పార్ట్ నర్ మోసం చేస్తే... ఈ రాశులవారు ఏం చేస్తారో తెలుసా?

Published : Jun 18, 2022, 11:09 AM IST

మనం ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మనతో ప్రేమలో ఉంటూనే.. మనకు తెలీకుండా మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్నారు అని తెలిస్తే.. దానిని తట్టుకోవడం చాలా కష్టమే. మరి మన లైఫ్ పార్ట్ నర్ మోసం చేస్తే... ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతారో జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఇప్పుడు  చూద్దాం..  

PREV
113
 పార్ట్ నర్ మోసం చేస్తే... ఈ రాశులవారు ఏం చేస్తారో తెలుసా?
cheating

జీవితంలో నిజమైన ప్రేమ దొరకాలని అందరూ కోరుకుంటారు. అయితే.. ఒక్కోసారి అది సాధ్యం కాదు. చాలా మంది ప్రేమలో మోసపోతూ ఉంటారు. మనం ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మనతో ప్రేమలో ఉంటూనే.. మనకు తెలీకుండా మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్నారు అని తెలిస్తే.. దానిని తట్టుకోవడం చాలా కష్టమే. మరి మన లైఫ్ పార్ట్ నర్ మోసం చేస్తే... ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతారో జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఇప్పుడు  చూద్దాం..

213

1.మేష రాశి..

మిమ్మల్ని మోసం చేసినందుకు మీరు మీ భాగస్వామిపై చాలా కోపంగా ఉంటారు. మిమ్మల్ని కాకుండా.. మరో వ్యక్తి వెంట పడటం వీరిని తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. తమ పార్ట్ నర్ ఇష్టపడిన వ్యక్తితో... వీరు తమను పోల్చుకోవడం మొదలుపెడతారు. అలా వారితో పోల్చుకొని వీరు ఇంకా ఎక్కువ బాధ పడతారు. ఇది వీరిని మరింత కుంచిస్తుంది. 
 

313

2.వృషభ రాశి..
పార్ట్ నర్ మోసం చేసినా.. వీరు క్షమించేయాలని అనుకుంటారు. కానీ.. వారిపై కోపం మాత్రం విపరీతంగా పెంచుకుంటారు. ఒక్కసారి  మోసం చేశారనే విషయాన్ని గుర్తుంచుకొని.. ప్రతి విషయంలోనూ వారు చేస్తున్న పొరపాట్లను గుర్తు చేస్తూ.. వారిని విమర్శిస్తూనే ఉంటారు. భాగస్వామిపై ప్రతి నిమిషం కోపం తెప్పిస్తూ ఉంటారు. 

413

3.మిథున రాశి..

జీవిత భాగస్వామి మోసం చేశారు అని తెలిస్తే.. వారు తమ ముందు మోకాలి పై కూర్చొని క్షమాపణ చెప్పాలని కోరుకుంటారు. అలా క్షమాపణ చెప్పిన తర్వాత కూడా... వీరు ఏ మాత్రం క్షమించరు. అయితే..మళ్లీ తమను గుర్తించి.. తమ దగ్గరకు రావాలని కోరుకుంటారు. మోసం చేసినాన.. మళ్లీ తమ పార్ట్ నర్ తోనే కలిసి ఉండాలని వీరు అనుకుంటారు. 
 

513

4.కర్కాటక రాశి..

మీరు మీ భాగస్వామి ఏం చెబుతున్నారు అనే విషయాన్ని  ఓపికగా వింటారు. వారు అలా చేయడానికి గల కారణం ఏంటో అడిగి తెలుసుకుంటారు. కారణం తెలుసుకున్న తర్వాత మాత్రం..మళ్లీ మీ జీవితంలోకి రానివ్వరు. కానీ.. వారు అలా చేయడానికి కారణం మాత్రం తెలుసుకుంటారు. తమ పార్ట్ నర్ కి రెండో ఛాన్స్ మాత్రం ఇవ్వాలని అనుకోరు.

613

5.సింహ రాశి..

మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేశారని చెప్పడానికి కూడా మీరు సిగ్గుపడతారు కాబట్టి మీరు మీ కీర్తిని చెక్కుచెదరకుండా ఉంచడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. బహిరంగ ఘర్షణలను నివారించడానికి మీరు మీ భాగస్వామిని క్షమించవచ్చు కానీ, మూసి ఉన్న తలుపుల వెనుక, మీరు వారితో మాట్లాడకుండా వారాలు గడుపుతారు.

713

6.కన్య రాశి..
మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తే మీరు చాలా సెన్సిటివ్, ఎమోషనల్ అవుతారు. కానీ ఈ సున్నితత్వం మీ భాగస్వామిపై ప్రతీకారం తీర్చుకునేలా చేస్తుంది. మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయాలని ఆలోచిస్తున్నందుకు మీ భాగస్వామిని అవమానపరచడానికి లేదా చాలా బాధ కలిగించడానికి మీరు ప్రణాళికలు వేసుకోవచ్చు.

813

7.తుల రాశి..

మీరు సంబంధాన్ని కాపాడుకోవడానికి సాధ్యమైన ప్రతిదాన్ని ప్రయత్నిస్తారు, ఎందుకంటే మీ సంబంధం వృధాగా మారడాన్ని మీరు చూడలేరు. మీరు మీ భాగస్వామిని పట్టుకుని, వారి తప్పును తెలుసుకునేలా పని చేస్తారు, కానీ మీరు వదిలిపెట్టరు.

913

8.వృశ్చిక రాశి..

మీ భాగస్వామి ఇతర వ్యక్తులతో రోమాంటిక్ గా ఉన్నారు అని ఆలోచన వచ్చినా కూడా.. వీరు తట్టుకోలేరు. విపరీతమైన కోపం వచ్చేస్తుంది.  కాబట్టి, మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నాడని మీరు కనుగొంటే, మీరు ప్రతి విషయంలోనూ కోపంగా ఉంటారు. ప్రతికారం తీర్చుకోవాలని అనుకుంటారు.
 

1013

9.ధనస్సు రాశి..

మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తే పిచ్చివారు అయిపోతారు. మీరు చాలా మూడీ అవుతారు; మీ భాగస్వామి ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసుకొని మీరు ఏడుస్తూ ఉంటారు. కేకలు వేస్తారు లేదంటే పూర్తిగా మౌనంగా ఉంటారు.

1113

10.మకర రాశి..

మీ భాగస్వామి మోసపూరిత చేష్టల గురించి మీకు తెలిసిన వెంటనే మీరు వారికి దూరంగా ఉంటారు. వారు మీకు వివరణ ఇచ్చే వరకు మీరు వేచి ఉండరు. బదులుగా, మీరు వారితో విడిపోయి వీలైనంత త్వరగా ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు.

1213

11.కుంభ రాశి..

మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేయడం ద్వారా మీరు మానసికంగా బాగా దెబ్బ తింటారు. వారితో రిలేషన్ కూడా మీకు నచ్చదు. గతంలో మీరు మీ భాగస్వామితో గడిపిన సంతోషకరమైన విషయాలను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. మీ భాగస్వామి చేసిన తప్పును పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. 

1313

12.మీన రాశి..

మిమ్మల్ని మోసం చేసినందుకు మిమ్మల్ని విపరీతంగా బాధిస్తుంది. మీరిద్దరూ కలిసి గడిపిన సమయాన్ని మరచిపోవడం మీకు కష్టంగా ఉంటుంది. అదే విషయాన్ని పదే పదే తలుచుకొని బాధ పడుతూ ఉంటారు. ఆ బాధ నుంచి బయట పడటం వీరికి అంత తొందరగా సాధ్యం కాదు.
 

click me!

Recommended Stories