Horoscope Today : ఈ రోజు ఈ రాశి వారికి కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి..!

Published : May 07, 2022, 07:17 AM IST

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాలలో తెలుసుకుందాం

PREV
114
Horoscope Today : ఈ రోజు ఈ రాశి వారికి కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి..!
Representative Image: Aries

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- 
కుటుంబంతో అనందంగా గడుపుతారు. విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు.  కుటుంబంలో నెలకొన్న అనిశ్చితలు, అశాంతి క్రమంగా తొలగిపోగలవు. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. స్త్రీలు విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలు. కొత్త  వ్యక్తుల పరిచయాలు. గృహము నందు సుఖవంతంమైన జీవితం. విద్య, ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. ఓం మహాలక్ష్మియై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.

214
Representative Image: Taurus

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  
శుభవార్త వింటారు. బంధుమిత్రులను కలుస్తారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వ్యవహారాలు ధన వ్యయంతోనే సానుకూలమవుతాయి. ఏదైమైనా ఈ రోజు కుటుంబంతో అనందంగా గడిపే ప్రయత్నం చేయండి. ప్రయాణాలు. ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం.గౌరవ ప్రతిష్ఠలు కల్గును. మంచి పనులను చేస్తారు. సర్వకార్య సిద్ది. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను

314

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  
అనవసర గొడవలు. ప్రయాణాలు భయం,నీరసంగా ఉండును. ప్రైవేటు సంస్థలలోని వారికి ఈ రోజు జరిగే మార్పులు అనుకూలిస్తాయి. భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు, జరగవలిసిన ముఖ్యమైన పనులు చేజారిపోతాయి. అప్పటికీ   సాహసముతో చేయు పనులతో లాభం చేకూరును.  ఉద్యోగ, వ్యాపారముల యందు సామాన్యంగా ఉండును. అనేక రకములైన ఆలోచనలు చేస్తారు. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.

414

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 
అకారణంగా కోపం వచ్చును. చేయు పనియందు అడ్డంకులు. స్త్రీల వాక్ చాతుర్యంనకు, తెలివి తేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన ఫలితాలొస్తాయి. దగ్గర దాకా వచ్చాము..కొంచెం కష్టపడాలి అని అర్దం చేసుకోండి. బంధు,మిత్రులతో గొడవలు. అనవసర ఖర్చు. ఉద్యోగ, వ్యాపారముల యందు సామాన్యంగా ఉండును. ఓం సూర్యాయ నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను

514

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-
కుటుంబంతో అనందంగా గడుపుతారు. విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేధాలు తలెత్తవచ్చు. పుణక్షేత్రాలను దర్శిస్తారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి.  ప్రయాణాలు. కొత్త  వ్యక్తుల పరిచయాలు. గృహము నందు సుఖవంతంమైన జీవితం. విద్య, ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. ఓం మహాలక్ష్మియై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను

614
Virgo

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 
శుభవార్త వింటారు. బంధుమిత్రులను కలుస్తారు.  ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. కుటుంబంతో అనందంగా గడుపుతారు. ప్రయాణాలు. ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం.గౌరవ ప్రతిష్ఠలు కల్గును. మంచి పనులను చేస్తారు. సర్వకార్య సిద్ది. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను

714
Libra

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 
అనవసర గొడవలు. ప్రయాణాలు భయం,నీరసంగా ఉండును.  అయినా కుటంబ సపరివారంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కుటుంబీకులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు, రేషన్ డీలర్లకు అధికారుల వేధింపులు అధికమవుతాయి. అయినా ధైర్యంతో ముందుకు వెళ్లి  చేయు పనులతో లాభం చేకూరును.  ఉద్యోగ, వ్యాపారముల యందు సామాన్యంగా ఉండును. అనేక రకములైన ఆలోచనలు చేస్తారు. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.

814
Scorpio

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 
అకారణంగా కోపం వచ్చును. చేయు పనియందు అడ్డంకులు. బంధు,మిత్రులతో గొడవలు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. మిత్రులతో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరుపుతారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనవసర ఖర్చు. ఉద్యోగ, వ్యాపారముల యందు సామాన్యంగా ఉండును. ఓం సూర్యాయ నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.

914

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఉద్యోగాలలో పనిభారం, ఒత్తిడులు తగ్గుతాయి. రాజకీయవర్గాలు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. కొన్ని సమస్యలు ఎవరి ప్రమేయం లేకుండా పరిష్కరించుకుంటారు. ఒక కోర్టు వ్యవహారంలో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సు రాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-
కుటుంబంతో అనందంగా గడుపుతారు. విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు.  రాజకీయ, కళారంగాల వారికి  కలిసి వస్తుంది. ఊహించని గుర్తింపు లభిస్తుంది. వాహనచోదకులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినా జార విడచుకుంటారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలు. కొత్త  వ్యక్తుల పరిచయాలు. గృహము నందు సుఖవంతంమైన జీవితం. విద్య, ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. ఓం మహాలక్ష్మియై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.

1014
Representative Image: Capricorn

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 
శుభవార్త వింటారు. బంధుమిత్రులను కలుస్తారు. కుటుంబంతో అనందంగా గడుపుతారు.  స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. వేడుకలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. వసతి ఏర్పాట్ల విషయంలో చిక్కులు ఎదువవుతాయి.ప్రయాణాలు. ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం.గౌరవ ప్రతిష్ఠలు కల్గును. మంచి పనులను చేస్తారు. సర్వకార్య సిద్ది. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను

1114
Representative Image: Aquarius

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-
అనవసర గొడవలు. ప్రయాణాలు భయం,నీరసంగా ఉండును.  వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ మాటతీరు, పద్దతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. స్త్రీలకు నడుము, తల, నరాలకు సంబంధించన చికాకులు అధికమవుతాయి. సాహసముతో చేయు పనులతో లాభం చేకూరును. ఉద్యోగ, వ్యాపారముల యందు పెద్దగా మార్పులేమీ ఉండవు.. ఎదుగుదల కోసం అనేక రకములైన ఆలోచనలు చేస్తారు. కానీ ఓ ఫోన్ కాల్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.

1214
Pisces

మీనరాశి ( Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-
అకారణంగా కోపం వచ్చును. చేయు పనియందు అడ్డంకులు. బంధు,మిత్రులతో గొడవలు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. సంఘంలో మంచి గుర్తింపులభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాల్లో అసహనానికి లోనవుతారు. అనవసర ఖర్చు.  ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి తోటివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. ఓం సూర్యాయ నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.

1314
Daily Horoscope 2022 - 20

ఈ రోజు పంచాంగం
తేది : 7, మే 2022
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : షష్టి
(నిన్న ఉదయం 9 గం॥ 10 ని॥ నుంచి 
ఈరోజు ఉదయం 11 గం॥ 8 ని॥ వరకు)
నక్షత్రం : పునర్వసు
(నిన్న ఉదయం 6 గం॥ 32 ని॥ నుంచి 
ఈరోజు ఉదయం 9 గం॥ 5 ని॥ వరకు)
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 51 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 7 గం॥ 36 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 5 గం॥ 42 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 7 గం॥ 18 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 10 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 6 గం॥ 00 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 3 గం॥ 00 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 34 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 18 ని॥ లకు
 

1414
Daily Horoscope 2022 - 13

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

Read more Photos on
click me!

Recommended Stories