ఇంటి ప్రవేశ ద్వారం...
ప్రతి ఒక్కరి ఇంట్లోనూ పూజ గది ఉంటుంది. ఆ పూజ గది తలుపుకు ఎప్పుడూ ఓంకారం రాయాలి. అంతేకాదు, మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు కూడా ఓంకారం గీయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. అప్పుల సమస్య కూడా తీరుతుంది. ఇక.. ఇంటి ప్రధాన ద్వారం ముందు వినాయకుడి ఫోటోని ఉంచడం వల్ల చాలా మేలు జరుగుతుంది. నిమ్మకాయ, పచ్చి మిరపకాయలు వేలాడదీస్తే.. దిష్టి కూడా తగలదు.
నైరుతి మూల కూడా ముఖ్యమే...
ఇంటి నైరుతి దిశ శక్తికి ప్రతీక. ఈ దిశలో తేలికపాటి వస్తువులను ఉంచడం లేదా ఖాళీగా వదిలేయడం మీ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది. ఇది ఇంట్లో డబ్బును తగ్గించడమే కాకుండా, అప్పుల సమస్యలను కూడా పెంచుతుంది. కాబట్టి, బ్యాంకు రుణ సమస్యలను నివారించడానికి, ఈ మూలలో బరువైన వస్తువులను ఉంచండి. బరువైన వస్తువులలో ఇనుప అల్మరాలు, భారీ ఫర్నిచర్, బరువైన బల్లలు మొదలైనవి ఉంటాయి. ఇది కాకుండా, మీరు ఇక్కడ ఎరుపు లేదా పసుపు రంగు వస్తువులను ఉంచవచ్చు. ఈ మూలలో కూర్చుని ప్రతి శనివారం హనుమాన్ మంత్రాన్ని జపించడం ద్వారా, మీరు మీ అప్పుల సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.