మనీ ప్లాంట్ (Money Plant): మనీ ప్లాంట్ మొక్క ఉండే ఇంటిలో డబ్బులు ఎక్కువగా ఉంటాయని చాలా మంది భావిస్తారు. అయితే ఇది మనకు నేరుగా డబ్బులు ఇవ్వదు. రాత్రి పగలు మనకు ఆక్సిజన్‌ను అందించి ఆరోగ్యంగా (Healthy) ఉండేందుకు సహాయపడుతుంది. ఆరోగ్యానికి కంటే ముఖ్యమైన ఆస్తి మనకు ఇంకేం కావాలి. కనుక నేరుగా డబ్బులు ఇవ్వకుండా ఆరోగ్యాన్ని అందించి ఆర్థికపరంగా మెరుగుపరుస్తుంది. అందుకే దీన్ని మనీప్లాంట్ అంటారు.
మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల అనేక ప్రయోజనాలను పొందగలం. ఇంటి బయట కాకుండా ఇంటి లోపల పెరిగినప్పుడు గరిష్ట ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని ఏదైనా సీసాలో లేదా మినీ జార్లో పెంచుకోవచ్చు. మనీ ప్లాంట్‌ను ఇంటి వెలుపల ఉంచినట్లయితే, నేరుగా సూర్యరశ్మి తగలకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్‌ను మీ ఇంటి తలుపు దగ్గర లేదా మీ ఫ్లాట్ బాల్కనీలో ఉంచండి. మనీ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్. దాన్ని బయట పెట్టకూడదు. మనీ ప్లాంట్‌ను తరచుగా ఇంట్లో లేదా కార్యాలయంలో ప్రజలు నాటారు, ఈ మొక్కకు ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు.