దాంపత్య జీవితంలో ఏ రాశివారు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?

First Published | May 16, 2023, 6:49 AM IST

వీరు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అంతేకాదు, తమ భాగస్వామి చెప్పే ప్రతి విషయాన్ని చాలా ఓపికగా వింటారు. 

దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఆ జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తారు. అయితే అందరూ ఒకేలా ఉండారు. ఒకరు ప్రేమగా ఉంటే, మరికొందరు డామినేటింగ్ నేచర్ తో ఉంటారు. మరి జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దాం...
 

Zodiac Sign

1.మేష రాశి..
మేష రాశివారు తమ భాగస్వామి పై చాలా డామినేటింగ్ గా ఉంటారు. అన్ని విషయాలు తాము అనుకున్నట్లే జరగాలని అనుకుంటూ ఉంటారు.


Zodiac Sign

2.వృషభ రాశి..
ఒక పర్ఫెక్ట్ పార్ట్ నర్ కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ వృషభ రాశిలో ఉన్నాయి. వీరు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అంతేకాదు, తమ భాగస్వామి చెప్పే ప్రతి విషయాన్ని చాలా ఓపికగా వింటారు. 

Zodiac Sign

3.మిథున రాశి...
మిథున రాశివారికి దాంపత్య జీవితంలో ఎలా ఉండాలి అనే విషయంలో కనీసం క్లూ కూడా లేదు. చాలా సార్లు వారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలీదు.

Zodiac Sign

4.కర్కాటక రాశి..

కర్కాటక రాశివారు దాంపత్య జీవితంలో ముఖ్యంగా తమ పార్ట్ నర్ దగ్గర చాలా అమాయకంగా ఉంటారు. కానీ అదంతా పూర్తిగా నటనే. నిజానికి వీరు  చాలా సిల్లీగా ఉంటారరు.
 

Zodiac Sign

5.సింహ రాశి..
దాంపత్య జీవితంలో ఈ సింహ రాశివారు చాలా సీరియస్ గా ఉంటారు. కనీసం ఒక్క సెకన్ కూడా వీరు సరదాగా ఉండరు. సీరియస్ గానే ఉంటారు

Zodiac Sign

6.కన్య రాశి..
కన్య  రాశివారు తమ భాగస్వామి ముందు చాలా అమాయకంగా నటిస్తారు. కానీ ఈ రాశివారు ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి ముందు ఉంటారు.

Zodiac Sign

7.తుల రాశి..
తుల రాశివారు తమ భాగస్వామి ముందు అభద్రతా భావంతో ఉన్నట్లు ఫీలౌతారు. కానీ ఈ రాశివారు మిగిలిన విషయాల్లో మాత్రం చాలా గ్రేట్ గా ఉంటారు.

Zodiac Sign


8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు చాలా రొమాంటిక్ గా ఉంటారు. తమ భాగస్వామితో శృంగారంలో పాల్గొనేందుకు ఎక్కువగా చొరవ చూపిస్తూ ఉంటారు.

Zodiac Sign

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు తమ మనసులో ఉన్న విషయాలను తొందరగా బయటపెట్టాలని అనుకోరు. ఎందుకంటే మాటలకు ఫిల్టర్ వాడటం వీరి వల్ల కాదు. అందుకే దానికి బదులు మాట్లాడకుండా ఉంటారు.

Zodiac Sign

10.మకర రాశి..
ఈ రాశివారికి దాంపత్య జీవితాన్ని ఆస్వాదించడం బాగా తెలుసు. ఒక వేళ ఈ రాశివారికి పెళ్లి కాకపోతే, ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని ఆరాటపడుతూ ఉంటారు.

Zodiac Sign

11.కుంభ రాశి..
కుంభ రాశివారి వ్యక్తిత్వం చాలా అరుదుగా ఉంటుంది. వీరు బంధానికి ఎక్కువ విలువ ఇస్తారు. అదేవిధంగా తమ స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండాలని అనుకుంటూ ఉంటారు.

Zodiac Sign

12.మీన రాశి..
మీన రాశివారికి తమ భాగస్వామితో గొడవలు పడటం ఇష్టం ఉండదు. అందుకే ముందుగానే వీరే క్షమాపణలు చెబుతూ ఉంటారు.

Latest Videos

click me!