Ugadi 2022: ఈ నూతన ఉగాది సంవత్సరంలో అన్ని రాశుల జాతకాలు..!

First Published | Mar 28, 2022, 4:44 PM IST

హిందువులకు నూతన సంవత్సర పండుగ బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు. చైత్ర మాసంలోని శుక్ల పక్షం రోజున ఏప్రిల్ 2న శుభ్రుక్ సంవత్సరాది ప్రారంభమౌతుంది. మరి ఈ ఏడాది ఏ రాశివారి జాతకం ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం..

Ugadi Panchangam

హిందువులకు నూతన సంవత్సర పండుగ బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు. చైత్ర మాసంలోని శుక్ల పక్షం రోజున ఏప్రిల్ 2న శుభ్రుక్ సంవత్సరాది ప్రారంభమౌతుంది. మరి ఈ ఏడాది ఏ రాశివారి జాతకం ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం..

Aries

మేష రాశి..
మేష రాశివారు ఈ ఏడాది మీ పనులపై దృష్టి కేంద్రీకరించడాన్ని కొనసాగించండి. శని 10 వ ఇంట్లో ఉన్నాడు. అంటే స్వగృహంలో. అలా, ప్రస్తుతం 11వ ఇంటిలో ఉన్న గురువు నుంచి మంచి ఫలితాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది.  ఏప్రిల్‌లో శని 11వ ఇంటికి  మారే అవకాశం ఉంది. గత సంవత్సరం పెట్టిన శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. కానీ, మీరు దాన, ధ్యానం , అంతర్గత పెరుగుదలల వైపు దృష్టి సారించాలి. దీని ద్వారా మొత్తం సంవత్సరం ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా లాభాలు చేకూరతాయి. పెళ్లికాని వారికి ఈ ఏడాది రెండో అర్థభాగంలో పెళ్లి జరిగే అవకాశం ుంది.


Taurus

వృషభరాశి..
ఈ సంవత్సరం మీరు మీ భాగస్వామి మానసిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆరోగ్య సమస్యలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మంచి ఆహారం & జీవనశైలిని అనుసరించండి. మీ మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది. మీ స్నేహితులు, సహోద్యోగులు , ఇతర వ్యక్తుల నుండి ఈ సంవత్సరం చాలా మద్దతు పొందుతారు ఇప్పుడు మీ ప్రణాళికలను అమలు చేయడానికి సమయం ఆసన్నమైంది. మీరు విజయాన్ని రుచి చూస్తారు.

Gemini

మిధునరాశి
ఈ సంవత్సరం మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. అన్ని పనులకు ప్రతిఫలం ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుంది. మీరు మీ ఉద్యోగంలో విజయం సాధిస్తారు. సామాజిక సేవ, ప్రయాణం, ఆహారం, మానసిక ఆరోగ్యం, లైఫ్ సైన్స్, పబ్లిక్ స్పీకింగ్, కళ , సాహిత్యం చాలా విషయాల్లో విజయవంతమౌతారు. ఇప్పటికే రిలేషన్ షిప్ లో ఉన్న వారికి మే తర్వాత వివాహం అవుతుంది.

Cancer

కర్కాటక రాశి..
కర్కాటక రాశివారికి ఈ ఏడాది చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మీరు మీ ప్రయత్నాన్ని పూర్తి చేస్తే విజయం ఖాయం. ఇంటి సభ్యుల భద్రతపై చాలా శ్రద్ధ వహించండి. మీకు , మీ జీవిత భాగస్వామికి మధ్య అంతరం పెరగకుండా జాగ్రత్త వహించండి. మీ భాగస్వామి మీ మానసిక ,భావోద్వేగ శక్తి అని గుర్తుంచుకోండి. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టండి.

leo


సింహ రాశి
భాగస్వామిని కనుగొనడానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సింగిల్ లైఫ్ కి ఎండ్ కార్డ్ పడుతుంది. మీ జీవిత భాగస్వామి లో దాగి ఉన్న ప్రతిభ , లక్షణాలు ఏప్రిల్‌లో వెలుగులోకి వస్తాయి. కమ్యూనికేషన్ కళను మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. సంబంధాలు మెరుగుపడతాయి. మరింత ఆరోగ్య సంరక్షణ అవసరం. కెరీర్ బాగానే సాగుతుంది.

Virgo

కన్య రాశి 
ఈ రాశివారికి... ఆర్థిక రంగాల వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీ  సమస్యల లోతును అర్థం చేసుకోని ముందుకు సాగుతారు, సంవత్సరం ద్వితీయార్థంలో కెరీర్‌లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కమ్యూనికేషన్, మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్, జర్నలిజం, బిజినెస్, ట్రావెల్ కెరీర్‌లలో ఉన్న వారికి గొప్ప సంవత్సరం.

Libra

తులారాశి 
ఒంటరిగా ఉన్నవారు ఈ ఏడాది  భాగస్వామిని పొందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం వివాహాలు ఘనంగా జరగనున్నాయి. దీర్ఘకాలికంగా ఉండబోతున్నాయి. చేయవలసిన పనుల జాబితాపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. లక్ష్యసాధనలో పట్టుదలతో పనిచేస్తే విజయం వరిస్తుంది.

Scorpio

వృశ్చికరాశి
ఈ సంవత్సరం మీరు నాయకత్వం వహిస్తారు. ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. పని-జీవిత సమతుల్యత కష్టంగా ఉంటుంది. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకోండి. ఇప్పటికే పెళ్లయిన పిల్లల గురించి ఆలోచించడానికి ఈ సంవత్సరం సరైన సమయం. ఈ సంవత్సరం, పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు.

ధనుస్సు రాశి
వ్యాపార అవకాశాలు  కోసం వెతుకుతున్న వారికి సవాలుగా ఉంటాయి. వివాహితులు తమ కుటుంబ లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. కలుషిత వాతావరణానికి ఎక్కువగా గురికావద్దు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ సంవత్సరం మీకు బాగానే ఉంటుంది. కలలు ముఖ్యమైనవి అయితే, లక్ష్యాలను నిర్దేశించుకోవడం మిమ్మల్ని విజయానికి దారి తీస్తుంది.

Capricorn

మకర రాశి
కలిసిపోవడానికి గొప్ప సమయం. కుటుంబ సభ్యుల పూర్తి సహకారం ఉంటుంది. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇది కరెక్ట్ సమయం. లేకపోతే, మీరు వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, భారీ స్థాయి సేవా పరిశ్రమలలో పెట్టుబడి పెట్టవచ్చు. కెరీర్ చాలా బాగుంటుంది.

కుంభ రాశి
కెరీర్‌కు చాలా క్రమశిక్షణ , స్పష్టమైన ఆలోచన అవసరం. సామాజిక సేవల్లో నిమగ్నమవ్వడానికి ఉత్తమ సమయం. సంవత్సరంలో రెండవ కాలంలో డబ్బు ముఖ్యమైనది. ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలి.జీవితం బాగుపడుతోంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలపై మరింత దృష్టి పెట్టాలి. యోగా, ధ్యానం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రాక్టీస్ చేయండి.

pices

మీనరాశి
మీరు అన్నివిధాల ఎదుగడం ప్రారంభమౌతుంది.  మీరు మరింత క్రమశిక్షణతో ఉండాలి. ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక శక్తి వల్ల సానుకూల మార్పు సాధ్యమవుతుంది. పాత పని ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. మీరు కెరీర్‌లో క్రమశిక్షణను సాధిస్తారు.

Latest Videos

click me!