ఎలాంటి వ్యక్తిని తమ జీవితంలో ఆహ్వానించాలి అనే విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండదు. అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశివారు తమ జీవితంలోకి వచ్చే వ్యక్తిని ఎలా సెలక్ట్ చేసుకోవాలో తెలుసుకోవచ్చట. అదెలాగో చూద్దాం..
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రేమ ఒక భాగం కావాలని కోరుకుంటారు. అందరు ప్రేమికుల్లానే తాము కూడా సరదాగా గడపాలని ఆశపడతారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. ఎలాంటి వ్యక్తిని తమ జీవితంలో ఆహ్వానించాలి అనే విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండదు. అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశివారు తమ జీవితంలోకి వచ్చే వ్యక్తిని ఎలా సెలక్ట్ చేసుకోవాలో తెలుసుకోవచ్చట. అదెలాగో చూద్దాం..
213
1.మేష రాశి..
మేష రాశివారు చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. వారి వైబ్ సెట్ అవ్వాలి అంటే.. అలా ఎనర్జిటిక్ గా ఉండేవారే సెట్ అవుతారు. కాబట్టి.. మేష రాశివారికి తుల , సింహ రాశివారు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు. వారితో వీరి లైఫ్ సరదాగా ఉంటుంది.
313
2.వృషభ రాశి..
వృషభ రాశివారు చాలా పవర్ ఫుల్ పర్సనాలిటీ కలిగి ఉంటారు. కాబట్టి.. ఈ రాశివారికి వృశ్చిక రాశి, మకర రాశివారు సెట్ అవుతారు. వృషభ రాశివారికి ఈ రెండు రాశులే జీవిత భాగ స్వాములుగా సెట్ అవుతారు.
413
3.మిథున రాశి..
మిథున రాశివారికి రొమాంటిక్ ఆలోచనలు కాస్త ఎక్కువ అనే చెప్పాలి. కాబట్టి... ఈ రాశివారికి ధనస్సు రాశి, కుంభ రాశివారు అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు.
513
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు మకర రాశి లేదంటే.... వృషభ రాశివారితో ప్రేమలో పడొచ్చు. ఎందుకంటే... ఈ రెండు రాశులవారు మీ ప్రేమ, రిలేషన్ షిప్ కి కరెక్ట్ గా సెట్ అవుతారు.
613
5.సింహ రాశి..
సింహ రాశివారికి ఎవరైనా సెట్ అవ్వాలంటే.. వారు ఇంకో సింహ రాశివారిని మాత్రమే ఎంచుకోవాలి. లేదంటే... మిథున రాశి, కుంభ రాశి వారిని ఎంచుకోవాలి. ఎందుకంటే వీరికి మాత్రమే.. మీతో సమానమైన ఎనర్జీ లెవల్స్ ఉంటాయి.
713
6.కన్య రాశి..
కన్య రాశివారికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి అంటే.. వారు కర్కాటక, మీన రాశివారు అయ్యి ఉండాలి. ఎందుకంటే.. కన్య రాశివారి అసవరాలను వీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు కూడా.
813
7.తుల రాశి..
తుల రాశివారికి పర్ఫెక్ట్ మ్యాచ్ గా మేష రాశి లేదంటే ధనస్సు రాశి సెట్ అవుతుంది. ఈ రాశివారు తమ జీవితంలో ఎలాంటి ఒత్తిడి, సమస్యలు లేకుండా ఉండాలి అంటే... ఈ రాశుల వారిని ఎంచుకోవడం మంచిది.
913
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారికి వృషభ రాశి, కర్కాటక రాశివారు పర్ఫెక్ట్ మ్యాచ్ గా నిలుస్తారు. ఎందుకంటే ఈ రెండు రాశులవారికి ప్రేమ విలువ ఎక్కువగా తెలుసు. వారికి మీకు ఎలాంటి ప్రేమ అవసరమో బాగా తెలుసు. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.
1013
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశి వారికి మిథున రాశి లేదంటే మేష రాశివారు బాగా సెట్ అవుతారు. ఈ రెండు రాశుల వారు.. ధనస్సు రాశి వారికి జీవితంలో కావాల్సినంత ఫన్ ఇస్తారు. ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు.
1113
10.మకర రాశి..
మకర రాశివారు కర్కాటక రాశి లేదంటే వృషభ రాశివారితో అయితే బాగా సెట్ అవుతారు. ఎందుకంటే.. ఈ రెండు రాశుల వారి వ్యక్తిత్వం మీకు సరిగా మ్యాచ్ అవుతుంది.
1213
11.కుంభ రాశి..
ఈ రాశివారికి పర్ఫెక్ట్ మ్యాచ్ కావాలి అంటే.. వారు మరో కుంభ రాశివారిని లేదంటే సింహ లేదంటే.. ధనస్సు రాశివారిని ఎంచుకోవాలి. ఎందుకంటే.. వీరు మాత్రమే.. మీలోని క్రియేటివిటీని అర్థం చేసుకోగలరు.
1313
12.మీన రాశి..
మీన రాశివారికి వృషభ రాశి లేదంటే కన్య రాశివారు బాగా సెట్ అవుతారు. ఈ రెండు రాశుల వ్యక్తిత్వం మాత్రమే... మీన రాశివారితో సరిపోలతాయి.