కుంభం (Aquarius)
కుంభ రాశి వారు తమ పై అధికారులు చెప్పిన వాటిని పాటించే విషయంలో కాస్త మొండిగా వ్యవహరిస్తారు. దీనికి కారణం వారు తమకు తోచిన వాటిని మాత్రమే చేయాలనుకుంటున్నారు. అందుకే తమకు ఏం చెబుతున్నారో, తమనుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవడం ద్వారా, వారు తమ యజమానితో తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. కుంభ రాశి వారు తమ బాస్ తో మంచి సంబంధాన్ని కొనసాగించాలనుకుంటే, వాళ్లు చెప్పేది అనుసరించడం ప్రారంభించాలి.