Horoscope: మీనరాశి వారికి నూతన పరిచయాలు..ఆ రాశి వారికి వివాదాలు

Published : May 09, 2025, 04:30 AM IST

ఈ వారం 12 రాశులవారికి ఎదురయ్యే మార్పులు, అవకాశాలు, సవాళ్లు గురించి జ్యోతిష శాస్త్ర ప్రకారం విశ్లేషణ ఇవ్వడం జరిగింది. వ్యాపారాలు, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవహారాలు, ప్రయాణ సూచనలు, ఆరోగ్య పరిస్థితులపై ప్రభావాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

PREV
112
Horoscope: మీనరాశి వారికి నూతన పరిచయాలు..ఆ రాశి వారికి వివాదాలు
మేషం

మేష రాశి వారికి వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనవసర వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. దూరప్రయాణాలు చేసే సూచనలు కనపడుతున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

212
వృషభం

వృషభ రాశి వారికి ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు కనపడుతున్నాయి. వ్యాపార ఉద్యోగాలలో సకాలంలో నిర్ణాయాలు తీసుకుని లాభాలు పొందుతారు. గృహంలో శుభకార్యాలు జరగనున్నాయి.నూతన వస్తువులు కొనుగులు చేయనున్నారు.

312
మిథునం

మిథున రాశి వారు ఆప్తుల నుంచి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలను అధిగమిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అయ్యే సూచనలు కనపడుతున్నాయి.

412
కర్కాటకం

కర్కాటక రాశి వారికి దూర ప్రయాణ సూచనలు కనపడుతున్నాయి. అవసరానికి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సహాయం అందదు. పాత ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.
 

512
సింహం

సింహ రాశి వారు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్‌. వ్యాపారాలలో అత్యధికంగా శ్రమించాల్సి ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. అందాల్సిన ధనం టైమ్‌ కి రాదు.వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

612
కన్య

కన్య రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి. సన్నిహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

712
తుల

తుల రాశి వారు నూతన వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. బంధు మిత్రులతో వివాదాలు తొలగిపోతాయి.ఉద్యోగస్తులు పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

812
వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ధనం విషయంలో ఒడిదుడుకులు అధికమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగపరంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు.
 

912
ధనుస్సు

ధనుస్సు రాశి వారు ప్రశాంతత కోసం దైవదర్శనం చేసుకుంటే మంచిది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం గా ఉంటుంది.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వస్తాయి.

1012
మకరం

మకర రాశి వారు నూతన వస్తు లాభాలు పొందుతారు. సమాజంలో పెద్దల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. 

1112
కుంభం

కుంభ రాశి వారికి ఇంటా బయటా పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి.కడుపునకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కలిగే సూచనలున్నాయి.ఉద్యోగాలలో అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

1212
మీనం

మీన రాశి వారికి ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలిసి సంతోషంగా ఉంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories