ఈ రాశివారు ఆయస్కాంతంలా ఎవ్వరినైనా ఇట్టే ఆకర్షిస్తారు..

Published : May 07, 2022, 12:22 PM IST

వీళ్లు అయస్కాంతం లాంటోళ్లు.. ఎక్కడున్నా జనాల్ని ఇట్టే ఆకర్షిస్తారు. ఆకర్షా.. ఆకర్షా.. అనట్టుగా వీరిచుట్టూ జనాలు మూగిపోతారు. వీరి ప్రత్యేకతలకు ఫిదా అవుతారు. ఇదంతా వారు పుట్టిన రాశి మహిమేనట.. 

PREV
16
ఈ రాశివారు ఆయస్కాంతంలా ఎవ్వరినైనా ఇట్టే ఆకర్షిస్తారు..

కొంతమంది ఎంతమందిలో ఉన్నా సెంటార్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటారు. వారి చుట్టూ ఎప్పుడూ సంతోషం, సరదా ఉంటుంది. వారిలో ఏదో తేజస్సు నలుగురిని ఆకర్షిస్తుంది. ఆకర్షణీయంగా ఉంటారు. అందుకే వీరు ఒక్కడుంటే అక్కడ సందడే సందడి. అయితే ఈ లక్షణం రావడానికి కూడా వారి రాశిచక్రమే కారణమట.. అలాంటి హాటెస్ట్‌గా రాశిచక్రాలేవో చూడండి.. 

26

వృషభం
వృషభరాశిలో ఏదో ఒక అంశం అందరినీ ఆకర్షిస్తుంది. వారు స్థిరత్వం, భద్రతకు సంబంధించిన బలమైన భావాలను ప్రదర్శిస్తారు. అందరికీ ఇవి నచ్చుతాయి. ఏ రిలేషన్ లో ఉన్నవారైనా దీనిని ఇష్టపడతారు. అంతేకాదు ఈ రాశివారు ఏదైనా కోరుకున్నారంటే చేసేదాకా నిద్రపోరు.

36
(Sagittarius)

ధనుస్సు
వీరు నమ్మకస్తులు. సాహసోపేతంగా ఉంటారు. ఆకర్షణీయంగా ఉంటారు. అందుకే వీరి ఉనికిని ప్రజలు అంత తేలికగా మరచిపోలేరు. ఒక్కసారి వీరితో పరిచయం అయితే.. శాశ్వతమైన ముద్ర వేస్తారు. అందుకే ఈ రాశివారితో ప్రతి ఒక్కరూ స్నేహితులుగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ధనుస్సు రాశి వారి లక్షణాలు ఎంత ఆకర్షణీయంగా, హాట్ గా ఉంటాయంటే.. వారి స్నేహం కోసం ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తారు.

46
Representative Image: Scorpio

వృశ్చిక రాశి
ఈ రాశివారు చమత్కారంగా ఉంటారు. మిస్టీరియస్ గా ఉంటారు. అయినా హాట్ గా ఉంటారు. అందుకే వీరంటే ప్రతీ ఒక్కరూ పడి చచ్చిపోతారు. వృశ్ఛికరాశివారికి సున్నితమైన హాస్యంతో.. నర్మగర్భంగా, ఆకర్షణీయంగా మాట్లాడుతూ...ఎలా ఆకట్టుకోవాలో బాగా తెలుసు. 

56

కుంభం
ఈ రాశివారు చాలా స్పాంటేనియస్ గా ఉంటారు. కొన్నిసార్లు,  అంతర్ముఖులుగా ప్రవర్తిస్తారు. కానీ వారు ఎక్కడికి వెళ్లినా జీవితానికి మించిన వారి వ్యక్తిత్వంతో వెలిగిపోతారు. వారు ఉల్లాసంగా, సరదాగా ఉంటారు. వారు తమను తాము బహిరంగంగా వ్యక్తీకరించే విధానం కూడా చాలా ప్రశంసనీయంగా ఉంటుంది.

66

కర్కాటకరాశి
ప్రేమకు, ఆత్మీయతకు ఎంతో విలువనిచ్చే ఎమోషనల్ వ్యక్తులు కర్కాటకరాశి వారు. వీరు ప్రేమకు ప్రాధాన్యతనిచ్చే విధానం, ఎంత గొప్ప భాగస్వామిగా ఉంటారో చూసి ఆశ్చర్యపోతారు. ఈ రాశిచక్రం  వ్యక్తులు ప్రజల హృదయాలలోకి ఇట్టే చొచ్చుకుపోతారు. వీరి బబ్లీ ఎనర్జీ అందరికీ అంటించి.. తామున్న దగ్గర మొత్తం సంతోషాన్ని, సరదాని విస్తరిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories