరు సవాళ్లను ఎదుర్కోలేక ఇబ్బందులుపడతారు. అయితే.. కొందరు మాత్రం సవాళ్లను ఎదుర్కొని నిలపడతారు. కొందరు విజయాలను మాత్రమే తీసుకోగలుగుతారు. కొందరు.. విజయమైనా.. అపజయమైనా.. రెండింటినీ సమానంగా స్వీకరిస్తారు. ఏది ఎలా ఉన్నా.. అసలు.. జీవితం గురించి ఏ రాశివారు ఏమనుకుంటున్నారు..? వారు జీవితం నుంచి ఏం నేర్చుకుంటున్నారో ఓసారి  చూద్దాం..
 

213


1.మేష రాశి..
ఈ రాశివారికి తొందర ఎక్కువ. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత చేసిన తప్పు గురించి ఆలోచిస్తారు. వీరికి జీవితంలో ఏ విషయంపైనా పెద్దగా క్లారిటీ ఉండదు. అయితే.. జీవితంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని ఉత్సాహంగా ఎదురుకుంటారు.

313

2.వృషభ రాశి..
ఈ రాశివారు ఎదుటివారికి నీతులు చెప్పడమే కానీ..వాటిని ఆచరణలో పెట్టడంలో మాత్రం విఫలమౌతూ ఉంటారు. నిత్యం కంఫర్ట్ జోన్ లో ఉండటానికి ఇష్టపడతారు. సమాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండరు.

413

3.మిథున రాశి..
ఈ రాశివారికి ద్వంద్వ లక్షణాలు ఉంటాయి. అందుకే.. జీవితంపై పెద్దగా అవగాహన ఉండదు. ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తారు. ఒక్కోసారి వారే ఔను అంటారు.. మరోసారి వారే కాదు అంటారు. వీరికి తొందరగా క్లారిటీ ఉండదు.

513


4. కర్కాటక రాశి..
ఈ రాశివారు కొంచెం ఎమోషనల్ గా ఉంటారు.  ఊహల్లో ఎక్కువగా బతుకుతుంటారు. వారికి నచ్చినవారితో ఆనందంగా ఉంటారు. మ్యూజిక్ వినడం వీరికి ఎక్కువ ఇష్టం. ఊహల్లోనే దే నిజం అని అనుకుంటూ ఉంటారు.

613

5. సింహ రాశి..

ఈ రాశివారు చాలా ధైర్యవంతులు.  చాలా తెలివిగలవారు. వీరికి జీవితంలో ఏది కావాలి అనే విషయంలో చాలా క్లారిటీ ఉంటుంది. అదే వీరి విజయానికి కారణం అవుతుంది.

713


6.కన్య రాశి..

ఈ రాశివారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. వారికి జీవితంలో ఏం కావాలో క్లారిటీ ఉంటుంది. కోరుకున్నది సాధించుకునే నైపుణ్యం కూడా ఉంటుంది. అయితే.. వారు కోరుకున్నది ప్రతిదీ దక్కాలని పంతంలో ఉంటారు. దాని వల్ల.. ఇతరులతో గొడవలు లాంటివి వస్తూ ఉంటాయి. కోరుకున్నది జరగకుంటే నిరాశలోకి వెళ్లిపోతారు.

813


7.తుల రాశి..
ఈ రాశివారు ఎక్కువగా పగటి కలలు కంటూ ఉంటారు. ఆ కలల నుంచి బయటకు రావడానికి ఇష్టపడరు. వాస్తవంలో వీరికి అభద్రతా భావం ఎక్కువ. వీరికి స్వీయ అలంకరణకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎదుటివారు తమను ఎలా చూస్తున్నారనే విషయంలో ఎక్కువ ఫోకస్ పెడతారు.

913

8.వృశ్చిక రాశి..
 ఈ రాశివారు తొందరగా ఎవరికీ అర్థం కారు. వీరి ఆలోచలను చాలా డీప్ గా ఉంటాయి. వీరు ఎక్కువగా ఎదుటివారిని చదువుతారు. వీరు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలుగుతారు.

1013

9. ధనస్సు రాశి..
ఈ రాశివారికి జీవితంపై క్లారిటీ ఎక్కువ.  జీవితంలో అనుకన్నది సాధిస్తారు.  వీరు చాలా నిజాయితీగా ఉంటారు.  వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. మనకుసుకు నచ్చని పని చేస్తుంటారు.
 

1113

10. మకర రాశి..
ఈ రాశివారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా వారి జీవితం సరిగా ఉండదని వీరు ముందుగానే గ్రహించి.. కఠిన నిర్ణయాలు తీసుకంుటారు. వీరు ఉన్నత లక్ష్యాలను పెట్టుకుంటారు. వాటిని  సాధించడానికి నిత్యం కష్టపడుతూనే ఉంటారు.

1213

11. కుంభ రాశి..
ఈ రాశివారు చాలా భిన్నం. వీరిలాంటి వారు ఇంకొకరు ఉండరు. వీరు ప్రతి విషయంలో భిన్నంగా ఉండాలని అనుకుంటారు.  వీరు కూడా ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తారు.

1313

12. మీన రాశి..
ఈ రాశివారు జీవితాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు. ఎవరైనా విషయం చెప్పినప్పుడు.. అది మంచా, చెడా అని ఆలోచిస్తారు. వీరిని ఎదుటివారు అర్థం చేసుకోవడం కొంచెం కష్టమనే చెప్పాలి. 

click me!

Recommended Stories